BAD NEWS FOR ANDROID USERS IT IS NO LONGER POSSIBLE TO BUY E BOOKS ON AMAZON FULL DETAILS HERE GH VB
Amazon Users: ఆండ్రాయిడ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇకపై వాటిని కొనడం సాధ్యం కాదు.. వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon).. ఆండ్రాయిడ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆండ్రాయిడ్ యాప్ యూజర్లు (Android App Users) అమెజాన్ నుంచి ఈ-బుక్స్ (E-books) కొనుగోలు చేయడం కుదరదని ప్రకటించింది.
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon).. ఆండ్రాయిడ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆండ్రాయిడ్ యాప్ యూజర్లు (Android App Users) అమెజాన్ నుంచి ఈ-బుక్స్ (E-books) కొనుగోలు చేయడం కుదరదని ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి గూగుల్ బిల్లింగ్ పాలసీ(Google’s Billing Policy)లో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా ఉండేందుకు అమెజాన్ కంపెనీ ఆండ్రాయిడ్ యాప్‌లో ఈ-బుక్స్ (Kindled Books) కొనుగోలు చేసే ఫెసిలిటీని తొలగించింది. దీంతో ఇకపై ఆండ్రాయిడ్ యాప్, ఈ-రీడర్ వంటి ఆండ్రాయిడ్ డివైజ్‌ల ద్వారా ఈ-బుక్స్ కొనుగోలు చేయడం సాధ్యం కాదు. అన్ని ప్లే స్టోర్ యాప్స్ తమ సొంత బిల్లింగ్ సిస్టమ్ కాకుండా ప్లే స్టోర్ బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించాలని గూగుల్ కోరుకుంటోంది. లేనిపక్షంలో ప్లేస్ స్టోర్ నుంచి ఆ యాప్స్‌ను తొలగిస్తామని చెప్పింది. అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇదే ప్రధాన కారణం.
ఒకవేళ గూగుల్ బిల్లింగ్ సిస్టమ్‌కు బదులుగా యాప్ డెవలపర్లు తమ సొంత బిల్డింగ్ సిస్టమ్ ఉపయోగిస్తే గూగుల్ కి వారు కమీషన్ చెల్లించుకోవాల్సి వస్తుంది. గూగుల్ బిల్డింగ్ సిస్టమ్ పై కాకుండా ఎక్స్టర్నల్ ప్లాట్‌ఫామ్‌లపై యూజర్లు చేసే ట్రాన్సాక్షన్ల కోసం గూగుల్ కొంత కమిషన్ తీసుకుంటుంది. ఈ నిర్దిష్ట కమీషన్ చెల్లించకూడదనే ఉద్దేశంతో అమెజాన్ తన ఆండ్రాయిడ్ యాప్ నుంచి ఈ-బుక్స్ కొనుగోళ్లను నిలిపివేసింది. మీరు అమెజాన్ ద్వారా పుస్తకాలను చదవడానికి ఫోన్, ఈ-రీడర్ వంటి ఆండ్రాయిడ్ డివైజ్ ఉపయోగిస్తుంటే, ఇప్పటి నుంచి అది సాధ్యం కాదు. దీనివల్ల చాలా సమయం వృధా అవడంతో పాటు శ్రమ పడాల్సి ఉంది.
ఇప్పుడు అమెజాన్ ఆండ్రాయిడ్ యాప్‌లో ఈ-బుక్స్‌పై బయ్ (Buy) అని క్లిక్ చేస్తే మరొక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో “వై కాంట్ ఐ బయ్ ఆన్ ది యాప్” అని ఒక లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే "Google Play Store విధానాలకు అనుగుణంగా ఉండటానికి, మీరు ఇకపై యాప్ నుంచి కొత్త కంటెంట్‌ను కొనుగోలు చేయలేరు. మీరు యాప్‌లో రీడింగ్ లిస్ట్‌ను రూపొందించి, మీ బ్రౌజర్లోని అమెజాన్ వెబ్సైట్ ద్వారా బుక్స్ కొనుగోలు చేయవచ్చు." అని కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్ యాప్‌ను అప్డేట్ చేసినా... ఆండ్రాయిడ్ యాప్‌లో డిజిటల్ బుక్స్ కొనుగోలు చేయలేరని తెలియజేస్తూ మీకు నోటిఫికేషన్ ఇవ్వడం కూడా మీరు గమనించవచ్చు. జూన్ 1 నాటికి ఏ డెవలపర్ అయినా బిల్లింగ్ సిస్టమ్‌లో మార్పులు చేయకపోతే ప్లే స్టోర్ నుంచి వారి యాప్స్ డిలీట్ చేస్తామని గూగుల్ పేర్కొంది. ఈ గూగుల్ బిజినెస్ పాలసీతో అమెజాన్ సంతృప్తి చెందింది. అందుకే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండాలని నిర్ణయించింది.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ-బుక్స్ ఎలా కొనుగోలు చేయాలి?
కొనుగోలుదారులు తమకు నచ్చిన ఈ-బుక్స్ కోసం యాప్‌లో రీడింగ్ లిస్ట్‌ను సెటప్ చేయాలని.. ఆ ఈ-బుక్స్ కొనుగోలు చేయడానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని వెబ్ బ్రౌజర్ ద్వారా అమెజాన్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలని కంపెనీ యూజర్లకు సూచించింది. అమెజాన్ కొద్ది రోజుల క్రితం నుంచి ePub ఫార్మాట్ కు సపోర్ట్ చేయడం ప్రారంభించింది. దీనివల్ల మిలియన్ల కొద్దీ బుక్స్ కిండ్ల్ (Kindled) ఈ-రీడర్‌కి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతాయి. వినియోగదారు చేయవలసిందల్లా ఫీచర్‌ని ఉపయోగించి ఫైల్‌ను డివైజ్ కి పంపడమే. అమెజాన్ దాన్ని ఈ-రీడర్లో చదవడానికి అనుమతిస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.