హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Biofuel: బ్యాక్టీరియా నుంచి బయో ఫ్యూయల్‌.. రాకెట్లను కూడా లాంచ్‌ చేయగలిగే సామర్థ్యం.. ఇవీ ప్రత్యేకతలు

Biofuel: బ్యాక్టీరియా నుంచి బయో ఫ్యూయల్‌.. రాకెట్లను కూడా లాంచ్‌ చేయగలిగే సామర్థ్యం.. ఇవీ ప్రత్యేకతలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బాక్టీరియా (Bacteria) నుంచి తయారు చేసిన మాలిక్యూల్‌ను (Molecule) ఉపయోగించి పవర్‌ఫుల్‌ బయో ఫ్యూయల్‌ను (Powerfull Biofuel) తయారు చేశారు శాస్త్రవేత్తలు. రాకెట్లను లాంచ్‌ చేసేంత శక్తి ఈ బయో ఫ్యూయల్‌కు ఉంటుందని వారు పేర్కొన్నారు.

Biofuel with Bacteria:  బ్యాక్టీరియా (Bacteria) నుంచి తయారు చేసిన మాలిక్యూల్‌ను (Molecule) ఉపయోగించి పవర్‌ఫుల్‌ బయో ఫ్యూయల్‌ను (Powerfull Biofuel) తయారు చేశారు శాస్త్రవేత్తలు. రాకెట్లను లాంచ్‌ చేసేంత శక్తి ఈ బయో ఫ్యూయల్‌కు ఉంటుందని వారు పేర్కొన్నారు. యూఎస్‌లోని లారెన్స్ బర్కిలీ నేషనల్ లాబొరేటరీ (బర్కిలీ ల్యాబ్) నేతృత్వంలోని బయో ఫ్యూయల్‌ నిపుణుల బృందం దీనిపై ప్రయోగాలు చేసి అద్భుతమైన ఫలితాలు సాధించింది. స్ట్రెప్టోమైసెస్ బ్యాక్టీరియాతో తయారైన అసాధారణ యాంటీ ఫంగల్ మాలిక్యూల్‌ను వారు ఇందుకు ఉపయోగించారు. మొత్తానికి పూర్తిగా కొత్త రకం ప్యూయల్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న హెవీ డ్యూటీ ఫ్యూయల్స్‌, నాసా ఉపయోగించే రాకెట్ ఫ్యూయల్స్‌ కంటే ఇది పవర్‌ఫుల్‌ అని పరిశోధకులు చెబుతున్నారు.

Google Assistant: గూగుల్ అసిస్టెంట్ వాడుతున్నారా? ఈ అదిరిపోయే ఫీచర్లను అస్సలు మిస్ చేయకండి

సింథటిక్ బయాలజీ పయనీర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ ఎనర్జీ జాయింట్ బయోఎనర్జీ ఇన్స్టిట్యూట్ (JBEI) సీఈవో, ప్రాజెక్ట్ లీడర్, జే కీస్లింగ్ మాట్లాడుతూ.. ‘ఈ బయోసింథటిక్ మార్గం అధిక శక్తివంతమైన ఫ్యూయల్‌కు స్వచ్ఛమైన మార్గాన్ని అందిస్తుంది. దీనికి ముందు పెట్రోలియం నుంచి అత్యంత విషపూరిత సింథసిస్‌ ప్రాసెస్‌ ద్వారా మాత్రమే ఉత్పత్తి చేసేవారు. ఈ ఫ్యూయల్ మొక్కల పదార్థంతో కూడిన బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి అవుతుంది. వాతావరణం నుంచి తీసుకున్న కార్బన్ డయాక్సైడ్ నుంచి తయారవుతుంది. వాటిని ఇంజిన్లలో మండించడం వల్ల పెట్రోలియం నుంచి ఉత్పత్తి అయిన ఫ్యూయల్‌ కంటే గ్రీన్‌హౌస్ వాయువు పరిమాణాన్ని గణనీయంగా తగ్గిస్తుంది’ అని చెప్పారు.

ప్రయోగశాలలో పెరగడం అసాధ్యం

ఈ ఫ్యూయల్‌ నుంచి రూపొందిన ఇంధనాలు కూడా చాలా శక్తివంతంగా ఉంటాయని, వాటి ద్వారా రాకెట్ల ప్రస్తుత సామర్థ్యాలను పెంచే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ ప్రక్రియలో ఉపయోగించిన కీలకమైన మాలిక్యూల్స్‌ను POP-FAMEలు (పాలిసైల్‌కోప్రొపనేటెడ్ ఫ్యాటీ యాసిడ్ మిథైల్ ఈస్టర్స్) అంటారు. రెండూ స్ట్రెప్టోమైసెస్ బ్యాక్టీరియా ద్వారా తయారయ్యాయి. ఇవి ప్రయోగశాలలో పెరగడం అసాధ్యం.

తదుపరి పరీక్షలకు కనీసం 10 కిలోలు అవసరం

ఉత్పాదకత విషయానికి వస్తే బ్యాక్టీరియా అంతగా సహకరించలేదు. స్ట్రెప్టోమైసెస్ ఇంజనీరింగ్ తగినంత పరిమాణంలో POP-FAMEలను తయారు చేయడంలో విఫలమైంది. రాకెట్ ఫ్యూయల్‌ అభివృద్ధిలో తదుపరి ప్రయోగాత్మక పరీక్షల కోసం తగినంత మాలిక్యూల్స్‌ ఉత్పత్తి చేయడం అవసరం. దీనికి సాధారణంగా కనీసం 10 కిలోలు అవసరం. పరిశోధకులు ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు.

Apple iPhone: వర్షంలో మాత్రమే కాదు.. నీటి అడుగునా వాడగలిగే ఐఫోన్.. ఎలా పనిచేస్తుందంటే..

కానీ, POP ఫ్యూయల్‌ క్యాండిడేట్స్‌ గది ఉష్ణోగ్రత వద్ద సురక్షితంగా, స్థిరంగా ఉంటాయని, రసాయన ప్రాసెసింగ్ తర్వాత లీటరుకు 50 మెగాజౌల్స్ కంటే ఎక్కువ శక్తి సాంద్రత విలువలు ఉంటాయని స్టిములేషన్‌ డేటా సూచిస్తుంది. సాధారణ గ్యాసోలిన్ విలువ లీటరుకు 32 మెగాజౌల్స్, కిరోసిన్ బేస్డ్ రాకెట్ ఫ్యూయల్‌ అయిన RP1 విలువ దాదాపు 35 మెగాజౌల్స్‌ ఉంటుంది. శాస్త్రవేత్తలు మొక్క వ్యర్థ ఆహార వనరుల నుంచి పెద్ద మొత్తంలో POP మాలిక్యూల్స్‌ను ఉత్పత్తి చేయగల వర్క్‌హార్స్ బ్యాక్టీరియా జాతికి ఇంజినీరింగ్ చేయాలని భావిస్తున్నారు. ఇది కార్బన్-న్యూట్రల్ ఫ్యూయల్‌ను తయారు చేయగలదు.

First published:

Tags: Fuel, Rocket Launching, Technology

ఉత్తమ కథలు