ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా 'బ్యాక్ టు కాలేజ్' పేరుతో సరికొత్త సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అనేక స్మార్ట్ ఉత్పత్తులపై బెస్ట్ డీల్స్ ప్రకటించింది. ఎంచుకున్న మోడళ్లపై నో కాస్ట్ ఈఎంఐ, డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్, ఇతర గాడ్జెట్లపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు, హైస్కూల్ విద్యార్థుల కోసం వేదాంటు, తోప్పర్, అవిష్కార్, ప్రోగ్రాడ్ వంటి ఎడ్టెక్ యాప్స్‌లోని ఆన్లైన్ కోర్సులపై సుమారు రూ. 20,000 వరకు తగ్గింపు ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ జూలై 31 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్ ఉన్నాయి.
పెవిలియన్ కోర్ ఐ 5 ల్యాప్‌టాప్
అమెజాన్ బ్యాక్ టు కాలేజ్ సేల్‌లో భాగంగా 11వ జనరేషన్ హెచ్‌పి పెవిలియన్ కోర్ ఐ 5 ల్యాప్‌టాప్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 66,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది 16 జిబి ర్యామ్, 512 జిబి ఎస్ఎస్డితో వస్తుంది. దీనిలో ప్రీ ఇన్స్టాల్డ్ విండోస్ 10, ఎంఎస్ ఆఫీస్ 2019 అందించింది. 1.41 కిలోల బరువు గల ఈ ల్యాప్‌టాప్‌లో క్విక్ ఛార్జ్ ఫంక్షన్, ఫింగర్ ప్రింట్ రీడర్ వంటివి చేర్చింది.
హెచ్‌పి 14 (2021) 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ 3 ల్యాప్‌టాప్
సేల్‌లో భాగంగా హెచ్‌పి 14 (2021) 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ 3 ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.41,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 14- అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్ప్లే గల ఈ ల్యాప్‌టాప్‌లో అలెక్సా ఇన్‌బిల్ట్, 8 జిబి ర్యామ్, 256 జిబి ఎస్ఎస్డి వంటివి చేర్చింది. అంతేకాదు, విండోస్ 10, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ & స్టూడెంట్ 2019 ప్రీఇన్స్టాల్తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను విండోస్ 11 కి అప్‌గ్రేడ్ చేయవచ్చు.
లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 ల్యాప్‌టాప్
సేల్‌లో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌ను రూ.66,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 ఇంటెల్ కోర్ ఐ 5 11వ జనరేషన్ ల్యాప్‌టాప్ 16 జిబి ర్యామ్, 512 జిబి ఎస్ఎస్డితో వస్తుంది. 15.6 -అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ఐపిఎస్ డిస్ప్లే గల ఈ ల్యాప్‌ట్యాప్‌లో విండోస్ 10, ఎంఎస్ ఆఫీస్ హోమ్, స్టూడెంట్ 2019 ప్రీఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. దీనిలో ఫింగర్ ప్రింట్ రీడర్, డాల్బీ ఆడియో స్పీకర్ వంటివి చేర్చింది.
సేల్‌లో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 39,190 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 14- అంగుళాల ఈ ల్యాప్‌టాప్ FHD యాంటీ గ్లేర్ LED బ్యాక్‌లైట్, నారో బెజిల్ WVA డిస్ప్లేతో వస్తుంది. దీనిలో 4 జిబి ర్యామ్, 1 టిబి హెచ్‌డిడి, 256 జిబి ఎస్ఎస్డి, ఎక్స్ప్రెస్ఛార్జ్ బ్యాటరీ, 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను అందించారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.