హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో 'బ్యాక్ టు కాలేజ్' సేల్... ఆఫర్స్ ఇవే

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో 'బ్యాక్ టు కాలేజ్' సేల్... ఆఫర్స్ ఇవే

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో 'బ్యాక్ టు కాలేజ్' సేల్... ఆఫర్స్ ఇవే
(image: Flipkart)

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో 'బ్యాక్ టు కాలేజ్' సేల్... ఆఫర్స్ ఇవే (image: Flipkart)

Flipkart Back to College Carnival | ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాక్ టు కాలేజ్ కార్నివాల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో ఆఫర్స్, డీల్స్ గురించి తెలుసుకోండి.

ప్రముఖ ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అమెజాన్​కు గట్టి పోటీనిస్తూ ప్రత్యేక సేల్స్​ నిర్వహిస్తోంది. కరోనాతో సుదీర్ఘకాలంగా తెరుచుకోని స్కూళ్లు, కాలేజీలు త్వరలోనే ప్రారంభం కానుండటంతో వారి కోసం ప్రత్యేక సేల్​ ప్రారంభించింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 'బ్యాక్​ టు కాలేజ్​ గాడ్జెట్ష్​ కార్నివల్​ సేల్​'ను సంస్థ మొదలు పెట్టింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్​ జూన్ 24 వరకు కొనసాగనుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగపడే ప్రముఖ గాడ్జెట్స్‌పై 80 శాతం డిస్కౌంట్​ అందిస్తోంది. ఇక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్​ లభిస్తుంది. EMI ఆప్షన్​తో కూడా ఈ గాడ్జెట్స్​ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.

Mi 11 Lite: ఎంఐ 11 లైట్ వచ్చేసింది... రూ.3,000 డిస్కౌంట్ పొందండి ఇలా

Motorola Rugged Mobile: ఈ స్మార్ట్‌ఫోన్‌ను నీళ్లల్లో నానబెట్టి, సబ్బుతో కడిగేయొచ్చు

ఫ్లిప్​కార్ట్​ సేల్​లో భాగంగా బోట్​, వన్‌ప్లస్, జెబిఎల్, రియల్‌మీ, ఫిలిప్స్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన బ్లూటూత్, హెడ్‌ఫోన్‌లపై 60 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇక, బోట్​ ఎయిర్‌డోప్స్​ 131 బ్లూటూత్ హెడ్‌సెట్​పై 56 శాతం డిస్కౌంట్​ లభిస్తుంది. వీటిని రూ.1,299 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. మివి డుయోపాడ్స్ ఎం 20 ట్రూ వైర్‌లెస్ బ్లూటూత్ హెడ్‌సెట్​ను కేవలం రూ .999 ధర వద్దే లభిస్తుంది. రియల్​మీ బడ్స్ వైర్డ్ హెడ్‌సెట్​ను రూ .599 ధర వద్దే కొనుగోలు చేయవచ్చు. టాబ్లెట్లు, గేమింగ్ మానిటర్లపై ఫ్లిప్‌కార్ట్ 45 శాతం తగ్గింపును కూడా ఇస్తోంది.

ఈ సేల్​లో భాగంగా ప్రింటర్లను రూ. 2,199, సాలిడ్-స్టేట్ డ్రైవ్‌ లేదా SSDని రూ. 5,999 ప్రారంభ ధర వద్దే కొనుగోలు చేయవచ్చు. ఇక, యూపిఎస్​ను రూ. 1799 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. వీటితో పాటు ప్రముఖ కంపెనీలకు చెందిన బ్లూటూత్, పార్టీ స్పీకర్లపై వరుసగా 60 శాతం, 70 శాతం డిస్కౌంట్​ పొందవచ్చు.

Samsung Galaxy M32: రూ.14,999 ధరతో సాంసంగ్ గెలాక్సీ ఎం32 రిలీజ్... ఫీచర్స్ ఇవే

WhatsApp Status: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఇక ఆ ఫీచర్ ఉండదు


జూన్ 24 వరకు ఆఫర్లు

విద్యార్థులకు ఎంతో కీలకంగా ఉపయోగపడే ల్యాప్​టాప్​లపై కూడా భారీ ఆఫర్లను ప్రకటించింది. సాధారణ ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లకు ప్రత్యేక డిస్కౌంట్​ ప్రకటించింది. ఈ ల్యాప్​టాప్​లు రూ .30,000 ప్రారంభ ధర వద్ద లభిస్తాయి. మరోవైపు ల్యాప్‌టాప్ స్టాండ్లు, కీబోర్ట్​, మౌస్​పై కూడా డిస్కౌంట్​ అందిస్తోంది. హెచ్‌పి, లెనోవా, ఆసుస్, ఎసెర్, డెల్, హెచ్‌పి వంటి బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లు ఈ సేల్​లో తక్కువ రేటుకే లభిస్తాయి. లెనోవా ఐడియా ప్యాడ్ ఎస్ 145 కోర్ ఐ 5 10వ జెన్ ల్యాప్​టాప్​ రూ .43,990 ధర వద్ద లభించనుండగా.. దీనిపై ఏకంగా, 35 శాతం డిస్కౌంట్​ అందజేస్తుంది. నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 కోర్ ఐ 5 10 వ జెన్​ను రూ .47,990 ధర వద్దే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్​లో విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడే గాడ్జెట్స్​పై దృష్టిసారించింది. ఈ ప్రత్యేక డిస్కౌంట్లతో సేల్స్​ పెంచుకోవాలని భావిస్తోంది.

First published:

Tags: Flipkart, Hdfc, HDFC bank

ఉత్తమ కథలు