వాట్సాప్ కు పతంజలి షాక్..!

news18
Updated: August 15, 2018, 7:03 PM IST
వాట్సాప్ కు పతంజలి షాక్..!
patanjali kimbho app screen shot
  • News18
  • Last Updated: August 15, 2018, 7:03 PM IST
  • Share this:
స్వదేశీ మంత్రతో ఎన్నో రకాల ఉత్పత్తులతో రిటైల్ రంగంలో దూసుకెళ్తున్న పతంజలి.. ఇప్పుడు సరికొత్త  ఇన్సింగ్స్ ప్రారంభించింది. టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గామాారింది. ఇటీవల బీఎస్ ఎన్ ఎల్ తో కలిసి స్వదేశీ సిమ్ లను లాంచ్ చేసిన పతంజలి గ్రూప్...తాజాగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది. ఏకంగా సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ కే  సవాల్ విసురుతూ సరికొత్త మెసేజింగ్ యాప్ ను లాంచ్ చేసింది.



పతంజలి ఆవిష్కరించిన మొబైల్ అప్లికేషన్ పేరు కింభో. అచ్చం వాట్సాప్ లోగో మాదిరే కనిపిస్తుంది. లోగో మధ్యలో శంఖం గుర్తు ఉంటుంది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ ఆ యాప్ లభిస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని వినియోగిస్తున్నారు. యోగా గురు బాబా రాందేవ్ యాప్ ను లాంచ్ చేసిన అనంతరం.. పతంజలి ప్రతినిధి ఎస్ జే తిజరావాలా ట్వీట్ చేశారు. ‘ఇకపై భారత్ మాట్లడనుంది. కింభో రూపంలో వాట్సాప్ కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ స్వదేశీ మెసేజింగ్ ప్లాట్ ఫాంను నేరుగా ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోండి’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.



కింభో అనేది సంస్క్రుత పదం. .  హలో, ఎలా ఉన్నారు, వాట్ప్ అప్ అని  సంబోధించేందుకు  సంస్క్రుతంలో కింభో పదం ఉపయోగిస్తారు. కింభో అర్ధాన్ని వివరిస్తూ తిజరావాలా మరో  ట్వీట్ చేశారు. ‘ఎదుటి వారు  ఎలా ఉన్నారని తెలుసుకునేందుకు కింభోను వాడతారు. కింభో భయ్యా అంటే..  అన్నా ఎలా ఉన్నారు. ఏం చేస్తున్నారు అని అర్ధం వస్తుంది. ఇకపై భారత్ అంటుంది..కింభో. ఇకపై భారత్ అడుగుతుంది..కింభో’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.



కింభో మెసేజింగ్ యాప్ లో ప్రైవేట్,గ్రూప్ చాట్ చేసుకోవచ్చు. ఉచిత వాయిస్, వీడియో కాలింగ్ సౌలభ్యం కూడా ఉంటుంది. టెక్ట్స్, ఆడియో, వీడియో, ఫొటోలు, స్టిక్కర్లను పంపవచ్చు. అంతేకాదు లొకేషన్ కూడా షేర్ చేసుకోవచ్చు. డూడుల్ క్రియేట్ చేసింది అవతలి వారికి షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో ఉన్న అన్ని సేవలు కింభోలో లభిస్తాయి.



ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ కు తిరుగులేదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 100 కోట్ల మంది వాట్సప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. అసలు వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదు. అలాంటి మెసేజింగ్ యాప్ ను ఇప్పుడు పతంజలి ఢీకొడుతోంది. మరి ఇది మేర ప్రభావం చూపుతుంది.. స్వదేశీ పేరుతో వస్తున్న కింభోను భారతీయులు ఎంత మేర ఆదరిస్తారో చూడాలి.
Published by: Shiva Kumar Addula
First published: May 31, 2018, 5:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading