కింభో కాదు.. కిల్లర్ యాప్..!

ప్లేస్టోర్ కుప్పలు తెప్పలుగా నకిలీ కింభో యాప్ వచ్చి చేరాయి. దీంతో ఏది అసలుదో.. ఏది ఫేక్‌దో తెలుసో లేక తికమక పడుతున్నారు యూజర్లు.

news18india
Updated: June 28, 2018, 5:50 PM IST
కింభో కాదు.. కిల్లర్ యాప్..!
patanjali kimbho app screen shot
  • Share this:
వాట్సాప్‌కు పోటీగా పతంజలి గ్రూప్ లాంచ్ చేసిన కింభో యాప్ చాలా డేంజరట. ఇది పెద్ద డిజాస్టర్ అని అంతర్జాతీయ డెవలపర్లు అభిప్రాయడుతున్నారు. ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ఐవోఎస్ స్టోర్ల నుంచి యాప్‌ను తొలగించారు. ఐతే ఎందుకు తొలగించారన్న కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇది అత్యంత ప్రమాదకర యాప్ అని.. బగ్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్లేస్టోర్ కుప్పలు తెప్పలుగా నకిలీ కింభో యాప్ వచ్చి చేరాయి. దీంతో ఏది అసలుదో.. ఏది ఫేక్‌దో తెలుసో లేక తికమక పడుతున్నారు యూజర్లు.కింభో యాప్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని ఫ్రెంచ్ సెక్యూరిటీ రీసెర్చర్ ఇలియట్ అండర్సన్ తెలిపారు. ఈ యాప్ వాడిన యూజర్ల డేటాతో పాటు వారు షేర్ చేసుకున్న సందేశాలను తాను యాక్సస్ చేయగలుగుతున్నట్లు వెల్లడించారు. ‘ కింభో యాప్ పెద్ద జోక్. మీడియా ప్రకటన చేయటం కాదు. ముందు మంచి యాప్ డెవలపర్లని నియమించుకోండి. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోకండి. ఓకే.. నేను ఇంతటితో ఆపుతున్నా. కింభో యాప్.. భద్రతా విపత్తు. అందరి సందేశాలను నేను యాక్సెస్ చేయగలుగుతున్నా ’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.మరోవైపు కింభో యాప్.. బోలో అనే యాప్‌ను కాపీ పేస్ట్ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. బోలో యాప్ ఉపయోగించిన ఫొటోలను కింభో యాప్‌లో వాడారని యూజర్లు మండిపడుతున్నారు. రెండు యాప్‌లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు. అటు కింభో యాప్‌లో పాకిస్తానీ నటి కనిపించడంపైనా జోకులు పేలుతున్నాయి. స్వదేశీ యాప్‌కు.. విదేశీ (పాకిస్తాన్) మోడల్‌తో ప్రమోషన్ చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
First published: June 1, 2018, 8:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading