హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Ayya T1: మీరు అమ్మ‌కుంటే.. మేమే త‌యారు చేసుకొంటాం.. యాపిల్‌కు షాక్ ఇచ్చేలా ర‌ష్యా నిర్ణ‌యం!

Ayya T1: మీరు అమ్మ‌కుంటే.. మేమే త‌యారు చేసుకొంటాం.. యాపిల్‌కు షాక్ ఇచ్చేలా ర‌ష్యా నిర్ణ‌యం!

అయ్యా T1 స్మార్ట్‌ఫోన్

అయ్యా T1 స్మార్ట్‌ఫోన్

Ayya T1 | ఉక్రెయిన్‌ను లొంగదీసుకొనే పనిలోనే రష్యా ఉంది. అయితే ప‌లు అమెరిక‌న్ కంపెనీలు, యూరోపియ‌న్ కంపెనీలు ర‌ష్యాలో సేవ‌లు, అమ్మ‌కాలు నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకొన్నాయి. ర‌ష్యా సైనిక చర్యకు ప్రతిస్పందనగా ఆ దేశంలో యాపిల్ సంస్థకు చెందిన అన్ని ఉత్పత్తి అమ్మకాలను నిలిపివేయాలని సంస్థ నిర్ణ‌యించుకొంది. ఈ నేప‌థ్యంలో ర‌ష్యా మ‌రో షాకింగ్ నిర్ణ‌యం తీసుకొంది.

ఇంకా చదవండి ...

ఉక్రెయిన్‌పై(Ukraine) యుద్ధానికి దిగిన రష్యాపై(Russia) అమెరికా సహా పలు యూరోపియన్‌ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పశ్చిమ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా వాటికి ప్రత్యామ్మాయాలు చూసుకొని ఉక్రెయిన్‌ను లొంగదీసుకొనే పనిలోనే రష్యా ఉంది. అయితే ప‌లు అమెరిక‌న్ కంపెనీలు, యూరోపియ‌న్ కంపెనీలు ర‌ష్యాలో సేవ‌లు, అమ్మ‌కాలు నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకొన్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు ఈ కార్డు నెట్‌వర్క్‌లపై రష్యన్‌ ప్రజలకు అందించిన కార్డులు రష్యాలోని పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ టెర్మినల్స్‌, ఏటీఎం కేంద్రాలలో పని చేయవు. అదే విధంగా రష్యన్‌ బ్యాంకుల ద్వారా ఈ నెట్‌వర్క్‌లపై మంజూరు అయిన కార్డులు ప్రపంచంలో మరెక్కడా పని చేయవు.  దీనితోపాటు ఉక్రెయిన్‌లో ష్యా సైనిక చర్యకు ప్రతిస్పందనగా ఆ దేశంలో యాపిల్ సంస్థకు చెందిన అన్ని ఉత్పత్తి అమ్మకాలను నిలిపివేయాలని సంస్థ నిర్ణ‌యించుకొంది.

OTT News: త్వ‌ర‌లో డిస్నీ+హాట్‌స్టార్ నుంచి కొత్త ప్లాన్ వచ్చే చాన్స్‌.. ఎక్కువ మంది యూజ‌ర్లే టార్గెట్‌!

ఈ నేప‌థ్యంలో ర‌ష్యా ఐఫోన్‌కు దీటుగా ప‌నిచేసే స్వ‌దేశీ మొబైల్‌ను వినియోగించాల‌ని త‌న దేశ పౌరుల‌కు ర‌ష్యా పిలుపునిచ్చింది. ఆ ఫోన్ పేరును అయ్యా టీ1గా ర‌ష్యా ప్ర‌క‌టించింది. ఈ అయ్యా టీ1 ఫోన్ ఐఫోన్‌కు ఏమాత్రం తీసిపోద‌ట‌. అయ్యా టీ1 మొబైల్‌ను ర‌ష్యా సంస్థ స్కేల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్‌కు అనుబంధంగా ప‌నిచేస్తున్న స్మార్ట్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసింద‌ట‌.

రష్యన్‌లు ఐఫోన్‌లను వదిలివేయాలని, శక్తివంతమైన, సురక్షితమైన అయ్య T1ని ఉపయోగించాలని రష్యా రాష్ట్ర మంత్రిత్వ శాఖ కోరుకుంటోందని.. ఈ విష‌యాన్ని ఇంటర్నెట్‌లోని తన ప్రొఫైల్ ప్రకారం స్టేట్ డూమా సభ్యురాలు మరియా బుటినా ఇన్‌స్టాగ్ర‌మ్ వేదిక‌గా చెప్పారు.

Windows 11: అదిరిపోయే ఫీచ‌ర్స్‌.. అంత‌కు మించి యూజ‌ర్ ఫ్రెండ్లీ.. విండోస్ 11 ప్ర‌త్యేక‌త‌లు!


ప్ర‌త్యేక‌త‌లు ధ‌ర‌లు

- అయ్యా టీ 1 15 నుంచి 19 వేల రూబుల్స్ విలువ చేస్తుంది.

- ఈ ఫోన్ వాడితే వినియోగ‌దారుల‌పై ఇత‌రులు నిఘా పెట్ట‌లేర‌ట‌.

Electric Vehicle: మార్కెట్‌లో దున్నేయ‌బోతున్న ఈవీలు.. రాబోయే మోడ‌ల్స్‌పై ఓ లుక్ వేయండి

- త‌మ‌పై నిఘా పెట్టాల‌నుకునే వ్య‌క్తుల ఫోన్ల మైక్రోఫోన్‌, కెమెరాల‌ను అయ్యా టీ1 స్ ఆటోమెటిక్‌గా టర్న్ ఆఫ్ చేసేస్తుంద‌ట‌.

- ఇందుకోసం ఈ ఫోన్‌లో ఓ స‌రికొత్త హార్డ్ వేర్ బ‌ట‌న్ కూడా ఉంద‌ని పేర్కొంది.

- ఈ ఫోన్ త్వరలో మొబైల్ ఆండ్రాయిడ్ ఓఎస్ నుంచి రష్యన్ తయారు చేసిన అరోరా ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పనిచేయనుందని సమాచారం.

- ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, మీడియాటెక్‌ హిలీయో పీ70 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది.

- 6.5 అంగుళాల డిస్ప్లే, 4జీబీ ర్యామ్‌, 64 ఇంటర్నల్‌ స్టోరేజీ, 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

- ఈ ఫోన్‌కు 12ఎంపీ, 5ఎంపీ డిజిటల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన కెమెరాలు ఉన్న‌ట్టు స‌మాచారం.

First published:

Tags: Latest Technology, Russia, Russia-Ukraine War

ఉత్తమ కథలు