మొబైల్ యాప్స్... స్మార్ట్‌ఫోన్ యూజర్ల అవసరాలు తీర్చే ఓ సొల్యూషన్. మొబైల్ యాప్స్ లేకపోతే ఫోన్‌లో డిఫాల్ట్‌గా వచ్చే యాప్స్‌తోనే తిప్పలు పడాల్సి వచ్చేది. కానీ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి లక్షలాది యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ప్రతీ సమస్యకు ఏదో ఓ యాప్ రూపంలో ఓ పరిష్కారం కనిపిస్తుంది. అయితే యాప్స్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయి. యాప్ స్టోర్‌లో ఉండే నకిలీ యాప్స్‌తో తిప్పలు తప్పవు. ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకునే ప్లేస్టోర్ యాప్స్‌లో కొన్ని ఫేక్ యాప్స్ కూడా ఉంటాయి. వాటితో నష్టాలు ఎక్కువ. యూజర్ల డేటా లీక్ చేయడం, అతిగా యాడ్స్ పోస్ట్ చేయడం, బ్యాంక్ అకౌంట్ వివరాలు కాజెయ్యడం లాంటి అనేక సమస్యలుంటాయి. అలాంటి యాప్స్‌ని సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు ఎప్పటికప్పుడు గుర్తించి లిస్ట్ వెల్లడిస్తూ ఉంటాయి. ఆ యాప్స్‌ని డిలిట్ చేయాలని హెచ్చరిస్తుంటాయి.
YouTube Down: ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ డౌన్... యూజర్లకు షాక్
Google Photos: గూగుల్ ఫోటోస్ యాప్‌లో మీ ఇమేజెస్ అప్‌లోడ్ చేస్తున్నారా? అయితే షాకే
డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం అయిన అవాస్ట్ గేమర్స్‌ని టార్గెట్ చేస్తున్న యాప్స్‌ని గుర్తించి లిస్ట్ బయటపెట్టింది. మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ ఫ్యాన్స్‌నే ఈ యాప్స్ టార్గెట్ చేస్తున్నాయి. ఫ్లీస్‌వేర్ అప్లికేషన్స్ యూజర్లకు వాల్‌పేపర్స్, మాడిఫికేషన్స్ లాంటి ఎర వేసి డబ్బులు గుంజేస్తున్నాయి. ప్రతీ నెల ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలా యూజర్ల డబ్బులు కాజేస్తున్న 7 యాప్స్‌ని గుర్తించింది అవాస్ట్. మొదట మూడు రోజుల ట్రయల్ పీరియడ్ ఇచ్చి ఆ తర్వాత వారానికి 30 డాలర్లు అంటే సుమారు రూ.2,000 పైనే దోచేస్తున్నాయి. అందుకే ఈ యాప్స్‌కి దూరంగా ఉండాలని అవాస్ట్ హెచ్చరిస్తోంది. ఆ లిస్ట్ ఇదే.
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే
WhatsApp Payments: వాట్సప్ నుంచి డబ్బులు ఈజీగా పంపండి ఇలా
1. Skins, Mods, Maps for Minecraft PE
2. Skins for Roblox
3. Live Wallpapers HD & 3D Background
4. MasterCraft for Minecraft
5. Master for Minecraft
6. Boys and Girls Skins
7. Maps Skins and Mods for Minecraft
ఇప్పటికే ఈ యాప్స్‌ని లక్షలాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని అంచనా. వీటిని డౌన్‌లోడ్ చేసుకోవద్దని అవాస్ట్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకొని ఉంటే అన్‌ఇన్‌స్టాల్ చేయమని సూచిస్తోంది. అంతేకాదు... ఏవైనా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్ చేసినట్టైతే ఆ సబ్‌స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android 10, Mobile App, Playstore