Auto Expo: ఆటో ఎక్స్‌పోలో సరికొత్త టెక్నాలజీని ప్రదర్శించిన రిలయెన్స్ జియో

కనెక్టెడ్ వెహికిల్స్ సొల్యూషన్‌లో హార్డ్‌వేర్, కనెక్టివిటీ, ప్లాట్‌ఫామ్ లాంటి అంశాలుంటాయి. ఈ కనెక్టెడ్ కార్ టెక్నాలజీని రిలయెన్స్ జియో నవీ ముంబై క్యాంపస్‌లో అభివృద్ధి చేస్తోంది.

news18-telugu
Updated: February 5, 2020, 6:36 PM IST
Auto Expo: ఆటో ఎక్స్‌పోలో సరికొత్త టెక్నాలజీని ప్రదర్శించిన రిలయెన్స్ జియో
Auto Expo: ఆటో ఎక్స్‌పోలో సరికొత్త టెక్నాలజీని ప్రదర్శించిన రిలయెన్స్ జియో (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిలయెన్స్ జియో... టెలికాం రంగంలో ఓ సంచలనం. అంతేకాదు... ఇప్పుడు ఇతర రంగాల్లో కూడా రిలయెన్స్ జియో తన టెక్నాలజీని విస్తరిస్తోంది. ఏసీఎంఏ, సీఐఐ, ఎస్ఐఏఎం సంయుక్తంగా నిర్వహిస్తున్న 'ఆటో ఎక్స్‌పో 2020' ఈవెంట్‌లో రిలయెన్స్ జియో కనెక్టెడ్ వెహికిల్స్ సొల్యూషన్‌ను ప్రదర్శించింది. యూజర్లు తమ వెహికిల్ పెర్ఫమెన్స్‌తో పాటు ఇతర అంశాలను పరిశీలించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కనెక్టెడ్ వెహికిల్స్ సొల్యూషన్‌లో హార్డ్‌వేర్, కనెక్టివిటీ, ప్లాట్‌ఫామ్ లాంటి అంశాలుంటాయి. ఈ కనెక్టెడ్ కార్ టెక్నాలజీని రిలయెన్స్ జియో నవీ ముంబై క్యాంపస్‌లో అభివృద్ధి చేస్తోంది.

Auto Expo 2020, Auto Expo 2020 New Delhi, Auto Expo 2020 Highlights, Auto Expo 2020 Jio connected car technology, Auto Expo 2020 Cars, ఆటో ఎక్స్‌పో 2020, ఆటో ఎక్స్‌పో 2020 న్యూ ఢిల్లీ, ఆటో ఎక్స్‌పో 2020 జియో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటో ఎక్స్‌పో 2020 కార్లు

ఆసియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఎగ్జిబిషన్ ఆటో ఎక్స్‌పో ప్రతీ రెండేళ్లకోసారి జరుగుతుంది. 'ఎక్స్‌ప్లోర్ ద వాల్డ్ ఆఫ్ మొబిలిటీ' థీమ్‌తో ఈసారి ఆటో ఎక్స్‌పో 2020 ఈవెంట్‌ న్యూ ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో జరుగుతోంది. 2,35,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరుగుతున్న అతిపెద్ద ఎగ్జిబిషన్ ఇది. ఆటో ఎక్స్‌పోలో ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్, ఎంజీ మోటార్స్, రెనాల్ట్, స్కోడా, వోక్స్‌వ్యాగన్ లాంటి దిగ్గజ కంపెనీలన్నీ తమ కొత్త వాహనాలను ప్రదర్శించనున్నాయి. సాధారణ ప్రజలు ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించొచ్చు.

ఇవి కూడా చదవండి:



Prize Money: కస్టమర్లకు గుడ్ న్యూస్... రూ.1 కోటి గెలుచుకునే ఛాన్స్

IRCTC: హైదరాబాద్ నుంచి సౌత్ ఇండియా టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

Airtel Plan: ఎయిర్‌టెల్ నుంచి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ 
First published: February 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు