వాట్సప్ మెసేజ్‌లపై పోలీసుల నిఘా

భారతదేశంలో వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్న పుకార్లు, ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం అనేక హత్యలు, దాడులకు కారణమవుతున్నాయి. దీంతో నష్టనివారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వాట్సప్‌పై ఒత్తిడి కూడా తీసుకొచ్చింది.

news18-telugu
Updated: December 5, 2018, 2:59 PM IST
వాట్సప్ మెసేజ్‌లపై పోలీసుల నిఘా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాట్సప్ మెసేజింగ్ సర్వీస్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. అంటే... మెసేజ్ పంపినవాళ్లు, స్వీకరించినవాళ్లు మాత్రమే ఆ సందేశాన్ని చూడగలరు. హ్యాక్ చేసి ఆ మెసేజెస్, ఫోటోస్ చూడటం ఎవరికీ సాధ్యం కాదు. పోలీసులు కూడా ఆ మెసేజ్‌లపై నిఘా పెట్టలేరు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు వాట్సప్, టెలిగ్రామ్ లాంటి యాప్స్‌లో పంపే సందేశాలపై పోలీసులు నిఘా పెట్టే రోజులొచ్చాయి. ఆస్ట్రేలియాలోని రూపొందుతున్న కఠిన చట్టమిది. అంతేకాదు... ఫోన్లు చూపించాలని యూజర్లను అక్కడి పోలీసులు కోరొచ్చు కూడా. పుకార్లు, ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాలు, పిల్లల అక్రమ రవాణా, డ్రగ్స్ బిజినెస్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు వాట్సప్, టెలిగ్రామ్ లాంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్స్‌ వేదికలవుతున్న తరుణంలో వివాదాస్పద ఎన్‍క్రిప్షన్ బిల్లు తెరపైకి వచ్చింది.

భారతదేశంలో వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్న పుకార్లు, ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం అనేక హత్యలు, దాడులకు కారణమవుతున్నాయి. దీంతో నష్టనివారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వాట్సప్‌పై ఒత్తిడి కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కొత్తగా తీసుకొచ్చిన బిల్లుతో ప్రజల ప్రైవసీ విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలక్ట్రానిక్ ప్రొటెక్షన్స్ తొలగించి స్పైవేర్ ఏర్పాటు చేయాలని కంపెనీలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒత్తిడి కూడా తీసుకురావొచ్చు. పార్లమెంటరీ జాయింట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ బిల్లును పరిశీలిస్తోంది.ఇవి కూడా చదవండి:వాట్సప్‌లో వెంటనే మార్చాల్సిన సెట్టింగ్స్ ఇవే...

పేటీఎం వాడుతున్నారా? యాప్‌లో ఇక ఆ ఫీచర్ ఉండదు

సూపర్ ఆఫర్: షావోమీ పోకో ఎఫ్1 పై రూ.5,000 డిస్కౌంట్వయస్సు 7 ఏళ్లు... నెల ఆదాయం రూ.12 కోట్లు... షాకైన సోషల్ మీడియా

ఓటర్ ఐడీ లేదా? ఈ కార్డు ఉంటే ఓటు వేయొచ్చు

జియో చేతికి సావన్ మ్యూజిక్... 90 రోజుల పాటు ఫ్రీ

వరుసగా మూడోసారి ఫోర్బ్స్‌ రిచెస్ట్ ఇండియన్ సెలబ్రిటీగా సల్మాన్ ఖాన్
First published: December 5, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు