Home /News /technology /

AUDI A8L TEASED AGAIN WITH SIGNATURE OLED LIGHTS LAUNCHED IN INDIA ON JULY 12 UMG GH

Audi A8L: మరో లగ్జరీ కారు లాంచ్ చేయనున్న ఆడీ.. ముహూర్తం ఫిక్స్.. ఏ రోజంటే..!

జులైలో ఆడి కొత్త కారు లాంచ్.

జులైలో ఆడి కొత్త కారు లాంచ్.

త్వరలో ఆడీ నుంచి రానున్న ఓ కొత్త మోడల్ OLED ఫినిషింగ్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇండియాలో ఫ్లాగ్‌షిప్ సెడాన్‌గా డిజైన్ చేసిన ఈ 2022 A8L మోడల్‌ (2022 Audi A8L) సరికొత్త లుక్‌తో రానుంది. ఈ వెహికల్ 2022 జులై 12న ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ కానుంది.

ఇంకా చదవండి ...
ఇండియాలో లగ్జరీ కారు కొనుగోలు చేయాలనుకునే కార్ (Car) లవర్స్‌కు ముందుగా గుర్తొచ్చే బ్రాండ్ ఆడీ (Audi). ఈ కంపెనీ నుంచి వచ్చే వెహికల్స్ (Vehicles) స్టైలింగ్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంలో కూడా సంస్థ ముందుంటుంది. అయితే త్వరలో ఆడీ నుంచి రానున్న ఓ కొత్త మోడల్ OLED ఫినిషింగ్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇండియాలో ఫ్లాగ్‌షిప్ సెడాన్‌గా డిజైన్ చేసిన ఈ 2022 A8L మోడల్‌ (2022 Audi A8L) సరికొత్త లుక్‌తో రానుంది. ఈ వెహికల్ 2022 జులై 12న ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ కానుంది. కొత్త ఆడీA8L ఫోటోలను కంపెనీ తాజాగా రిలీజ్ చేసింది. వీటిలో కొత్త కారు బాడీ వెనుక భాగంలో OLED లైట్ ఫినిషింగ్ ఉన్నట్లు కనిపిస్తోంది.

ఆడీ కంపెనీ ఈ ఏడాది మే నెలలోనే ‘2022 ఆడీఎ8ఎల్’ బుకింగ్స్ ఓపెన్ చేసింది. కొనుగోలుదారులు రూ. 10 లక్షల ప్రారంభ ధరతో ఈ వెహికల్‌ను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ కారు వెనుకవైపు సిగ్నేచర్ OLED లైట్లతో వస్తుందని తాజా అప్‌డేట్ ద్వారా తెలుస్తోంది. దీంతోపాటు కంపెనీ ఆడీA8Lని అనేక ప్రీమియం ఫీచర్లతో పరిచయం చేస్తుంది. ఈ జాబితాలో ఫుట్ మసాజర్, రిక్లైనర్‌తో రియర్ రిలాక్సేషన్ ప్యాకేజీ వంటివి ఉన్నాయి. ఆడీA8L ఫ్రంట్ పార్ట్‌ను.. లార్జ్ క్రోమ్-ఫినిష్డ్ ఫ్రంట్ గ్రిల్, బోల్డ్ మెష్, యానిమేటెడ్ ప్రొజెక్షన్స్ ఉన్న మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్‌లు, రీవ్యాంప్డ్ ఫ్రంట్ బంపర్‌తో డిజైన్‌ చేశారు.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. 2022 ఆడీA8L పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు వెనుకవైపు రెండు 10.1-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. ఫోల్డబుల్ సెంటర్ కన్సోల్ టేబుల్, బార్ కంపార్ట్‌మెంట్‌తో కూడిన కూలర్ వంటి ముఖ్యమైన ఇంటర్నల్ ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంది?
ఆడీA8L సెడాన్ 3.0-లీటర్ TFSI పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 340 hp శక్తిని, 540 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ సెడాన్ క్వాట్రో AWD టెక్నాలజీ నుంచి కూడా శక్తిని పొందుతుంది. 2022 ఆడీA8L అత్యుత్తమమైన, మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్‌తో రానుంది. సుపీరియర్ రైడ్ క్వాలిటీ కోసం కారు సిస్టమ్ ప్రిడిక్టివ్ ఎయిర్ సస్పెన్షన్‌ను అందిస్తుందని బ్రాండ్ పేర్కొంది. దీని ధర రూ.1.5 కోట్ల వరకు ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఆడీA8L మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత BMW 7 సిరీస్, మెర్సిడెస్ S-క్లాస్‌లతో పోటీ పడనుంది. వీటన్నింటి ధరలు రూ.1.5 కోట్ల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
Published by:Mahesh
First published:

Tags: Audi, Auto News, New cars, New technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు