Home /News /technology /

Atum1.0: రూ.3వేలు కడితే కొత్త స్టైలిష్ బైక్.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు

Atum1.0: రూ.3వేలు కడితే కొత్త స్టైలిష్ బైక్.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్

Atum 1.0: కేవలం 3-4 గంటల్లోనే బ్యాటరీ ఫుల్ చార్జీ అవుతుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జీ అయితే 100 కి.మీ. వరకు వెళ్లవచ్చు. అంటే ఈ బైక్‌పై 100 కి.మీ. ప్రయాణిస్తే 7-10 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. అంతేకాదు బ్యాటరీ లైఫ్ 5 ఏళ్ల వరకు ఉంటుంది.

ఇంకా చదవండి ...
    ప్రపంచమంతటా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. అంతేకాదు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా మండిపోతున్నాయి. ఒకప్పుడు 50 రూపాయలున్న ధరలు ఇప్పుడు దాదాపు రూ.100కు చేరవవుతున్నాయి. అందుకే ఇటు ప్రభుత్వాలు.. అటు ప్రభుత్వాలు కూడా.. ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నో కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. స్టార్టప్‌లు కూడా ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ఎలక్ట్రిక్ బైక్స్ భారత మార్కెట్‌లోకి వచ్చాయి. ఐతే ఇటీవల మార్కెట్‌లోకి విడుదలయిన ఆటమ్ 1.0 (Atum 1.0) బైక్ దేశమంతటా చర్చనీయాంశమయింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అటుమొబైల్ (Atumobile) అనే స్టార్టప్ సంస్థ ఈ బైక్‌ను తయారుచేసింది.

    ఆటమ్ 1.0 బైక్ కేవలం 35 కేజీల బరువు మాత్రమే ఉంటుంది. సింపుల్ స్టైలిష్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆటమ్ 1.0 బైక్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. ఇందులో 48 వోల్డ్ 159 వాట్స్ లిథియమ్ అయాన్ బ్యాటరీలను వినియోగించారు. బ్యాటరీని ఈజీగా బయటకు తీసి.. ఇంట్లోకి తీసుకెళ్లి చార్జింగ్ పెట్టుకోవచ్చు. కేవలం 3-4 గంటల్లోనే బ్యాటరీ ఫుల్ చార్జీ అవుతుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జీ అయితే 100 కి.మీ. వరకు వెళ్లవచ్చు. అంటే ఈ బైక్‌పై 100 కి.మీ. ప్రయాణిస్తే 7-10 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. అంతేకాదు బ్యాటరీ లైఫ్ 5 ఏళ్ల వరకు ఉంటుంది. దీనిపై 2 ఏళ్ల వ్యారంటీ కూడా ఇచ్చారు. ఈ బైక్ హెడ్‌లైట్ ఇండికేటర్లలో ఎల్ఈడీ లైట్లను వినియోగించారు. బూట్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంది. హెల్మెట్, ఇతర వస్తువులను అక్కడ పెట్టుకోవచ్చు. ఆటమ్ 1.0 బైక్ బ్లాక్, వైట్, గ్రే, బ్లూ, రెడ్ కలర్లలో అందుబాటులో ఉంది.

    ఐతే ఈ బైక్ గంటకు గరిష్ఠంగా 25 కి.మీ. వేగంతోనే వెళ్తుంది. అందుకే అటమ్ 1.0 బైక్‌కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. బండి నడిపేవారికి లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. దీనికి ఎలాంటి చలాన్లు వేయరు. లాంగ్ రైడ్స్‌కు కాకుండా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆఫీసు పనులు, ఇతర పనులకు ఎంచక్కా ఉపయోగపడుతుంది. ఇంతకు ఈ బైక్ ధర ఎంతో తెలుసా..? రూ.49,999. ముందుస్తుగా కంపెనీ వెబ్‌సైట్లో రూ.3వేలు చెల్లించి బైక్‌ను ప్రీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈఎంఐ సదుపాయం కూడా ఉందని కంపెనీ పేర్కొంది. హైదరాబాద్‌లో టెస్ట్ రైడ్ సదుపాయం ఉంది. ఆన్‌లైన్ ప్రీ బుకింగ్ చేసుకుంటే మీరుండే ప్రాంతానికి ఆటమ్ 1.0 బైక్‌ను డెలివరీ చేస్తారు. స్పెషల్ ఆఫర్ కింద ఫ్రీ షిప్పింగ్, ఇన్సూరెన్స్, టీ షర్ట్ అందజేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bikes, Electric Bikes, Electric vehicle, Hyderabad

    తదుపరి వార్తలు