ATMANIRBHAR APPS BY MITRON NOW AVAILABLE FOR ANDROID DEVICES AIMS TO PROMOTE MADE IN INDIA APPS SS GH
Atmanirbhar Apps: అన్ని భారతీయ యాప్స్ ఒకే చోట... ఆత్మనిర్భర్ యాప్స్ డిజైన్ చేసిన మిత్రోన్ సంస్థ
Atmanirbhar Apps: అన్ని భారతీయ యాప్స్ ఒకే చోట... ఆత్మనిర్భర్ యాప్స్ డిజైన్ చేసిన మిత్రోన్ సంస్థ
Atmanirbhar Apps | ఈ యాప్ పూర్తిస్థాయిలో పనిచేయాలంటే మాత్రం దాని ప్రైవసీ విధానాల్లో పేర్కొన్న విధంగా ఫోటోలు, మీడియా ఫైల్లు, స్టోరేజ్, కెమెరా, నెట్వర్క్ వంటి వాటి యాక్సెస్‌కు యూజర్ అనుమతివ్వాల్సిన అవసరం ఉంటుంది.
చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన భారతీయ షార్ట్-వీడియో యాప్ మిత్రోన్ డెవలప్ చేసిన 'ఆత్మనిర్భర్ యాప్స్' అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. దీన్ని ‘నేషనల్ యూనిటీ డే’ సందర్భంగా అక్టోబర్ 31న ప్రారంభించింది మిత్రోన్ సంస్థ. ఇతర దేశాల నుండి వస్తువులు, సేవల దిగుమతులను తగ్గిస్తూ... స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఆత్మ నిర్భర్ భారత్' కార్యక్రమాన్ని ఇటీవలే పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆత్మనిర్భర్ యాప్స్‌ను ప్రారంభించారు. ఇది వ్యాపారం, ఈ–లెర్నింగ్, వార్తలు, ఆరోగ్యం, షాపింగ్, ఆటలు, యుటిలిటీ, వినోదం, సోషల్ వంటి అన్ని వర్గాలకు చెందిన వివిధ స్వదేశీ యాప్‌ల జాబితాను ఒకే దగ్గర అందిస్తుంది. వినియోగదారులు అన్ని రకాల భారతీయ యాప్స్‌ను సులభంగా గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకునేలా అక్కడే లింక్‌ను కూడా పొందుపర్చారు.
భారతదేశ స్వయం సమృద్ధి సాధనే లక్ష్యంగా ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన స్వప్నానికి నిజం చేయడమే ఈ ఆత్మనిర్భర్ యాప్స్ ముఖ్య ఉద్దేశ్యమని మిత్రోన్ సంస్థ పేర్కొంది. ఆత్మనిర్భర్ యాప్‌లో పేర్కొన్న భారతీయ యాప్స్ జాబితాలో ఆరోగ్య సేతు, భీమ్ యుపిఐ, మైగోవ్, పిఎంఓ ఇండియా, ఎమ్పాస్పోర్ట్ సేవా, ఉమాంగ్, ఆన్లైన్ ఆర్టిఐ వంటి ప్రముఖ యాప్స్ ఉన్నాయి. ఇప్పటికే పేరొందిన భారతీయ యాప్స్‌తో పాటు అంతగా ప్రచారం లేని తక్కువ జనాదరణ ఉన్న యాప్స్‌ను కూడా దీనిలో పొందుపర్చడం విశేషం. దీనికి అనుగుణంగా ఆత్మనీర్బ్ కిఫాయత్, గ్రోసిట్, జైన్ థెలా, హోమ్ షాపీ, యువర్కోట్, వృధి స్టోర్స్, ఎక్స్ప్లోరీ ఏఐ కీబోర్డ్, ఎమ్ పరివాహన్ వంటి యాప్స్‌ను జాబితాలో చేర్చింది మిత్రోన్ సంస్థ.
ఆండ్రాయిడ్ డివైజ్‌లో ఉచితంగానే..
"స్వదేశీ ఉత్పత్తులు, సేవలను ప్రజలకు చేరువ చేయడం, స్వదేశీ యాప్స్‌ను ప్రోత్సహించడంమే మా ముఖ్య లక్ష్యమని" మిత్రోన్ సంస్థ పేర్కొంది. ఆత్మనిర్భర్ యాప్స్‌ను ఆండ్రాయిడ్ డివైజ్‌లలో ఉచితంగానే ఉపయోగించుకునే అవకాశం ఉండగా, iOS డివైజ్‌లలో మాత్రం దీని లభ్యత వివరాలపై స్పష్టత లేదు. కాగా, ఆత్మనిర్భర్ యాప్‌లో లిస్ట్ చేయబడిన యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో 12MB పరిమాణంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ యాప్ 682 మంది వినియోగదారుల నుండి మొత్తం 4.8 రేటింగ్‌తో పాజిటివ్ రివ్యూలను కలిగి ఉంది. అయినప్పటికీ, యూజర్ ఇంటర్ఫేస్ (UI), ఇతర బగ్స్ గురించి ఫిర్యాదు చేసిన వినియోగదారులు కూడా ఉన్నారు.
ఈ యాప్ పూర్తిస్థాయిలో పనిచేయాలంటే మాత్రం దాని ప్రైవసీ విధానాల్లో పేర్కొన్న విధంగా ఫోటోలు, మీడియా ఫైల్లు, స్టోరేజ్, కెమెరా, నెట్వర్క్ వంటి వాటి యాక్సెస్‌కు యూజర్ అనుమతివ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 5 లాలిపాప్ వెర్షన్, ఆపై ఉన్న అన్ని డివైజ్‌లలో పనిచేస్తుంది. చైనాకు చెందిన టిక్ టాక్ యాప్‌కు ప్రత్యామ్నాయం ఏప్రిల్ నెలలో మిత్రోన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గూగుల్ ప్లే స్టోర్‌లో మిత్రోన్ యాప్ ప్రస్తుతం 1 కోటికి పైగా డౌన్లోడ్లను కలిగి ఉంది. కాగా, మిట్రాన్ యాప్ ఆపిల్ స్టోర్‌లో మాత్రం అందుబాటులో లేదు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.