RedMi Smart Watch: అదిరిపోయే ఫీచ‌ర్‌ల‌తో రెడ్‌మి స్మార్ట్ వాచ్‌.. ధ‌ర రూ.3,000

(ప్రతీకాత్మక చిత్రం)

ప్ర‌ముఖ చైనీస్ మొబైల్ దిగ్గ‌జం షియోమీ(Xiaomi) కొత్త‌గా రెడ్‌మి బ్రాండ్ వాచ్‌ను మార్కెట్‌(Market)లోకి తీసుకొచ్చింది. ఇది రెడ్‌మి బ్రాండ్ నుంచి వ‌చ్చిన మొద‌టి బ్రాండ్ వాచ్(Brand Watch) కావ‌డం విశేషం. ఎన్నో అధునాతన ఫీచర్లు (Features) ఉన్న ఈ వాచ్ ధరను ప్రస్తుతం మార్కెట్లో రూ.3,000 లభిస్తుంది.

  • Share this:
    ప్ర‌ముఖ చైనీస్ మొబైల్ దిగ్గ‌జం షియోమీ(Xiaomi) కొత్త‌గా రెడ్‌మి బ్రాండ్ వాచ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది రెడ్‌మి బ్రాండ్(Brand) నుంచి వ‌చ్చిన మొద‌టి బ్రాండ్ వాచ్ కావ‌డం విశేషం. ఈ వాచ్ ధ‌ర‌ను చైనీస్(Chinees) మార్కెట్‌లో 299 యువాన్‌లుగా నిర్ణ‌యించారు. అంటే భార‌తీయ క‌రెన్సీలో రూ.3,300. ప్ర‌స్తుతం మార్కెట్‌లో 269 యువాన్‌లకు త‌గ్గించారు. అంటే సుమారు రూ. 3,000ల‌కు మార్కెట్‌(Market)లో ఈ వాచ్ ల‌భిస్తుంది. ఎలిగెంట్ బ్లాక్, ఇంక్ బ్లూ, ఇవోరీ బ్లూ రంగుల్లో ప్ర‌స్తుతం షియోమీ వాచ్‌ వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంది. డిసెంబ‌ర్ నుంచి మి.కామ్‌లో ఈ వాచ్ ల‌భిస్తుంది.

    Windows 11: అన్ స‌పోర్టెడ్ CPUలోనూ విండోస్ 11 వాడొచ్చు.. తెలుసుకోండి


    ఫీచ‌ర్‌లు ఇవే..
    - ఈ వాచ్‌లో 324 పిపి పిక్సెల్ డెన్సిటీ, 2.5డి టెంపర్డ్ గ్లాస్ స్క్రీన్‌తోపాటు 1.4-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌(LED Screen)ను ఉంది. బ్యాట‌రీ సామ‌ర్థ్యం 230mHA. రెండుగంట‌ల్లో ఇది పూర్తిగా చార్జ్ అవుతుంది.
    - నిరంత‌రం హార్ట్ మానిట‌రింగ్‌, స్లీప్ ట్రాకింగ్‌, సెడెంట‌రీ మానిట‌రీంగ్‌, రెస్టింగ్ హార్ట్ రేట్ వంటి స‌మాచారం 30 రోజుల రిపోర్టు(Report) రూపంలో అందిస్తుంది. దీనికి ఎన్ఎఫ్సీ స‌పోర్టు ఉంది.
    ఇందులో సుమారు 120 వాచ్ ఫేసెస్‌ను అందించారు. ఇండోర్ రన్నింగ్, అవుట్ డోర్ రన్నింగ్, అవుట్ డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్, ఫ్రీస్టైల్ వంటి స్పోర్ట్స్ మోడ్స్ వంటి ఏడు స్పోర్ట్స్ మోడ్స్(sports modes) ఈ ఫోన్ క‌లిగి ఉంటుంది. .
    - ఇది 5ఏటీఎం వాటర్ రెసిస్టెంట్, దీని ద్వారా ఈ వాచ్‌ నీటిలో 50 మీటర్ల లోతువరకు పనిచేయ‌గ‌లుగుతుంది. ఆండ్రాయిడ్ 5.0, ఆ పైబడిన, ఐవోఎస్ 10.0+ ఆ పైబడిన ఫోన్లకు దీన్ని పెయిర్(Pair) చేసుకోవచ్చు.
    - ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, సిక్స్-యాక్సిస్ సెన్సార్, జియో మాగ్నెటిక్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్లు(Sensors) ఈ వాచ్ సొంతం. దీని బరువు 35 గ్రాములు మాత్రమే.
    Published by:Sharath Chandra
    First published: