ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో 6జీబీ సేల్ ప్రారంభం!

ఏసుస్ జెన్‌ఫోన్ సిరీస్‌లో సూపర్ హిట్టైన మ్యాక్స్ ప్రో(ఎం1) ఇప్పుడు 6జీబీ వేరియంట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా సేల్ మొదలైంది.

news18-telugu
Updated: July 26, 2018, 1:26 PM IST
ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో 6జీబీ సేల్ ప్రారంభం!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో 6జీబీ సేల్ ఆన్‌లైన్‌లో గురువారం మొదలైంది. తైవాన్‌‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఏసుస్ తన జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో(ఎం1) ఫోన్‌తో షావోమీకి గట్టిపోటీ ఇస్తోంది. ఇంతకుముందు 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లతో ఈ ఫోన్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వాటితో పాటు 6జీబీ వేరియంట్ రిలీజ్ చేసింది ఏసుస్. గురువారం ఫ్లిప్‌కార్ట్‌లో 6 జీబీ వేరియంట్ సేల్ మొదలైంది. 3జీబీ, 4జీబీ వేరియంట్లతో పోలిస్తే 6జీబీ ఫోన్‌లో కెమెరా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి. 3జీబీ+32జీబీ ఫోన్ ధర రూ. 10,999 కాగా, 4జీబీ+64జీబీ ధర రూ.12,999. 6జీబీ+64జీబీ ధర రూ.14,999. మెమొరీ 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో (ఎం1)స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+(2160 x 1080) ఎల్సీడీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636, అడ్రినో 509, 1.8 గిగాహెర్జ్
ర్యామ్: 6జీబీ
స్టోరేజ్: 64జీబీ
రియర్ కెమెరా: 16+5 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరాఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ ఓరియో 8.1
కలర్: బ్లాక్, గ్రే
సిమ్: డ్యూయెల్ సిమ్
ధర: రూ.14,999
Published by: Santhosh Kumar S
First published: July 26, 2018, 1:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading