జెన్‌ఫోన్ లైట్, జెన్‌ఫోన్ మ్యాక్స్ ఫోన్లు రిలీజ్ చేసిన ఏసుస్!

5.45 అంగుళాలతో ఉన్న ఏసుస్ జెన్‌ఫోన్ లైట్(ఎల్1) ఫోన్‌కు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉండటం విశేషం. ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్(ఎం1) ఫోన్‌కో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. ఈ ఫోన్లకు రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. మేడిన్ ఇండియాలో భాగంగా తీసుకొచ్చిన ఈ రెండు ఫోన్లు ఆన్‌లైన్‌లో మాత్రమే లభిస్తాయి.

news18-telugu
Updated: October 17, 2018, 6:06 PM IST
జెన్‌ఫోన్ లైట్, జెన్‌ఫోన్ మ్యాక్స్ ఫోన్లు రిలీజ్ చేసిన ఏసుస్!
5.45 అంగుళాలతో ఉన్న ఏసుస్ జెన్‌ఫోన్ లైట్(ఎల్1) ఫోన్‌కు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉండటం విశేషం. ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్(ఎం1) ఫోన్‌కో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. ఈ ఫోన్లకు రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. మేడిన్ ఇండియాలో భాగంగా తీసుకొచ్చిన ఈ రెండు ఫోన్లు ఆన్‌లైన్‌లో మాత్రమే లభిస్తాయి.
  • Share this:
ఏసుస్ నుంచి కొత్త ఫోన్లు వచ్చేశాయి. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మెల్లిమెల్లిగా పట్టు సాధిస్తున్న తైవాన్ కంపెనీ... మరో రెండు ఫోన్లు రిలీజ్ చేసి యూజర్లకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 పేరుతో రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్... మంచి డిమాండ్ సంపాదించుకుంది. ఈ ఫోన్‌తో బడ్జెట్ సెగ్మెంట్‌లో వన్‌ప్లస్‌, షావోమీ లాంటి కంపెనీలకు గట్టిగా పోటీ ఇచ్చింది. జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1తో ఫామ్‌లోకి వచ్చిన ఏసుస్ ఇప్పుడు జెన్‌ఫోన్ లైట్, జెన్‌ఫోన్ మ్యాక్స్ ఫోన్లను లాంఛ్ చేసింది.

ఏసుస్ కంపెనీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2 ఫోన్లు రిలీజ్ చేస్తుందేమోనని యూజర్లు ఆశగా ఎదురుచూశారు. ఎందుకంటే... ఏసుస్ నుంచి వచ్చిన జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 ఇండియన్ మార్కెట్‌లో సంచలనంగా మారింది. ఇప్పుడు జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2 వస్తుదని అనుకున్నా... కంపెనీ మాత్రం జెన్‌ఫోన్ లైట్(ఎల్1), జెన్‌ఫోన్ మ్యాక్స్(ఎం1) ఫోన్లు రిలీజ్ చేసింది. లో బడ్జెట్ సెగ్మెంట్‌లో వచ్చిన ఈ ఫోన్లు మిగతా కంపెనీలకు గట్టిపోటీనే ఇచ్చే అవకాశముంది.

5.45 అంగుళాలతో ఉన్న ఏసుస్ జెన్‌ఫోన్ లైట్(ఎల్1) ఫోన్‌కు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉండటం విశేషం. ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్(ఎం1) ఫోన్‌కో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. ఈ ఫోన్లకు రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. మేడిన్ ఇండియాలో భాగంగా తీసుకొచ్చిన ఈ రెండు ఫోన్లు ఆన్‌లైన్‌లో మాత్రమే లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా అమ్మనుంది ఏసుస్. ఈ ఫోన్ కొన్నవాళ్లకు జియో నుంచి రూ.2,200 విలువైన క్యాష్‌బ్యాక్, 50 జీబీ డేటా అదనంగా లభిస్తాయి.

జెన్‌ఫోన్ లైట్, జెన్‌ఫోన్ మ్యాక్స్ ఫోన్లు రిలీజ్ చేసిన ఏసుస్!, Asus Zenfone Lite, Asus Zenfone Max Launched: Price, specifications And More
ఏసుస్ జెన్‌ఫోన్ లైట్(ఎల్1)

ఏసుస్ జెన్‌ఫోన్ లైట్(ఎల్1) స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే
ర్యామ్: 2 జీబీఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో, జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 5.0
కలర్స్: బ్లాక్, గోల్డ్
ధర: అసలు ధర రూ.6,999... ఆఫర్‌ ధర రూ.5,999

జెన్‌ఫోన్ లైట్, జెన్‌ఫోన్ మ్యాక్స్ ఫోన్లు రిలీజ్ చేసిన ఏసుస్!, Asus Zenfone Lite, Asus Zenfone Max Launched: Price, specifications And More
ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్(ఎం1)

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్(ఎం1) స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే
ర్యామ్: 3 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో, జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 5.0
కలర్స్: బ్లాక్, గోల్డ్
ధర: అసలు ధర రూ.8,999... ఆఫర్‌ ధర రూ.7,499

ఇవి కూడా చదవండి:

ప్లేస్టోర్‌లో 10 కోట్ల ఇన్‌స్టాల్స్ దాటిన పబ్‌జీ గేమ్!

ఫోర్ట్‌నైట్ గేమ్: మీ ఫోన్‌లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

గోల్డ్ బాండ్ స్కీమ్: మీకు ఎంత వరకు లాభం?

కొత్త ఇల్లు కొంటున్నారా? ఈ 18 అంశాలు మర్చిపోవద్దు!

కారు కొంటున్నారా? ఎక్కువ డిస్కౌంట్ ఇలా పొందండి!

వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: October 17, 2018, 6:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading