ఏసుస్ జెన్‌ఫోన్ 5జెడ్ రిలీజ్‌కు ముహూర్తం రెడీ!

ఏసుస్ జెన్‌ఫోన్ 5 జెడ్ స్మార్ట్‌ఫోన్ జూలై 4న ఇండియాలో రిలీజ్ కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా అమ్మనున్నారు.

news18-telugu
Updated: June 28, 2018, 5:53 PM IST
ఏసుస్ జెన్‌ఫోన్ 5జెడ్ రిలీజ్‌కు ముహూర్తం రెడీ!
(image: Asus)
  • Share this:
తైవాన్‌కు చెందిన ఏసుస్... బార్సీలోనాలో వాల్డ్ మొబైల్ కాంగ్రెస్ 2018లో జెన్‌ఫోన్ 5 సిరీస్‌ను ప్రకటించింది. ఆ ఈవెంట్‌లో జెన్‌ఫోన్ 5జెడ్, జెన్‌ఫోన్ 5, జెన్‌ఫోన్ 5 లైట్ ఫోన్లను రిలీజ్ చేసింది. ఈ ఫోన్లన్నింట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, 18:9 డిస్‌ప్లే, డ్యూయెల్ కెమెరా ఫీచర్లున్నాయి. జెన్‌ఫోన్ 5జెడ్‌ను ఇండియాలో జూలై 4న ఎక్స్‌క్లూజీవ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మబోతోంది ఏసుస్.

మిడ్‌నైట్ బ్లూ, మెటియార్ సిల్వర్ కలర్స్‌తో సరికొత్త డిజైన్‌లో ఈ ఫోన్‌ను రూపొందించారు. 6.2 అంగుళాల డిస్‌ప్లేతో పాటు ఐఫోన్‌ ఎక్స్‌లా నాచ్ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌ఓసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్, అడ్రీనో 630 జీపీయూ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఏసుస్ బూస్ట్‌మాస్టర్, ఏఐ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది.

జెన్‌ఫోన్ 5జెడ్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+(2246 x 1080) ఎల్సీడీ


ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845
ర్యామ్: 6జీబీ
స్టోరేజ్: 64జీబీరియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,300 ఎంఏహెచ్
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ ఓరియోతో జెన్‌యూఐ 5.0 ఇంటర్‌ఫేస్
First published: June 27, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading