ఏసుస్ జెన్‌ఫోన్ 5జెడ్ వచ్చేసింది!

ఏసుస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జెన్‌ఫోన్ 5జెడ్ ఇండియాలో లాంఛైంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.29,999 ధరతో ప్రారంభమవుతుంది.

news18-telugu
Updated: July 4, 2018, 3:38 PM IST
ఏసుస్ జెన్‌ఫోన్ 5జెడ్ వచ్చేసింది!
ఏసుస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జెన్‌ఫోన్ 5జెడ్ ఇండియాలో లాంఛైంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.29,999 ధరతో ప్రారంభమవుతుంది.
  • Share this:
ఏసుస్ తన జెన్‌ఫోన్ 5జెడ్ ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. తైవాన్‌కు చెందిన ఏసుస్... బార్సీలోనాలో వాల్డ్ మొబైల్ కాంగ్రెస్ 2018లో జెన్‌ఫోన్ 5 సిరీస్‌లో భాగంగా 5జెడ్ ప్రకటించింది. ఆ సిరీస్‌లో మిగతా ఫోన్లను గతంలోనే లాంఛ్ చేసి... 5జెడ్‌ను మాత్రం ఇప్పుడు తీసుకొచ్చింది. ముందు, వెనక గ్లాస్ డిజైన్, ఏఐ స్క్రీన్ డిటెక్షన్‌తో డ్యుయల్ రియర్ కెమెరా, 6.2 అంగుళాలతో నాచ్ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఇండియాలో ధర రూ.29,999తో ప్రారంభమవుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా జూలై 9 నుంచి అందుబాటులో ఉంటుంది ఈ ఫోన్. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. జియో యూజర్లకు రూ.2,200 క్యాష్‌బ్యాక్‌తో పాటు 100 జీబీ అదనపు డేటా లభిస్తుంది. టైప్ సీ పోర్ట్ 3.0 క్విక్ చార్జర్, ఇయర్‌ఫోన్స్, ఫోన్ కేస్ బాక్సులో లభిస్తాయి. ఒకే ప్రైస్ రేంజ్‌లో ఉన్న వన్‌ప్లస్ 6తో జెన్‌ఫోన్ 5జెడ్ పోటీపడుతుందా లేదా అన్నది చూడాలి.

ఏసుస్ జెన్‌ఫోన్ 5జెడ్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.2 అంగుళాల ఫుల్ ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ, 19:9 యాస్పెక్ట్ రేషియో

ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీ, అడ్రినో 630 జీపీయూ
ర్యామ్: 6జీబీ, 8జీబీ


స్టోరేజ్: 64జీబీ, 128 జీబీ, 256జీబీ
రియర్ కెమెరా: 12+8 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరాఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,300 ఎంఏహెచ్
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ ఓరియోతో జెన్‌యూఐ 5.0 ఇంటర్‌ఫేస్
ధర: 6జీబీ/64జీబీ- రూ.29,999, 6జీబీ/128జీబీ-రూ.32,999, 8జీబీ/256జీబీ-36,999
కలర్స్: మిడ్‌నైట్ బ్లూ, సిల్వర్
First published: July 4, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading