ఏసుస్ నుంచి మరో రెండు ఫోన్లు!

ఏసుస్ రిలీజ్ చేయబోయే ఆ రెండు ఫోన్లు ఏవన్న స్పష్టత లేదు. అయితే ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లోనే ఎక్స్‌క్లూజీవ్‌గా లభించనున్నాయి. అవి జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2 ఫోన్లు కావచ్చని టెక్ ఎక్స్‌పర్ట్స్ అంచనా. . జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 మంచి పేరు తెచ్చుకున్న ఏసుస్... ఇప్పుడు జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2 పరిచయం చేయనుందని భావిస్తున్నారు.

news18-telugu
Updated: October 16, 2018, 11:42 AM IST
ఏసుస్ నుంచి మరో రెండు ఫోన్లు!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏసుస్... భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మెల్లిమెల్లిగా పట్టు సాధిస్తున్న తైవాన్ కంపెనీ. కొన్నాళ్ల క్రితం జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 పేరుతో రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్... మంచి డిమాండ్ సంపాదించుకుంది. ఈ ఫోన్‌తో బడ్జెట్ సెగ్మెంట్‌లో వన్‌ప్లస్‌, షావోమీ లాంటి కంపెనీలకు గట్టిగా పోటీ ఇచ్చింది. జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1తో ఫామ్‌లోకి వచ్చిన ఏసుస్ ఇప్పుడు మరో రెండు కొత్త ఫోన్లు లాంఛ్ చేయనుంది. అక్టోబర్ 17న ఇండియాలో వీటిని రిలీజ్ చేస్తున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.


అయితే ఏసుస్ రిలీజ్ చేయబోయే ఆ రెండు ఫోన్లు ఏవన్న స్పష్టత లేదు. అయితే ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లోనే ఎక్స్‌క్లూజీవ్‌గా లభించనున్నాయి. అవి జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2 ఫోన్లు కావచ్చని టెక్ ఎక్స్‌పర్ట్స్ అంచనా. ఎందుకంటే జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2 మోడల్‌కు ఇటీవలే రష్యన్ రెగ్యులేటర్ బాడీ నుంచి సర్టిఫికేషన్ వచ్చింది. జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 మంచి పేరు తెచ్చుకున్న ఏసుస్... ఇప్పుడు జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2 పరిచయం చేయనుందని భావిస్తున్నారు.ఇవి కూడా చదవండి:ఆఫ్‌లైన్ స్టోర్లల్లో షావోమీ పోకో ఎఫ్1 సేల్!

త్వరలో ఇండియాలో రెడ్‌మీ నోట్ 6 ప్రో రిలీజ్!

ఇంటర్నెట్ బ్యాంకింగ్ బ్లాక్ చేయనున్న ఎస్‌బీఐ!

ఇన్‌స్టాగ్రామ్ చూస్తే అసూయా? ఇలా తగ్గించుకోండి!

 

 

 
First published: October 16, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>