హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Asus Vivobook 14 Touch: ఇండియన్ మార్కెట్లోకి ఆసుస్ వివోబుక్ 14 టచ్ ల్యాప్‌టాప్‌ లాంచ్.. ధర, ఫీచర్లు చెక్ చేయండి..

Asus Vivobook 14 Touch: ఇండియన్ మార్కెట్లోకి ఆసుస్ వివోబుక్ 14 టచ్ ల్యాప్‌టాప్‌ లాంచ్.. ధర, ఫీచర్లు చెక్ చేయండి..

Photo Credit : Asus

Photo Credit : Asus

Asus Vivobook 14 Touch: స్మార్ట్ బ్రాండ్ ఆసుస్ (Asus) ఇండియాలో వరుసగా ల్యాప్‌టాప్ సిరీస్‌లను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే పీసీ మార్కెట్‌లో దూసుకుపోతున్న ఈ కంపెనీ తాజాగా వివోబుక్ 14 టచ్ (Vivobook 14 Touch (X1402)) పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

స్మార్ట్ బ్రాండ్ ఆసుస్ (Asus) ఇండియాలో వరుసగా ల్యాప్‌టాప్ సిరీస్‌లను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే పీసీ మార్కెట్‌లో దూసుకుపోతున్న ఈ కంపెనీ తాజాగా వివోబుక్ 14 టచ్ (Vivobook 14 Touch (X1402)) పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ప్యానెల్‌తో వచ్చే 14-అంగుళాల సన్నని, తేలికపాటి సిస్టమ్. ఈ నోట్‌బుక్ ఇంటెల్ కోర్ 12వ తరం ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బెస్ట్ డిజైన్, లేటెస్ట్ స్పెసిఫికేషన్లతో వచ్చింది. దీన్ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ లేటెస్ట్ ల్యాపీ ధర, స్పెసిఫికేషన్లు చూద్దాం.

* ధర ఎంత?

ఆసుసు వివోబుక్ 14 ల్యాప్‌టాప్ ధర రూ. 49,990 నుంచి ప్రారంభమవుతుంది. ఇది లాంచింగ్ ఆఫర్ ప్రైస్ మాత్రమే. కస్టమర్లు ఈ అడ్వాన్స్‌డ్ ల్యాపీని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొత్త ల్యాప్‌టాప్ లాంచింగ్ గురించి మాట్లాడారు ఆసుస్ ఇండియా, సిస్టమ్ బిజినెస్ గ్రూప్, కన్స్యూమర్ అండ్ గేమింగ్ PC బిజినెస్ హెడ్ ఆర్నాల్డ్ సు.

లేటెస్ట్ ఫీచర్లతో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్ ఇండియన్ యూజర్ల అన్ని అవసరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. భారతదేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా ఉన్న ఫ్లిప్‌కార్ట్ ద్వారా తమ కొత్త ప్రొడక్ట్‌ను కస్టమర్లకు డెలివరీ చేస్తామని చెప్పారు.

* ఫీచర్లు, ప్రత్యేకతలు

ఆసుస్ వివోబుక్ 14 టచ్ 16GB RAM, 512GB PCIe Gen 3 SSDతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాల ఫుల్ HD IPS డిస్‌ప్లేతో బెస్ట్ డిస్‌ప్లేను అందిస్తుంది. 82% స్క్రీన్-టు-బాడీ రేషియో దీని సొంతం. ఈ ల్యాప్‌టాప్ కేవలం 19.9mm మందంతో సన్నగా ఉంటుంది. ఇది 1.4 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. డివైజ్ MIL-STD 810H స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉంటుంది. అంటే ఇది ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌ను కూడా తట్టుకోగలదు. ఫుల్ సైజ్ బ్యాక్‌లిట్ కీబోర్డ్, బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం డెడికేటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి : భారీ ఆఫర్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..? ఇంకెందుకు ఆలస్యం.. మీ కోసమే ఈ బెస్ట్ ఫోన్స్..

ఇంటెల్ 12వ తరం కోర్ i5-1240P ఈ ల్యాపీలో ప్రధాన హైలైట్‌గా చెప్పవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 1 x USB 3.2 Gen 1 (Type-C), 2 x USB 3.2 Gen 1 (Type-A), 1 x USB 2.0, HDMI 1.4 పోర్ట్స్, 3.5mm ఆడియో జాక్‌ కనెక్షన్స్‌తో వస్తుంది. డివైజ్ 42 wh బ్యాటరీతో వస్తుంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్‌ కెపాసిటీ దీని అదనపు ప్రత్యేకత. ఈ ల్యాప్‌టాప్ ఐస్‌లైట్ సిల్వర్, క్వైట్ బ్లూ అనే రెండు డిజైన్ ఆప్షన్లలో లభిస్తుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Asus, Laptop, Tech news

ఉత్తమ కథలు