Home /News /technology /

ASUS LAUNCHES CHROMEBOOK FLIP C214 C223 C423 AND C523 AFFORDABLE LAPTOPS IN INDIA PRICE STARTS AT RS 17999 SS

Asus Chromebook: ఏసుస్ సంచలనం... రూ.17,999 ధరకే ల్యాప్‌టాప్

Asus Chromebook: ఏసుస్ సంచలనం... రూ.17,999 ధరకే ల్యాప్‌టాప్
(image: Asus India)

Asus Chromebook: ఏసుస్ సంచలనం... రూ.17,999 ధరకే ల్యాప్‌టాప్ (image: Asus India)

Asus Chromebook | ఏసుస్ తక్కువ ధరకే ఇండియాలో కొత్త ల్యాప్‌టాప్స్ పరిచయం చేసింది. రూ.25,000 లోపు 6 ల్యాప్‌టాప్స్ రిలీజ్ చేసింది.

    మీ పిల్లల ఆన్‌లైన్ క్లాసుల కోసం ఓ మంచి ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ల్యాప్‌టాప్ సెర్చ్ చేస్తున్నారా? వీకెండ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బేసిక్ ల్యాప్‌టాప్ తీసుకోవాలని అనుకుంటున్నారా? కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీ అయిన ఏసుస్ సంచలనం సృష్టించింది. రూ.17,999 ధర నుంచే ల్యాప్‌టాప్స్‌ని రిలీజ్ చేసింది. క్రోమ్‌బుక్ సీ214, సీ223, సీ423, సీ523 మోడల్స్‌ని పరిచయం చేసింది. ఇందులో క్రోమ్‌బుక్ సీ423, క్రోమ్‌బుక్ సీ523 మోడల్స్ టచ్, నాన్ టచ్ వర్షన్స్‌లో లభిస్తాయి. అంటే మొత్తం 6 క్రోమ్‌బుక్ మోడల్స్‌ని రిలీజ్ చేసింది ఏసుస్. ముఖ్యంగా ఆన్‌లైన్ క్లాసులు, ఎంటర్‌టైన్‌మెంట్ లాంటివాటి కోసం ఈ ల్యాప్‌టాప్స్ రూపొందించింది. 80 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, ఇంటెల్ సెలరాన్ ఎన్-సిరీస్ ప్రాసెసర్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

    Mi Watch Revolve: రూ.15,999 విలువైన స్మార్ట్ వాచ్ రూ.999 ధరకే... ఫ్లాష్ సేల్ ఎప్పుడంటే

    Nokia G20: నోకియా జీ20 సేల్ మొదలైంది... డిస్కౌంట్ వివరాలు ఇవే

    ఏసుస్ క్రోమ్‌బుక్ ప్రత్యేకతలు చూస్తే క్రోమ్‌బుక్ సీ223 తక్కువ ధరకే లభిస్తుంది. క్రోమ్‌బుక్ సీ223 ధర రూ.17,999. క్రోమ్‌బుక్ సీ423 నాన్ టచ్ మోడల్ ధర రూ.19,999, క్రోమ్‌బుక్ సీ523 నాన్ టచ్ మోడల్ ధర రూ.20,999, క్రోమ్‌బుక్ సీ423 టచ్ మోడల్ ధర రూ.23,999, క్రోమ్‌బుక్ సీ523 టచ్ మోడల్ ధర రూ.24,999. ఇక ఏసుస్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214 ధర రూ.23,999. ఈ ల్యాప్‌టాప్స్ అన్నీ 2021 జూలై 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.

    Mi 11 Ultra 5G: కాసేపట్లో ఎంఐ 11 అల్‌ట్రా సేల్... రూ.5000 డిస్కౌంట్ పొందండి ఇలా

    Smartphone Tips: మీ పాత స్మార్ట్‌ఫోన్ అమ్ముతున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి


    ఏసుస్ క్రోమ్‌బుక్ సీ214, సీ223 ల్యాప్‌టాప్స్‌లో 11.6 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. ఏసుస్ క్రోమ్‌బుక్ సీ423 మోడల్‌లో 14 అంగుళాల ఎల్ఈడీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. క్రోమ్‌బుక్ సీ523 మోడల్‌లో 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214 మోడల్‌ను 360 డిగ్రీలు తిప్పొచ్చు. ఈ ల్యాప్‌టాప్స్ అన్నింటిలో గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. విండోస్ ఓఎస్ ఉండదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ లభిస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 2టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Asus, Laptop, Online classes, Online Education, Work From Home

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు