Asus 6Z: ఇండియాలో లాంఛైన ఏసుస్ 6జెడ్... ప్రత్యేకతలివే

Asus 6Z | ఏసుస్ 6జెడ్ స్మార్ట్‌ఫోన్‌లో 48+13 మెగాపిక్సెల్ మోటరైజ్డ్ రొటేటింగ్ కెమెరా ఉంటుంది. ఇదే కెమెరా రియర్, సెల్ఫీ కెమెరాగా పనిచేయడం విశేషం.

news18-telugu
Updated: June 19, 2019, 3:46 PM IST
Asus 6Z: ఇండియాలో లాంఛైన ఏసుస్ 6జెడ్... ప్రత్యేకతలివే
Asus 6Z: ఇండియాలో లాంఛైన ఏసుస్ 6జెడ్... ప్రత్యేకతలివే (Image: Flipkart)
  • Share this:
ఏసుస్ నుంచి మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ వచ్చేసింది. ఏసుస్ 6జెడ్ ఇండియాలో రిలీజైంది. వాస్తవానికి ఈ ఫోన్ గత నెలలో స్పెయిన్‌లో ఏసుస్ జెన్‌ఫోన్ 6 పేరుతో లాంఛైంది. అదే ఫోన్‌ను ఏసుస్ 6జెడ్ పేరుతో ఇండియాకు తీసుకొచ్చింది కంపెనీ. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. మూడు వేరియంట్లు ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 26 నుంచి సేల్‌లో ఉంటాయి. ఫ్లిప్ కెమెరా ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. ఏసుస్ 6జెడ్ స్మార్ట్‌ఫోన్‌లో 48+13 మెగాపిక్సెల్ మోటరైజ్డ్ రొటేటింగ్ కెమెరా ఉంటుంది. ఇదే కెమెరా రియర్, సెల్ఫీ కెమెరాగా పనిచేయడం విశేషం. అంటే ఫోన్ వెనుక వైపు ఉండే కెమెరా రియర్ కెమెరాగా పనిచేస్తుంది. సెల్ఫీ తీసుకునే సమయంలో కెమెరా ముందువైపు రొటేట్ అవుతుంది. ఇక ప్రీమియం స్మార్ట్‌ఫోన్లల్లో ఉన్నట్టు ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. దాని బదులు వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది. ఇక 5,000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ క్విక్ ఛార్జ్ 4.0 టెక్నాలజీని సపోర్ట్ చేయడం మరో విశేషం.

ఏసుస్ 6జెడ్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 1,080x2,340 పిక్సెల్స్
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855మోటరైజ్డ్ రొటేటింగ్ కెమెరా: 48+13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: మిడ్‌నైట్ బ్లాక్, ట్విలైట్ సిల్వర్
ధర:
6జీబీ+64జీబీ- రూ.31,999
6జీబీ+128జీబీ- రూ.34,999
8జీబీ+256జీబీ- రూ.39,999

Revolt RV400: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలక్ట్రిక్ బైక్


ఇవి కూడా చదవండి:

Honor 20i - Jio offer: హానర్ 20ఐ కొంటే జియో నుంచి రూ.2,200 క్యాష్‌బ్యాక్

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్... ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్

Nokia Discount: ఆ రెండు నోకియా స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్
First published: June 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు