• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • ASUS HAS LAUNCHED MOST POWERFUL ANDROID SMARTPHONE IN INDIA ASUS ROG PHONE 5 NS GH

Asus ROG Phone 5 సిరీస్​ లాంఛ్​.. 18 జీబీ ర్యామ్​తో పాటు సంచలన ఫీచర్లు.. పూర్తి వివరాలివే..

Asus ROG Phone 5 సిరీస్​ లాంఛ్​.. 18 జీబీ ర్యామ్​తో పాటు సంచలన ఫీచర్లు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ ఏసుస్​ గేమింగ్​ ప్రియుల కోసం భారత మార్కెట్​లోకి ఫ్లాగ్​షిప్​ ఫోన్ ను విడుదల చేసింది. ఏసుస్​ రిపబ్లిక్​ ఆఫ్​ గేమర్స్​(ROG) ఫోన్​5 పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చింది.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ ఏసుస్​ గేమింగ్​ ప్రియుల కోసం భారత మార్కెట్​లోకి ఫ్లాగ్​షిప్​ ఫోన్ ను విడుదల చేసింది. ఏసుస్​ రిపబ్లిక్​ ఆఫ్​ గేమర్స్​(ROG) ఫోన్​5 పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఈ గేమింగ్​ ఫోన్​ను ROG 5, ROG 5 ప్రో, ROG 5 అల్టిమేట్ అనే మూడు విభిన్న మోడళ్లలో రిలీజ్​ చేసింది. కాగా, గత సంవత్సరం విడుదలైన ROG 3 కన్నా ROG 5లో చాలా అద్భుతమైన ఫీచర్లను చేర్చింది.అయితే, ROG 4 ని విడుదల చేయకుండానే ROG 5ను విడుదల చేయడం విశేషం. సాధారణంగా, 4 సంఖ్యను తైవాన్‌లో దురదృష్ట సంఖ్యగా పరిగణిస్తారు. అందువల్ల, ROG 4 విడుదల చేయకుండానే ROG 5 సిరీస్​ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, ROG 5 అల్టిమేట్​ని ప్రస్తుతం భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్​గా పేర్కొనవచ్చు. ఇది, 18GB RAM, క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 888 వేగవంతమైన ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కాగా, ఏసుస్​ రోగ్​ 5 సిరీస్ అమ్మకాలు భారత మార్కెట్​లో ఏప్రిల్​ 15 నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్మార్ట్​ఫోన్లలోని మరిన్ని స్పెసిఫికేషన్లను పరిశీలిద్దాం.

ROG ఫోన్ 5 సిరీస్ ధర
8GB + 128GB వేరియంట్​ ROG ఫోన్ 5 ధర ప్రస్తుతం రూ. 49,999 గా ఉంది. కాగా, 12GB + 256GB వేరియంట్ రూ. 57,999లకు లభిస్తుంది. ఇక, ఏసుస్ ROG ఫోన్ 5 ప్రో కేవలం 16GB RAM + 512GB స్టోరేజ్​లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది రూ .69,999లకు లభిస్తుంది. ఇక, 18GB RAM, 512GB స్టోరోజ్​తో వచ్చే ROG ఫోన్ 5 అల్టిమేట్ రూ.79,999 ధరకు లభిస్తుంది. కాగా, ఈ ఏసుస్ ROG 5 సిరీస్ ఫోన్​ అమ్మకాలు ఏప్రిల్ 15 నుండి ప్రారంభం కానున్నాయి. అన్ని మోడళ్లలో ర్యామ్​, స్టోరేజ్​ కెపాసిటీల్లో మాత్రమే తేడాలున్నాయి. మిగతా ఫీచర్లన్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి.

18 జీబీ ర్యామ్​తో వచ్చే మొదటి స్మార్ట్‌ఫోన్
ROG ఫోన్ 5 అల్టిమేట్ ప్రస్తుతం భారతదేశంలో 18GB LPDDR5 RAM తో లభించే మొదటి, ఏకైక స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. కాగా, ROG 5 ప్రో 16GB RAMతో లభిస్తుంది. ROG 5 సిరీస్‌లో అత్యంత సరసమైన ధరకు లభించే ROG ఫోన్ 5 మాత్రం 8GB, 12GB అనే రెండు RAM ఆప్షన్లతో లభిస్తుంది.

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌..
క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 888 తో భారతదేశంలో లాంఛ్ చేసిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ కూడా ROG ఫోన్ 5 కావడం విశేషం. కాగా, శామ్సంగ్ ఎస్ 21 సిరీస్ లో కూడా ఇదే ప్రాసెసర్​ను వాడుతున్నారు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్లు 2.9 గిగాహెర్ట్జ్ వద్ద ఎక్సినోస్ ప్రాసెసర్‌లో నడుస్తాయి.

ఓవర్‌లాక్డ్ అడ్రినో 660 జీపీయూతో..
గతేడాది విడుదలై విజయవంతమైన ROG ఫోన్ 3తో ​​పోలిస్తే, ROG ఫోన్ 5 లోని ఓవర్‌లాక్డ్ GPU 35% మెరుగ్గా పనిచేస్తుంది.

UFS 3.1కు సపోర్ట్
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత వేగవంతమైన స్టోరేజ్​ టెక్నాలజీ UFS 3.1కు ROG ఫోన్ 5 సపోర్ట్​ ఇస్తుంది.

144Hz డిస్​ప్లేతో 6.78-అంగుళాల AMOLED ప్యానెల్
ఏసుస్ ROG ఫోన్ 5 సిరీస్​144Hz డిస్ ప్లేని అందిస్తుంది. ఇది 6.78 అంగుళాల శామ్‌సంగ్ అమోలెడ్ ప్యానల్‌తో సమానంగా ఉంటుంది. అంతేకాక, 1200 నిట్ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. హెచ్‌డిఆర్ 10 ప్లస్​, డిసి డిమ్మింగ్ వంటి ఫీచర్లకు కూడా సపోర్ట్​ ఇస్తుంది.

ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు
ROG ఫోన్ 5లో రెండు సిమెట్రికల్​7-మాగ్నెట్ 12x16 సూపర్ లీనియర్ స్పీకర్లను అందించింది. వీటిని డైరాక్ ఆడియో ట్యూన్ చేస్తుంది.

ఎయిర్ ట్రిగ్గర్స్
ROG సిరీస్ ఫోన్‌లలో ఎయిర్‌ట్రిగ్గర్స్ అని పిలువబడే షోల్డర్​ బటన్లను చేర్చింది. వినియోగదారులు వారి గేమింగ్ ప్రాధాన్యతలకు అనుగుణంగా మోషన్ ట్రిగ్గర్‌లను వాడుకోవచ్చు.

X మోడ్, ఆర్మరీ క్రేట్
ఎక్స్ మోడ్, ఆర్మరీ క్రేట్ కస్టమ్ గేమ్ ప్రొఫైల్స్, పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్, డిస్ప్లే ట్యూనింగ్ తో పాటు మరెన్నో కస్టమైజేషన్ ఆప్షన్లను అందిస్తుంది.

కూలింగ్​ సిస్టమ్​తో..
ROG ఫోన్ 5 మెరుగైన కూలింగ్​ సిస్టమ్​తో అందుబాటులో ఉంటుంది. ఫోన్​ హీటవ్వకుండా చేస్తుంది.

ROG ఫోన్ 5 కెమెరా
ROG ఫోన్ 5లో 64MP సోనీ IMX686 సెన్సార్,13MP అల్ట్రా వైడ్ సెన్సార్, 5MP మాక్రో లెన్స్ కెమెరాను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 24 ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా చేర్చింది.

65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌..
ROG ఫోన్ 5 సిరీస్​ 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఇవి 65W ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్​ ఇస్తాయి.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21కు గట్టిపోటీ..
శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ గా చెప్పవచ్చు. స్పెసిఫికేషన్ల పరంగా, ఇది Exynos 2100 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 16GB RAMను అందించింది. ఇవే స్పెసిఫికేషన్లతో వస్తున్న ఏసుస్ రోగ్ 5 ఫోన్, శామ్సంగ్​ గెలాక్సీ ఎస్​21కి గట్టి పోటీ ఇవ్వనుంది.

Kewyord
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు