• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • ASUS AIO V241 ASUS LAUNCHES NEWEST COMPUTER MIND BLOCK IF YOU KNOW ANY OF THE FEATURES MK GH

ASUS AIO V241: సరికొత్త కంప్యూటర్​ను​ లాంఛ్​ చేసిన ఏసుస్​.. ఫీచర్లు ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్..

ASUS AIO V241: సరికొత్త కంప్యూటర్​ను​ లాంఛ్​ చేసిన ఏసుస్​.. ఫీచర్లు ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్..

ప్రతీకాత్మకచిత్రం

షియోమి, హానర్​, నోకియా వంటి ఎలక్ట్రానిక్ బ్రాండ్లు వరుసగా ల్యాప్​టాప్​, పీసీలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి గట్టి పోటీనిచ్చేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ ఏసుస్​ సిద్ధమైంది. సరికొత్త ఆల్ ఇన్ వన్ పర్సనల్​ కంప్యూటర్​(పీసీ)ని భారత మార్కెట్​లోకి ప్రవేశపెట్టింది.

  • Share this:
కరోనా కారణంగా వర్క్​ ఫ్రం హోమ్​ కల్చర్​ పెరిగింది. దీనితో పాటు విద్యా బోధన కూడా ఆన్​లైన్​ క్లాసుల ద్వారానే నడుస్తోంది. తద్వారా గత ఏడాది కాలం నుంచి ల్యాప్​టాప్​లకు, పీసీలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఎలక్ట్రానిక్​ పరికరాల తయారీ సంస్థ వరుసగా నూతన ఫీచర్లతో ల్యాప్​టాప్​, పీసీ​లను విడుదల చేస్తున్నాయి. తాజాగా, షియోమి, హానర్​, నోకియా వంటి ఎలక్ట్రానిక్ బ్రాండ్లు వరుసగా ల్యాప్​టాప్​, పీసీలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి గట్టి పోటీనిచ్చేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ ఏసుస్​ సిద్ధమైంది. సరికొత్త ఆల్ ఇన్ వన్ పర్సనల్​ కంప్యూటర్​(పీసీ)ని భారత మార్కెట్​లోకి ప్రవేశపెట్టింది. AiO V241 పేరుతో విడుదలైన ఈ పీసీని స్పెషల్​ డిజైన్​తో ఆకర్షణీయంగా రూపొందించింది. వీటిలో అద్భుతమైన ఫీచర్లను చేర్చింది.

AiO V241 పీసీ 23.8 -అంగుళాల నానో ఎడ్జ్ IPS డిస్​ప్లేతో 88 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. దీనిలో 100 శాతం ఎస్‌ఆర్‌జిబి కలర్ గ్యామ్యూట్​ని అందించింది. ఇది 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ 7 ప్రాసెసర్‌, ఇంటెల్ ఐరిస్ ఎక్స్‌ గ్రాఫిక్‌, 8 జిబి ఓడిడిఆర్ 4 ర్యామ్‌తో పనిచేస్తుంది. ఈ పీసీ డ్యుయల్​ స్టోరేజికి మద్దతిస్తుంది. దీని హార్డ్​ డిస్క్​ను 1 TB HDD వరకు, స్టోరేజీ కెపాసిటీని 512 GB SSD వరకు పెంచుకోవచ్చు. ఈ పీసీలో హెచ్‌డి కెమెరా, డ్యూయల్ అర్రే మైక్‌లను కూడా అందించింది. కనెక్టివిటీ పరంగా చూస్తే.. దీని ముందు భాగంలో నాలుగు రియర్​ -మౌంటెడ్ యుఎస్‌బి 3.2 జెన్ 1 టైప్-ఎ పోర్ట్‌లు, యుఎస్‌బి 2.0 పోర్ట్, HDMI ఇన్ ఫీచర్, HDMI అవుట్ డివైజెస్​ను అందించింది. ఇవి అదనపు కార్యాచరణల కోసం AiO V241తో కనెక్ట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. వీటితో పాటు అదనంగా 3W స్టీరియో స్పీకర్లను కూడా అందించింది. ఈ పీసీ 90W పవర్ అవుట్​పుట్​, విండోస్ 10 హోమ్‌తో పనిచేస్తుంది. మెరుగైన వినియోగం కోసం దీనిలో వైర్‌లెస్ కీబోర్డ్, మౌస్‌ సపోర్ట్​ను కూడా అందించింది. కస్టమర్ల అన్ని అవసరాలను తీర్చేందుకు దీనిలో అద్భుతమైన ఫీచర్లను అందించడం విశేషం.



ఏసుస్​ AiO V241 పీసీ ప్రారంభ ధర రూ .61,990తో వస్తుంది. ఇది ఏసుస్​ ప్రత్యేక ఆఫ్​లైన్​ స్టోర్లలో, ప్రముఖ ప్రముఖ ఈ–కామర్స్ ప్లాట్​ఫాంలలో ఆన్​లైన్​లో కొనుగోలు చేయడానికి త్వరలో అందుబాటులోకి రానుంది. ఇది బ్లాక్-గోల్డ్, వైట్-సిల్వర్ అనే రెండు కలర్​ వేరియంట్లలో లభిస్తుంది. అయితే, దీని అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయంపై ఆ సంస్థ ఎటువంటి స్పష్టతనివ్వలేదు.
First published:

అగ్ర కథనాలు