భూమి చుట్టూ తిరుగుతున్న మరో ఉపగ్రహం... చందమామ లాంటిదే...

Earth New Mini Moon : భూమి చుట్టూ మరో ఉప గ్రహం తిరుగుతోందని ఎప్పటి నుంచో అంచనాలున్నాయి. ఇప్పుడు దాన్ని కనిపెట్టారు. ఈ ఆసక్తికర వార్తతోపాటే మరో విచారకర వార్త కూడా సైంటిస్టులు చెప్పారు. ఏంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: February 28, 2020, 9:07 AM IST
భూమి చుట్టూ తిరుగుతున్న మరో ఉపగ్రహం... చందమామ లాంటిదే...
భూమి చుట్టూ తిరుగుతున్న మరో ఉపగ్రహం... చందమామ లాంటిదే... (File)
  • Share this:
Earth New Mini Moon : రోజూ మనం చందమామను చూడగానే ఎంతో ఆనందపడతాం. ఎందుకూ... అది మన భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం కాబట్టి. అలాంటిదే మరో మినీ మూన్ కూడా భూమి చుట్టూ తిరుగుతోందంటే నమ్మగలరా? ఇన్నాళ్లూ ఇలాంటి ఆలోచనా, అంచనా, ఊహ మాత్రమే ఉండేది. చాలా మంది ఇలాంటి చిన్న ఉపగ్రహం తిరుగుతోందని చెప్పినా... ఇన్నాళ్లూ నిరూపించలేకపోయారు. ఇప్పుడు మాత్రం దాన్ని ఫొటోలు తీశారు. కాకపోతే అది చాలా చిన్నది. సైజులో 6 మీటర్లు మాత్రమే ఉంటుంది. దాన్ని మినీ-మూన్ అని పిలుస్తున్నారు. కానీ అది ఉపగ్రహంలా ఎంతో కాలం ఉండకపోవచ్చని అంటున్నారు. దేన్నైనా మనం ఉపగ్రహం అని పిలవాలంటే... అది మరో పెద్ద గ్రహం చుట్టూ నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతూ ఉండాలి. చందమామకు ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి... దాన్ని నేచురల్ శాటిలైట్ (సహజ ఉపగ్రహం) అంటున్నాం.

మినీ మూన్ (credit - sservi.nasa.gov)


ఈ కొత్త ఉపగ్రహానికి ఆ లక్షణాలు ఎక్కువ కాలం ఉండవని అంటున్నారు. త్వరలోనే అది భూమి కక్ష్య నుంచీ (భూమి ఆకర్షణ నుంచీ) తప్పించుకొని... వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలా వెళ్లిపోతే దాన్ని ఉపగ్రహం అనలేం. అప్పుడు దాన్ని గ్రహశకలం (Asteroid) అంటాం.


అమెరికా వ్యోమగాములు... మూడేళ్ల కిందట ఈ చిన్న రాయిని కనిపెట్టారు. అదో చిన్నపాటి గ్రహశకలం కావచ్చని అనుకున్నారు. కానీ ఫిబ్రవరి 26న అది భూమి చుట్టూ తిరుగుతున్న సర్కిల్ (భూమి చుట్టూ భ్రమణం)ను గ్రాఫికల్‌గా సృష్టించారు. తద్వారా మరో ఉపగ్రహం ఉన్న విషయాన్ని అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు.


ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనిట్ సంస్థ కింద పనిచేసే మైనర్ ప్లానెట్ సెంటర్... ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసి... చిన్న చందమామ విశేషాల్ని మనకు తెలిపింది.


మరి ఈ చిన్న చంద్రుడికి సైంటిఫిక్ నేమ్ పెట్టాలి కదా. పెట్టారు. 2020 CD₃ అని పెట్టారు. 2020 ఏప్రిల్ తర్వాత ఇది భూమిని వదిలి... రోదసీలోకి వెళ్లిపోతుందని అంచనా వేస్తున్నారు. భూమి దగ్గరకు ఇలాంటి చాలా గ్రహశకలాలు తరచూ వస్తుంటాయి. ఐతే... ఇవి భూ వాతావరణాన్ని చేరేలోపే... కాలిపోతూ ఉంటాయి.


కొత్త మినీ మూన్ మాత్రం కాలిపోకుండా భూమి చుట్టూ కుదురుగా తిరుగుతోంది. కానీ ఇది త్వరలో వెళ్లిపోతుండటం నిరాశ కలిగించే అంశమే. ఇలా ఓ ఆసక్తికర విషయం, ఓ విచారకర విషయం రెండూ శాస్త్రవేత్తలు తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: February 28, 2020, 9:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading