భూమి పక్కనుంచీ వెళ్లిన గ్రహశకలం... నాసా ఏం చెప్పిందంటే...

NASA : ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టి ఉంటే... ఇప్పుడు మనమంతా... మరికొన్ని రోజుల్లో నాశనమైపోయే భూమి గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ప్రపంచం అంతమైపోతోందే అని ఆందోళన చెందే వాళ్లం. ఎందుకంటే అది చిన్న గ్రహశకలం కాదు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనాలంత పెద్దది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 15, 2019, 2:29 PM IST
భూమి పక్కనుంచీ వెళ్లిన గ్రహశకలం... నాసా ఏం చెప్పిందంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Asteroid : శనివారం రాత్రి 7.54కి మనమంతా వీకెండ్ పనుల్లో తలమునకలై ఉండి ఉంటాం. సరిగ్గా ఆ సమయంలో... భూమి పక్క నుంచీ అరకిలోమీటర్ కంటే పెద్దదైన గ్రహశకలం ఒకటి వేగంగా వెళ్లిపోయింది. దానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా... 2000 QW7 అని పేరు పెట్టింది. ప్రస్తుతం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనం... ప్రపంచంలోనే ఎత్తైనది. దాని ఎత్తు 2717 అడుగులు. దాని తర్వాత ఎత్తైన భవనం చైనా లోని షాంఘై టవర్. దాని ఎత్తు 2073 అడుగులు. భూమి పక్క నుంచీ వెళ్లిన గ్రహశకలం... బుర్జ్ ఖలీఫా కంటే కాస్త చిన్నది. షాంఘై టవర్ కంటే కాస్త పెద్దది. ఎందుకంటే దాని పొడవు 2132 అడుగులు. మన అదృష్టం బాగుండి... అది భూమిని ఢీకొట్టలేదు. కొట్టి ఉంటే... భూమి సర్వనాశనం అయ్యేదే.

మీకు ఇంతకంటే షాకింగ్ విషయం చెప్పనా. ఆ గ్రహశకలం వేగం ఎంతో తెలుసా. సెకండ్‌కి... 6 కిలోమీటర్ల వేగంతో వెళ్లింది. అంటే... ఆ గ్రహశకలం చందమామ అంత దూరంలో మనకు కనిపించిందని అనుకుందాం. అది మన దగ్గరకు వచ్చేందుకు ఎంత టైమ్ పడుతుందో తెలుసా... జస్ట్ 16 గంటలే. అంటే... చూస్తుండగానే అది అలా అలా దగ్గరకు వచ్చేస్తుందన్నమాట. కన్నుమూసి తెరిచేలోపే... అది భూమిని ఢీకొట్టగలదు. అంతే వేగంతో గ్రహశకలం భూమిని ఢీకొంటే... భూమిపై ఓ కొండంత కన్నం పడుతుంది. ఆ విధ్వంసానికి పెను భూకంపం వస్తుంది. భూమిపై వాతావరణం పూర్తిగా మారిపోయి, భూమి మొత్తం కాలుష్యంతో నిండిపోతుంది. ఫలితంగా మరికొన్ని రోజుల్లోనే భూమిపై జీవజాలం మొత్తం చనిపోయేదే. లక్కీగా ఆ గ్రహశకలం మన భూమికి 53,31,666 కిలోమీటర్ల దూరం నుంచీ అలా వెళ్లిపోయింది. ఈ డిస్టాన్స్ చూసి... చాలా దూరం నుంచీ వెళ్లిందిగా అని అనుకోకండి. అంతరిక్షంలో దూరాలతో పోల్చితే... ఇది చాలా తక్కువ దూరమే.

ఈ గ్రహశకలం వస్తోందన్న విషయాన్ని నాసా ముందుగా చెప్పలేదు. చెబితే ఎక్కడ ప్రజలు టెన్షన్ పడతారోనని సైలెంట్‌గా ఉన్నట్లుంది. గ్రహశకలం వెళ్లిపోయిన తర్వాత మాత్రం విషయం చెప్పింది. ఆ భారీ రాయిని నాసాలోని సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ సంస్థ పరిశోధిస్తోంది.

మీకు మరో షాకింగ్ విషయం చెప్పనా... రెండు రోజుల కిందట కూడా ఇలాగే గ్రహశకలం 2010 C01... భూమి పక్క నుంచే వెళ్లింది. దాని పొడవు 400 నుంచీ 850 అడుగులు ఉంది. అది సెప్టెంబర్ 13న రాత్రివేళ 11.42కి భూమి పక్క నుంచీ వెళ్లింది.

మీకు మరో ఆశ్చర్యకర విషయం చెప్పనా... ఇలా భూమివైపు వచ్చే గ్రహశకలాలు 20వేలకు పైగా ఉన్నాయి. ప్రతీ వారం యావరేజ్‌గా మరో 30 కొత్తవి వస్తున్నాయి. వాటిలో 95 శాతం రాళ్లను నాసా 1998 నుంచీ కనిపెడుతూ ఉంది. ఎప్పుడు ఏ రాయి ఎటు వెళ్తోందో నాసా గమనిస్తూనే ఉంది. అయినప్పటికీ కొన్ని రాళ్లు... నాసా కళ్లుగప్పి... భూమివైపు వచ్చేస్తున్నాయి. అవి వెళ్లిపోయిన తర్వాత గానీ ఆ విషయం నాసా గుర్తించలేకపోతోంది. సో... మనం ఉన్న ఈ భూమి ప్రమాదంలోనే ఉంది. ఈ భూమికి మనం చేస్తున్న విధ్వంసంతోపాటూ... అంతరిక్షం నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది.
First published: September 15, 2019, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading