AS TIKTOK TURNS ONE YEAR HERES A QUICK REWIND TO SOME OF ITS BIGGEST TRENDS IN INDIA NK
Tik Tok : టిక్ టాక్‌కి ఏడాది పూర్తి... ఇండియాలో అతిపెద్ద ట్రెండింగ్ వీడియోలు ఏవి?
ప్రతీకాత్మక చిత్రం
Tik Tok : 15 సెకెండ్ల షార్ట్ వీడియోలతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకుంది టిక్ టాక్. ఇండియోలా మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా యాప్‌గా మారిపోయింది. జస్ట్ ఏడాది కాలంలోనే ఇంతటి ఫేమ్ తెచ్చుకుంది టిక్ టాక్.
చైనా కంపెనీ బైట్ డాన్స్ ప్రవేశపెట్టిన షార్ట్ వీడియో మెసేజ్ యాప్ టిక్ టాక్... ఇండియా సోషల్ మీడియాలో సైబర్ తుఫాను తీసుకొచ్చింది. 2018 చిన్నగా మొదలైన టిక్ టాక్... ఒక్కో నెలా గడిచే కొద్దీ... కోట్ల మంది అభిమానులకు చేరువైంది. మొదట్లో కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ అయినా... తర్వాత కొన్ని కండీషన్లతో మళ్లీ దూసుకొచ్చింది. ఎన్నో సమస్యలు వచ్చినా, సవాళ్లు ఎదురైనా... వాటన్నింటినీ ఎదుర్కొంటూ... 30 కోట్ల మందికి పైగా యూజర్లకు నచ్చే యాప్‌గా మారిపోయింది. ఎన్నో విమర్శలు వస్తున్నా... ఈ యాప్ వల్ల అనర్థాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నా... సరికొత్త యాడ్-ఆన్స్‌తో ప్రతి ఒక్కరికీ కాలక్షేప యాప్‌గా మారింది టిక్ టాక్. ఏడాది పూర్తి చేసుకున్న టిక్ టాక్... ప్రత్యేకమైన వైరల్ వీడియోలతో దుమ్మురేపుతోంది.
#DesiFood : ఈ యాప్ ద్వారా యూజర్లు చాలా మంది తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఇండియన్ వంటలు, ఇతరత్రా ఐటెమ్స్ చకచకా ఎలా తయారుచెయ్యాలో... నేర్పిస్తున్నారు. ఫలితంగా ఈ వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి.
#CricketWorldCup : క్రికెట్ వరల్డ్ కప్ జరిగినప్పుడు... టిక్ టాక్ ద్వారా... టీమ్ ఇండియాకి సపోర్టింగ్ వీడియోలు వెల్లువెత్తాయి. ఈ సమయంలో పాపులర్ గేమ్స్, వీడియోస్ ద్వారా... సోషల్ మీడియాలో టిక్ టాక్ పెను సంచలనంగా మారింది.
#ReturnOfTikTok : ఇండియాలో కొన్ని లీగల్ సమస్యల తర్వాత తిరిగి యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఆ సందర్భంగా... రిటర్న్ ఆఫ్ టిక్ టాక్ హ్యాష్ ట్యాగ్‌తో కోట్ల మంది ఈ యాప్‌కి సపోర్ట్‌గా రెస్పాండ్ అయ్యారు.
#TikTokTravel : తాజాగా టిక్ టాక్... #YehMeraIndia ట్యాగ్ తెచ్చింది. దీని ద్వారా ప్రపంచ దేశాలకు... ఇండియా ట్రావెల్ డెస్టినేషన్ అయ్యేందుకు వీలుగా వీడియోలను అందిస్తోంది.
#BottleCapChallenge : సోషల్ మీడియాలో ఛాలెంజ్‌లను సెలబ్రిటీలతోపాటూ... ప్రజలూ ఫేస్ చేస్తున్నారు. తాజాగా టిక్ టాక్ యూజర్ @VaibhavShetkar బాటిల్ ఛాలెంజ్ విసిరాడు. ఇందులో మరాఠా షో విథు మాలీలోని యాక్టర్ అజింక్య రావత్... పాల్గొన్నాడు. ఇది ఈ ఏడాది అతి పెద్ద ట్రెండ్స్‌లో ఒకటిగా నిలిచింది.
టిక్ టాక్‌కి ఇండియా అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. దాన్ని మరింత విస్తరించుకునేందుకు బైట్ డాన్స్ ఎన్నో క్యాంపెయిన్లు చేస్తోంది. #MyTikTokStory, #YogaDay2019, #DidiDance, #CycleCyle వంటివి 2018లో టిక్ టాక్ మొదలైనప్పటి నుంచీ ఈ యాప్ ద్వారా వైరల్ అవుతున్న కొన్ని ఛాలెంజెస్.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.