హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram‌కు పదేళ్లు, దాని పుట్టుపూర్వోత్తరాలు, ప్రయాణం సాగిందిలా

Instagram‌కు పదేళ్లు, దాని పుట్టుపూర్వోత్తరాలు, ప్రయాణం సాగిందిలా

భవనం కట్టాలంటే పునాది అవసరం. అలాగే ఇన్ స్టా గ్రామ్‌కి కూడా వర్తిస్తుంది. ఇన్ స్టా గ్రామ్‌లో డబ్బు సంపాదించాలంటే ముందు దాని మీద మీర కొంత సమయం కేటాయించాలి. దాన్ని దీర్ఘకాలంలో ఆదాయం వచ్చే వనరుగా మార్చుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

భవనం కట్టాలంటే పునాది అవసరం. అలాగే ఇన్ స్టా గ్రామ్‌కి కూడా వర్తిస్తుంది. ఇన్ స్టా గ్రామ్‌లో డబ్బు సంపాదించాలంటే ముందు దాని మీద మీర కొంత సమయం కేటాయించాలి. దాన్ని దీర్ఘకాలంలో ఆదాయం వచ్చే వనరుగా మార్చుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

Instagram: ప్రారంభించిన రెండు సంవత్సరాల తరువాత దీన్ని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌గా మారింది.

Instagram Turns 10: సామాజిక మాధ్య‌మాల్లో ఫొటో షేరింగ్ యాప్‌గా ఇన్‌స్టా గ్రామ్‌కు మంచి పేరు ఉంది. దశాబ్దం క్రితం ఇది ప్రారంభ‌మైంది. అప్ప‌ట్లో సాధారణ ప్రజలకు అంతగా తెలియని ఇన్‌స్టాగ్రామ్.. ఇప్పుడు కొన్ని కోట్ల‌మంది ప్రజల రోజువారీ జీవితాల్లోకి ప్రవేశించింది. మన అల‌వాట్ల‌ను ప్ర‌భావితం చేసే స్థాయికి చేరుకుంది.

2010 అక్టోబర్ 6న కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రీగర్ అనే ఇద్దరు అమెరికన్లు ఫోటో షేరింగ్ కోసం ప్ర‌త్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రారంభించారు. ఫోటోను ఫిల్ట‌ర్ చేయ‌డానికి కొన్ని ఫీచ‌ర్ల‌ను అందించారు. ఇది ఎంతోమందిని ఆక‌ట్టుకుంది. ప్రారంభించిన రెండు సంవత్సరాల తరువాత దీన్ని ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌గా మారింది. 21 మిలియన్ల మంది అనుచరులతో ఫ్యాషన్ బ్లాగర్ చియారా ఫెర్రాగ్ని, 196 మిలియన్ల మంది అనుచరులతో కైలీ జెన్నర్ వంటి ఇన్‌స్టాగర్ల్స్ స్టార్లుగా మారారు. ప్రారంభించినప్ప‌టి నుంచి ఇన్‌స్టాగ్రామ్ సెల్ఫీలకు వేదిక‌గా మారింది. క్ర‌మంగా అంత‌కు మించి అభివృద్ధి చెందింది. ప్రజల లైఫ్ స్టైల్పై కూడా ఇది ప్రభావం చూపింది.

Video: ఇన్‌స్టాగ్రామ్ చూస్తే అసూయా? ఇలా తగ్గించుకోండి!, follow these 15 tips to reduce Instagram envy
ఇన్‌స్టా గ్రామ్ లోగో

వర్చువల్ స్టోర్ ఫ్రంట్‌లు.

ఇన్‌స్టాగ్రామ్ సెల్ఫీలు స‌రికొత్త‌ బ్రాండ్లను సృష్టించాయి. 2014 ఆస్కార్ అవార్డ్ ఫంక్ష‌న్లో ఎలెన్ డిజెనెరెస్, జెన్నిఫర్ లారెన్స్, బ్రాడ్ పిట్ క‌లిసి తీసుకున్న ఒక‌ సెల్ఫీ ఆ సంవ‌త్స‌రంలో తీసుకున్న టాప్ సెల్ఫీల‌లో ఒక‌టిగా నిలిచింది. ఆ ఈవెంట్ స్పాన్సర్ శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెల్ఫీ తీసుకున్నారు. అనంత‌రం ఈ యాప్ లగ్జరీ బ్రాండ్‌లకు, ముఖ్యంగా ఫాస్ట్-ఫ్యాషన్ లేబుల్‌లకు ప్లాట్‌ఫారమ్‌గా మారింది. వినియోగదారులను ఆకర్షించడానికి శక్తివంతమైన డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలను ఇన్‌స్టా గ్రామ్ అభివృద్ధి చేసింది. గత సంవత్సరం ప్రవేశపెట్టిన ఒక షాపింగ్ ఫంక్షన్ ఫీచ‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ను ఈ-కామర్స్ సైట్‌గా మార్చింది. కంపెనీలు తమ ప్రొఫైల్‌లను వర్చువల్ స్టోర్ ఫ్రంట్‌లుగా ఉపయోగించుకునేలా ఒక ఆప్ష‌న్‌ను యాప్‌లో అభివృద్ధి చేశారు. తద్వారా వినియోగదారులు యాప్ నుంచి బ‌య‌ట‌కు రాకుండానే షాపింగ్ చేసి, డ‌బ్బు చెల్లించవచ్చు.

యాంకర్ అనసూయ భరద్వాజ్ (Instagram/AnasuyaBharadwaj/Photo)
భర్తతో అనసూయ భరద్వాజ్ (Instagram/Photo)

డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు

ఇన్‌స్టా గ్రామ్‌లో ఎంతోమంది డిజిటల్ ప్రభావశీలురు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని త‌మ అభిమానుల‌కు చేరువయ్యారు. వారు రోజువారీ కంటెంట్‌ను తమ అనుచరులకు అందిస్తూ, ఫాలోవ‌ర్స్‌ను పెంచుకుంటారు. ఆ త‌రువాత‌ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలను సొంతం చేసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లగ్జరీ బ్రాండ్‌లను ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చిందని ఫ్యాషన్ హిస్టారియ‌న్ ఆడ్రీ మిల్లెట్ చెబుతున్నారు. తమ ఖాతాల ద్వారా వినియోగదారులతో ప్రతిరోజూ సంభాషించగలుగుతున్న సెల‌బ్రిటీలు ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేయ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కంటెంట్‌ను స్వేచ్ఛగా ప‌బ్లిష్ చేయ‌డం ద్వారా ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని ఆయ‌న అన్నారు.

సమంత అక్కినేని ( Image: Instagram)

ఆహారం

ఈ యాప్ భోజన అలవాట్లలో విప్లవాత్మక మార్పులు చేసింది. క్రొత్త వినియోగదారులను ఆకర్షించడానికి రెస్టారెంట్‌లు వారి వంటకాల ఫోటోలను, డెకరేట్ చేసిన ఇంటీరియర్‌ల ఫోటోలను యాప్‌లో పెడుతున్నాయి. దీని ద్వారా నేరుగా కొన్ని రెస్టారెంట్లలో టేబుల్‌ను రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇన్‌స్టాగ్రామ్లో ప్రసిద్ధ చెఫ్‌ల వంటకాలను ఎవరైనా యాక్సెస్ చేయవచ్చు. కొత్త వంటకాలు చేసే జామీ ఆలివర్ను ఇన్‌స్టా లో 8.3 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఇలాంటి సెలబ్రిటీ చెఫ్ లు  రోజూ కొత్త వంటకాలను పోస్ట్ చేస్తారు.

diabetes diet, diabetic tips, diabetic food, diabetic sugar levels, మధుమేహం, డయాబెటిక్ ఆహారం, డయాబెటిక్ డైట్, మధుమేహం ఆహారం
ప్రతీకాత్మక చిత్రం

టూరిస్ట్‌ల‌కు

మరికొందరు సెలవులను ఎంచుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగి స్తున్నారు. పర్యాటకులను ఆకర్షించే కంటెంట్ కోసం కొన్ని సంస్థలు కంటెంట్ క్రియేటర్ ల పై ఎక్కువగా ఆధారపడతాయి. ప్రివేజ్ వంటి డిజిటల్ ఇన్‌ఫ్లూయెన్స‌ర్లు తమ ట్రావెలింగ్ అనుభ‌వాల‌ను యాప్‌లో ప్రచురిస్తారు. బదులుగా టూరిస్ట్ సంస్థ‌ల నుంచి ఉచిత ప్రయాణాలు చేసే అవ‌కాశాలు పొందుతారు. 1,40,000 మంది అనుచ‌రులు ఉన్న ప్రివేజ్ సంవత్సరానికి ఆరు నుంచి ఏడు "స్పాన్సర్డ్ ట్రిప్స్" చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా, మ్యూజియంలు, టూరిస్ట్ స్పాట్ల వ‌ద్ద‌ సెల్ఫీలు తీసుకొని వాటిని ఇన్‌స్టాగ్రామ్లో పోస్ట్ చేయ‌డం ద్వారా ట్రావెలింగ్ కంపెనీలు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించ‌వ‌చ్చు.

travel insurance, Coronavirus, COVID-19, covid travel insurance, travel insurance claim, trip delay coronavirus, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, కరోనా వైరస్, కోవిడ్ 19, కోవిడ్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్, ట్రావెల్ ఇన్యూరెన్స్ క్లెయిమ్, ప్రయాణ బీమా లాభాలు నష్టాలు
ప్రతీకాత్మక చిత్రం

దుష్ప్రభావాలు లేవా?

సోషల్ మీడియా సెలబ్రిటీలు అందరూ డబ్బు కోసం పని చేయరు. 1,07,000 మంది అనుచరులు ఉన్న డాక్టర్ షావా వెట్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలు, మైదానాల నుంచి జంతువులతో కలిసి ఫోటోలు తీసుకున్నారు. వాటిని యాప్ లో పోస్ట్ చేశారు. తద్వారా ఇతరులు అలాంటి సుందర దృశ్యాలు, పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇన్‌స్టాగ్రామ్ లైక్ ల కోసం తపన పడే కొంతమందిని ఈ వేదిక బానిసగా మార్చింది. ఇలాంటి యాప్‌లు యువతకు వినాశకరమైన ప్రభావాలను మిగిలిస్తుందని మనస్తత్వవేత్త స్టోరా చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ టీనేజర్‌ల మీద ఒత్తిడిని పెంచుతుందని ఆయన అన్నారు. ఇన్ ఫ్లూయెన్సర్లు కూడా ఒత్తిడి బారిన పడతారని పేర్కొన్నారు.

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Instagram, Social Media

ఉత్తమ కథలు