#Fashion Tips: ఎప్పుడు ఏ డ్రెస్ వేయాలో చెప్పే మెషిన్

అందరి కంటే భిన్నంగా కనిపించాలంటే మాంచి డ్రెస్ వేసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. కానీ, ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థంకాదు..అలాంటివారి కోసం చక్కని పరికరం మార్కెట్‌లోకి వస్తుంది.

Amala Ravula | news18-telugu
Updated: January 16, 2019, 8:46 PM IST
#Fashion Tips: ఎప్పుడు ఏ డ్రెస్ వేయాలో చెప్పే మెషిన్
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 16, 2019, 8:46 PM IST
చాలామంది డ్రెస్సింగ్ విషయంలో తికమకపడుతుంటారు. అందరి కంటే భిన్నంగా కనిపించాలంటే మాంచి డ్రెస్ వేసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. కానీ, ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థంకాదు.. వెంటనే ఎవరో ఒకరి సలహా తీసుకుంటారు. మరి, ఒక్కో సమయంలో ఒక్కరే ఉంటే పరిస్థితి ఏంటి.. ఇలాంటి సమస్య పరిష్కారం కోసమే.. జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, గూగుల్‌ బ్రెయిన్‌.. సరికొత్త ఆలోచన చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది.
ఇప్పటికే పూర్తిగా తయారైన ఈ పరికరం.. టెస్టింగ్ టైమ్‌లో ఉంది. అదేనండోయ్.. మెషీన్ లెర్నింగ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు నేర్పిస్తున్నారు. దీనికోసం యానిమేషన్ సహకారం తీసుకుని.. అందులో క్యారెక్టర్ల ద్వారా తగిన దుస్తులు ఎంపి చేసేలా శిక్షణ ఇస్తున్నామని నిపుణులు చెబుతున్నారు.

ఇది పూర్తైన వెంటనే.. రోజూవారీ జీవితంలో పనిచేసేందుకు ట్రైనింగ్ ఇచ్చి మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు తయారీదారులు..

ఇంకేంటి మరి.. మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఆర్డర్ చేసుకుని అందరిముందు మోడల్స్‌లా వెలిగిపోండి..
First published: January 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...