ARMY DEVELOPS ITS OWN WHATSAPP LIKE MESSAGING SERVICE TO PREVENT LEAKS GH NS
Indian Army: సైనికుల కోసం ఇండియన్ ఆర్మీ స్పెషల్ మెస్సేజింగ్ యాప్.. ప్రత్యేకతలివే..
ప్రతీకాత్మక చిత్రం
సైనికుల కోసం ప్రత్యేకంగా ఒక మెస్సేజింగ్ యాప్‌ను ఇండియన్ ఆర్మీ అభివృద్ధి చేసింది. సమాచారాన్ని ఇతరులు యాక్సెస్ చేయడానికి సాధ్యం కాని ‘సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్ (SAI)’ మెసేజింగ్ అప్లికేషన్‌ను సొంతంగా అభివృద్ధి చేసింది.
సైనికుల కోసం ప్రత్యేకంగా ఒక మెస్సేజింగ్ యాప్‌ను ఇండియన్ ఆర్మీ అభివృద్ధి చేసింది. సమాచారాన్ని ఇతరులు యాక్సెస్ చేయడానికి సాధ్యం కాని ‘సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్ (SAI)’ మెసేజింగ్ అప్లికేషన్‌ను సొంతంగా అభివృద్ధి చేసింది. ఇతర దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ట్రేస్ చేసేందుకు వీలు లేకుండా, పటిష్టమైన భద్రత ఉండేలా దీన్ని రూపొందించారు. SAI సరళమైన, సురక్షితమైన మెస్సేజింగ్ యాప్ అని సైనికాధికారులు చెబుతున్నారు. ఇది Android ప్లాట్‌ఫాంపై ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తుంది. దీని ద్వారా ఎండ్-టు-ఎండ్ సెక్యూర్ వాయిస్, టెక్స్ట్ మెస్సేజ్‌లు, వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఆర్వీ సర్వీస్ విభాగంలో సురక్షితంగా, హ్యాకింగ్ కు అవకాశం లేకుండా మెస్సేజ్‌లను పంపవచ్చు. SAIను రాజస్థాన్‌లోని సిగ్నల్స్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సాయి శంకర్ మొదటిసారి అభివృద్ధి చేశారు. అనంతరం దీన్ని మిలటరీ గ్రేడ్ ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. యాప్‌ను అభివృద్ధి చేసినందుకు శంకర్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అభినందించారు.
వాట్సాప్ లాంటిదే..
కమర్షియల్ మెస్సేజింగ్ యాప్‌లైన వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వాటి మాదిరిగానే SAI కూడా పనిచేస్తుంది. ఇది ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ మెసేజింగ్ ప్రోటోకాల్ ద్వారా పటిష్టమైన భద్రతను వినియోగదారులకు అందిస్తుంది. సైన్యానికి చెందిన ప్రత్యేక అంతర్గత సర్వర్లు, కోడింగ్ దీనికి సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తాయి. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్- CERT, ఆర్మీ సైబర్ గ్రూప్ సంస్థలు ఎస్ఏఐ యాప్ పనితీరును పరిశీలించాయి. ప్రస్తుతం ఈ యాప్ మేధో సంపత్తి హక్కు (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్) కోసం నమోదు చేసే పనిలో అధికారులు ఉన్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన అనంతరం, యాప్‌ను iOS ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంచుతామని అధికార వర్గాలు వెల్లడించాయి.
గూఢాచార్యానికి అవకాశం ఉండదు..
ఆన్లైన్ గూఢచర్యం చేసే చైనా, పాకిస్తాన్ ఏజెంట్లు మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం, డేటాను రహస్యంగా పొందటానికి నిరంతరం మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని, అధికారిక పనుల కోసం వాట్సాప్ యాప్‌ను వాడకూడదని గత ఏడాది ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. సెన్సిటివ్ అపాయింట్మెంట్లకు సంబంధించిన సమాచారం ఉండే అధికారుల ఫేస్బుక్ అకౌంట్లను సైతం తొలగించమని కోరింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా పాకిస్తాన్ కు చెందిన సంస్థలు హనీ ట్రాపింగ్ చేస్తూ, సైన్యానికి చెందిన సమాచారాన్ని దొంగతనంగా సేకరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా సొంతంగా ఒక యాప్‌ను ఆర్మీ అభివృద్ధి చేసుకుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.