హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

IPL 2021: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తున్నారా? రోజూ 3జీబీ డేటా ఇచ్చే Jio, Airtel, Vi ప్లాన్స్ ఇవే

IPL 2021: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తున్నారా? రోజూ 3జీబీ డేటా ఇచ్చే Jio, Airtel, Vi ప్లాన్స్ ఇవే

IPL 2021: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తున్నారా? రోజూ 3జీబీ డేటా ఇచ్చే Jio, Airtel, Vi ప్లాన్స్ ఇవే
(image: IPL)

IPL 2021: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తున్నారా? రోజూ 3జీబీ డేటా ఇచ్చే Jio, Airtel, Vi ప్లాన్స్ ఇవే (image: IPL)

IPL 2021 | స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను చూస్తున్నారా? అయితే ఎక్కువ డేటా కోసం రోజూ 3జీబీ డేటా ఇచ్చే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్స్ గురించి తెలుసుకోండి.

  ఐపీఎల్ సందడి మొదలైంది. క్రికెట్ మ్యాచ్‌లూ మొదలయ్యాయి. మీరు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను స్మార్ట్‌ఫోన్‌లో చూస్తున్నారా? అయితే ఎక్కువ డేటా ఉన్న ప్లాన్స్ అవసరం. ఇంతకుముందులా రోజూ 1.5జీబీ, 2జీబీ డేటా ప్లాన్స్ సరిపోకపోవచ్చు. కాబట్టి రోజూ 3జీబీ డేటా ఉన్న ప్లాన్స్ ఎంచుకోవడం అవసరం. రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా-Vi రోజూ 3జీబీ డేటాతో వేర్వేరు ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే రోజంతా 3జీబీ డేటా వాడుకోవచ్చు. ఐపీఎల్ సీజన్‌లో ఎక్కువగా ఉపయోగపడే ప్లాన్స్ ఇవి. మరి రోజూ 3జీబీ డేటాతో పాటు ఈ ప్లాన్స్‌పై రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా-Vi ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తున్నాయో తెలుసుకోండి.

  Jio Rs 349 Plan: రిలయెన్స్ జియోలో రూ.349 ప్లాన్‌పై రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. అంటే 28 రోజుల్లో మొత్తం 84జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 3జీబీ డేటా పూర్తిగా వాడిన తర్వాత స్పీడ్ 60 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

  Jio Rs 401 Plan: రిలయెన్స్ జియోలో రూ.401 ప్లాన్‌పై రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. రూ.349 ప్లాన్‌కు ఉన్నట్టుగానే బెనిఫిట్స్ ఉంటాయి. కానీ అదనంగా మరో 6జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 90జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. జియోలో పాపులర్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఇది.

  Lenovo Legion Duel 2: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2 ఫ్యాన్లు, 2 బ్యాటరీలు ఉన్నాయి... ఎందుకో తెలుసా?

  Online Startup Ideas: ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించడానికి 10 ఐడియాలు

  Jio Rs 999 Plan: రిలయెన్స్ జియోలో రూ.999 ప్లాన్‌పై రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 84 రోజులు. అంటే 84 రోజుల్లో మొత్తం 252 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజూ 3జీబీ డేటా పూర్తిగా వాడిన తర్వాత స్పీడ్ 60 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు.

  Airtel Rs 398 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.398 రీఛార్జ్ చేస్తే రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. అంటే 28 రోజుల్లో 84జీబీ డేటా ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లబిస్తాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో పాటు వింక్ మ్యూజిక్, షా అకాడమీ సబ్‌స్క్రిప్షన్స్ లభిస్తాయి. హెలోట్యూన్స్ ఉచితం. ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలపై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

  Airtel Rs 448 Plan: ఎయిర్‌టెల్ రూ.448 ప్లాన్‌పై రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 28 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రూ.399 విలువగల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఉచితంగా హెలోట్యూన్స్, మూడు నెలలు వింక్ మ్యూజిక్ యాక్సెస్, ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు కూడా లభిస్తాయి.

  WhatsApp: వాట్సప్‌లో ఇన్ని ట్రిక్స్ ఉన్నాయని మీకు తెలుసా?

  Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

  Airtel Rs 558 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.558 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 84జీబీ డేటా ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లబిస్తాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో పాటు వింక్ మ్యూజిక్, షా అకాడమీ సబ్‌స్క్రిప్షన్స్ లభిస్తాయి. హెలోట్యూన్స్ ఉచితం. ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలపై రూ.150 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

  Vi Rs 401 Plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.401 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. అదనంగా మరో 16 జీబీ డేటా వాడుకోవచ్చు. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. వీఐ మూవీస్ యాక్సెస్ లభిస్తుంది.

  Vi Rs 601 Plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.601 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 56 రోజులు. అదనంగా మరో 32 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు .రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. వీఐ మూవీస్ యాక్సెస్ లభిస్తుంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డేటా ఉచితంగా వాడుకోవచ్చు.

  Vi Rs 801 Plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.801 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 84 రోజులు. అదనంగా 48జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. రూ.399 విలువైన ఏడాది డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. హైస్పీడ్ నైట్‌టైమ్ ఇంటర్నెట్, వీకెండ్ డేటా రోల్ ఓవర్ బెనిఫిట్, వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ కూడా లభిస్తాయి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: AIRTEL, Airtel recharge plans, Cricket, IPL, IPL 2021, Jio, Reliance Jio, Vodafone Idea

  ఉత్తమ కథలు