యూట్యూబ్ (Youtube), టిక్‌టాక్ (Tiktok), ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) వంటి అనేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ క్రియేటర్స్ (Content Creators) సంఖ్య పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్లు(Smart Phones), ఇంటర్నెట్ (Internet) అందరికీ అందుబాటులోకి రావడంతో కొత్త యూట్యూబ్ ఛానెల్స్ క్రియేట్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కొత్త ఛానెల్స్ ఓపెన్ చేసే కంటెంట్ క్రియేటర్లు కెమెరా, లైటింగ్, ఆడియో గేర్‌తో చిత్రీకరించడం, ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ వినియోగించడం వంటి విషయాలపై దృష్టి పెట్టాలి. ఈ నేపథ్యంలో కంటెంట్ షూట్ చేయడం కోసం ఎలాంటి కెమెరాను కొనుగోలు చేయాలి, ప్రైమరీ లైటింగ్ సెటప్‌ను ఏర్పాటు చేయడం ఎలా? ఎడిటింగ్‌కి ఏది బెస్ట్ వంటి వివరాలు తెలుసుకోండి..
* ఖరీదైన కెమెరా కావాలా?
యూట్యూబ్ ఛానెళ్లలో అప్‌లోడ్ చేసే కంటెంట్ కోసం ఖరీదైన కెమెరా అవసరమని చాలామంది భావిస్తారు. దీంతో ఖర్చు విషయంలో నిరుత్సాహపడతారు. అయితే క్వాలిటీ కంటెంట్‌ను రూపొందించడానికి RAWలో షూట్ చేసే అత్యుత్తమ ప్రొఫెషనల్ కెమెరా అవసరం లేదు.
గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్య అంశాలు ఇవే..
- మంచి ఆటో ఫోకస్ ఉన్న కెమెరాను కొనుగోలు చేయాలి. సింగిల్‌గా షూట్ చేసేటప్పుడు మాన్యువల్‌గా ఫోకస్ తీసుకురావడం ఇబ్బంది కలిగించదు.
- కెమెరాకు ఫ్లిప్ అయ్యే స్క్రీన్ ఉండాలి. దీని వల్ల షూటింగ్ సులువు అవుతుంది.
- హై ఫ్రేమ్ రేట్‌తో షూటింగ్ చేయడం అందరికీ నచ్చుతోంది. కనీసం 1080P 60FPSలో ఫిల్మ్‌లు చేసే కెమెరాను సెలక్ట్ చేసుకోవాలి. B-రోల్స్ కోసం ‘సినిమాటిక్’ స్లో-మోషన్ సాధించడానికి 60FPS, అంతకంటే ఎక్కువ వేగంతో షూట్ చేయాల్సి ఉంటుంది.
- కెమెరాలో తప్పనిసరిగా మైక్ కోసం ఇన్‌పుట్ ఉండాలి. వీడియో నాణ్యత కంటే ఆడియో నాణ్యత కూడా అంతే ముఖ్యం.
- వేగవంతమైన (పెద్ద) ఎపర్చరుతో వైడ్ లెన్స్‌ను కొనుగోలు చేయాలి. సిగ్మా 16mm F/1.4 (24mm ఫుల్-ఫ్రేమ్ ఈక్వలెంట్) వంటిది వైడర్ షాట్‌ను తీయడంలో సహాయపడుతుంది.
ఈ అవసరాల ఆధారంగా కొత్త మిర్రర్‌లెస్ Canon R7/ R10 లేదా చౌకైన M50 ii వంటి APS-C కెమెరా బాడీలు సరిపోతాయి. వ్లాగర్‌లు Sony ZV-E10ని కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ వినియోగదారులు Canon R5/R6, Sony A7 IV, A7 SIII వంటి ఫుల్-ఫ్రేమ్ కెమెరాలను పరిశీలించవచ్చు.
* ఆడియో ఎలా..?
కొత్త కంటెంట్ క్రియేటర్లు వీడియోలను రూపొందించేటప్పుడు ఆడియోను పూర్తిగా విస్మరిస్తున్నట్లు తెలుస్తోంది. వీడియోలకు ఆడియో క్వాలిటీ చాలా ముఖ్యమైంది. అందుకే కంటెంట్‌పై ఆధారపడి, షాట్‌గన్, లావలియర్, కండెన్సర్ మైక్ వంటివి సెలక్ట్ చేసుకోవచ్చు. షాట్‌గన్ మైక్‌లు వ్లాగ్‌లు, డాక్యుమెంటరీల వంటి వాటికి సరిపోతాయి. పాడ్‌క్యాస్ట్ వంటి వాటికి కండెన్సర్ మైక్ బెస్ట్ ఆప్షన్. BOYA BYM1 వంటి చవకైన మైక్‌ని కూడా పరిశీలించవచ్చు.
ఇది కూడా చదవండి : ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు అలర్ట్.. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్‌తో బోలెడు సమస్యలు.. ముఖ్యంగా..
* లైట్లు అవసరమా?
హై-ఫ్యాషన్ పోర్ట్రెయిచర్, వీడియోలు, కమర్షియల్ షూట్‌ల వంటి ప్రొఫెషనల్-గ్రేడ్ పని కోసం, బెస్ట్ లైటింగ్ గేర్ అవసరం. ప్రకాశవంతమైన డే లైట్‌లో షూట్ చేసిన వాటికంటే ఫోటో లేదా వీడియోలు చక్కగా వస్తాయి. సోలో క్రియేటర్స్ సెటప్, ఆపరేషన్, సాధారణ సౌలభ్యం కోసం ఎల్లప్పుడూ 3-పాయింట్ లైటింగ్ సెటప్‌ని ఉపయోగించి షూట్ చేయడం ఉత్తమ ఆలోచన కాదు. కాంతిని ప్రతిబింబించేలా తెల్లటి చార్ట్ పేపర్ వంటి వాటితో కేవలం కీ లైట్‌తో షూట్ చేయవచ్చు. ఆహ్లాదకరంగా వెలిగే షాట్‌ను తీయడానికి కిటికీల నుంచి సహజంగా వచ్చే స్మూత్ లైటింగ్‌ను ఉపయోగించవచ్చు.
* ఎడిటింగ్ కీలకం
సినిమాటోగ్రఫీ ఎంత పెద్ద కళారూపమో ఎడిటింగ్ కూడా అంతే పెద్దది. iMovie వంటి ఉచిత సాఫ్ట్‌వేర్ ఉపయోగించడం ద్వారా కటింగ్ ఎడిటింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు. కానీ వర్క్‌ఫ్లో గురించి తీవ్రంగా ఆలోచిస్తే, Adobe Premiere Pro, Final Cut Pro X, Blackmagic DaVinci Resolve వంటివి పరిగణనలోకి తీసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tech news, Youtube, Youtube channel, Youtuber