5G Mobiles: 5జీ మొబైల్ కొనాల‌నుకుంటున్నారా.. అయితే ఓ లుక్కేయండి

(image: Samsung India)

ప్ర‌స్తుతం మార్కెట్(Market)అంతా 5జీ మొబైల్స్ చుట్టూ తిరుగుతోంది. రోజు ప్ర‌తీ మొబైల్ కంపెనీ కొత్త ఫీచ‌ర్ల‌తో 5జీ మొబైల్‌ను ప్ర‌వేశ పెడుతోంది. 5g మొబైల్ కొనాలనుకొంటే.. త్వ‌ర‌లో మార్కెట్‌లోకి రాబోతున్న 5జీ మొబైల్ ఫీచ‌ర్‌(Features)లు తెలుసుకోండి.. ఆ త‌ర్వాత మీకు న‌చ్చిన మొబైల్‌ను ఎంచుకోండి. దాదాపుగా అన్ని కంపెనీలో ఒకే సారి 5జీ మొబైల్‌ల‌ను వినియోగ‌దారుల ముందుకు తీసుకొస్తున్నాయి.

  • Share this:
    ప్ర‌స్తుతం మార్కెట్ అంతా 5జీ మొబైల్స్ చుట్టూ తిరుగుతోంది. రోజు ప్ర‌తీ మొబైల్ కంపెనీ కొత్త ఫీచ‌ర్ల‌తో 5జీ మొబైల్‌ను ప్ర‌వేశ పెడుతోంది. దాదాపుగా ప్ర‌ముఖ కంపెనీలు శామ్‌సంగ్(Samsung) రియల్ మీ, ఆస‌స్‌, షియోమితో స‌హా చిన్న కంపెనీలు సైతం 5జీ మొబైల్‌ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. అయితే ఏ మొబైల్ కొనాల‌నే సందేహం మీకు వ‌స్తుంది. అయితే ప్ర‌స్తుతం ఉన్న 5జీ మొబైల్‌ల‌లో త్వ‌ర‌లో మార్కెట్‌లోకి రాబోతున్న 5జీ మొబైల్ ఫీచ‌ర్‌(Features)లు తెలుసుకోండి.. ఆ త‌ర్వాత మీకు న‌చ్చిన మొబైల్‌ను ఎంచుకోండి. దాదాపుగా అన్ని కంపెనీలో ఒకే సారి 5జీ మొబైల్‌ల‌ను వినియోగ‌దారుల ముందుకు తీసుకొస్తున్నాయి. ధ‌ర‌లు కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఎవ‌రికి వారు 5జీ మొబైల్(Mobile) మార్కెట్‌లో త‌మ ముద్ర ఉండేదుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

    రియ‌ల్‌మి 8ఎస్ 5జీ..
    రియ‌ల్‌మినుంచి రియ‌ల్‌మి 8ఎస్ 5జీ మార్కెట్‌లోకి రానుంది. సెప్టెంబ‌ర్‌లో భార‌తీయ వినియోగ‌దారుల‌కు ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ఫ‌చ‌ర్లు..
    - 6GB/8GB RAM ఆప్షన్ ఉంది. అద‌నంగా 5G వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంటుంది.
    - కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoCని ఉప‌యోగిస్తున్నారు.
    - 6.5-అంగుళాల 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఫోన్ సొంతం.

    శామ్‌సంగ్ గెలాక్సీ ఏ52 ఎస్ 5జీ..
    ఎక్కువ ఫీచ‌ర్‌ల‌తో శామ్‌సంగ్ 5జీ మొబైల్‌ను మార్కెట్‌లోకిప ప్ర‌వేశ పెట్టింది. ఫీచ‌ర్లేంటో చూద్దాం.
    - FHD+ Super AMOLED ప్యానెల్, 64MP క్వాడ్-కెమెరా సెటప్,
    - స్నాప్‌డ్రాగన్ 778 SoC, మరియు 4,500mAh బ్యాటరీ
    - 6GB RAM + 128GB స్టోరేజ్ మోడ‌ల్ ధర ర.35,999
    - 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.37,499.

    Apple Electric Vehicle: త్వ‌ర‌లో మార్కెట్‌లోకి ఆపిల్ ఎల‌క్ట్రిక్ వెహికిల్‌!




    శామ్‌సంగ్ గెలాక్సీ ఎం32 5జీ
    ఇది శామ్‌సంగ్ నుంచి వ‌స్తున్న మ‌రో 5జీ మొబైల్ దీని ఫీచ‌ర్‌లు ధ‌ర‌లు ఇలా..
    - 6.5-అంగుళాల AMOLED డిస్‌ప్లే
    - స్నాప్‌డ్రాగన్ 778G SoC, 6GB RAM
    - 7,000mAh బ్యాటరీ సామ‌ర్థ్యం
    - 64MP ట్రిపుల్ రియర్ కెమెరా
    - ధ‌ర సుమారు రూ. 25,000 ఉండొచ్చు

    రెడ్‌మి నోట్ 10 ప్రొ 5జీ
    షియోమీ నుండి కూడా రెడ్‌మి నోట్ 10 ప్రో 5 జి వెర్షన్ ఈ నెలలో ఇండియాఓ విడుదల కానుంది.
    - ఈ ఫోన్ రూ.20,000 వ‌ర‌కు ఉండొచ్చు.
    - 6.6-అంగుళాల HDR10+ LCD డిస్‌ప్లే ఉంటుంది.
    - మీడియాటెక్ డైమెన్సిటీ 1100 SoC, 64MP ట్రిపుల్ కెమెరా సెటప్
    - 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి వ‌స్తోంది.

    ఆసుస్ జెన్‌ఫోన్ 8జెడ్‌
    ఆసుస్ నుంచి వ‌స్తున్న ఈ మొబైల్‌లోను ప‌లు విభిన్న ఫీచ‌ర్లు ఉన్నాయి.
    - ఫ్లాగ్‌షిప్ మోడల్ ఈ నెలలో దేశీయ మార్కెట్‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.
    - 5.9-అంగుళాల ఫుల్ HD+ 120Hz AMOLED డిస్‌ప్లే,
    - 64MP డ్యూయల్ రియర్ కెమెరా,
    - స్నాప్‌డ్రాగన్ 888 SoC మరియు 4,000mAh బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.
    Published by:Sharath Chandra
    First published: