Ola Electric Scooter : ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ వాడాల‌నుకుంటున్నారా.. అయితే తెలుసుకోండి

ప్రతీకాత్మకచిత్రం

ప్ర‌స్తుతం దేశంలో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల(Electric Scooters) వినియోగంపై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి పెరిగింది. ఇంధ‌న ధ‌ర‌లే కాకుండా.. ఇంధ‌న వాహ‌నాల నిర్వ‌హ‌ణ కూడా ఎలక్ట్రిక్ వాహ‌నాల వినియోగంపై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిని చూపుతున్నారు. మార్కెట్లోకి కొత్తగా ఓలా బైక్ (Ola Bike) వచ్చే అవకాశం ఉంది.

  • Share this:
    ప్ర‌స్తుతం దేశంలో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల(Electric Scooters) వినియోగంపై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి పెరిగింది. ఇంధ‌న ధ‌ర‌లే కాకుండా.. ఇంధ‌న వాహ‌నాల నిర్వ‌హ‌ణ కూడా ఎలక్ట్రిక్ వాహ‌నాల వినియోగంపై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఇప్ప‌టికే ఇండియాలో ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌లు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్ర‌వేశ పెట్టాయి. టాటా నుంచి నెక్సస్ ఈవీ కారు.. మ‌హీంద్రా కూడా ఎల‌క్ట్రిక్ కారు ఇప్ప‌టికే మార్కెట్లోకి వ‌స్తున్నాయి. ఓలా(Ola) సంస్థ కూడా త‌మ స్కూట‌ర్ల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తోంది. మిగితా వాటితో పోటీ ప‌డేలా ప‌లు సేవ‌ల్లో ఓలా ముందుంది. వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డంతోపాటు వారికి ఉప‌యుక్త‌మైన స‌ర్వీసులు ఇవ్వ‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తోంది.
    రాబోయే మూడు నెల‌ల్లో ఓలా ప‌లు ప్ర‌ధాన కేంద్రాల్లో ఓలా సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తోంది. అక్క‌డ ఓలా స్కూట‌ర్ల అమ్మ‌కాల‌తోపాటు ప‌లు స‌ర్వీసుల‌ను అందించ‌నుంది. అవేమిటో తెలుసుకుందాం.

    Kinetic Luna: ఎలక్ట్రిక్ లూనా వచ్చేస్తోంది.. ఫీచర్ల వివరాలు ఇవీ


    మెయింటెన్స్ స‌ర్వీసులు ఇవే..
    - మీరు ఓలా ఎల‌క్ట్రిక్ బైక్ వినియోగించే వారు ఓలా ఎల‌క్ట్రిక్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
    - ఆ యాప్‌లో ఓలా చాంపియ‌న్ అనే ఫీచ‌ర్ ఉంటుంది.
    - ఈ ఫీచ‌ర్ ద్వారా మీరు వినియోగిస్తున్న స్కూట‌ర్ స‌ర్వీసింగ్ డీటైల్స్ (Servicing information) తెలుసుకోవ‌చ్చు.
    - మీకు అవ‌స‌రం అయిన‌ప్పుడు మీ ఈ-బండిని ఎల‌క్ట్రిషియ‌న్‌ వ‌చ్చి స‌ర్వీసింగ్ చేసి వెళ్తాడు.
    - మామూల స‌మ‌యాల్లోనూ బండి స‌ర్వీసంగ్ వెళ్ల‌కుండానే ఇంటి వ‌ద్దే స‌ర్వీసింగ్ చేస్తారు.
    - బండికి సంబంధించిన పూర్తి స‌మాచారం ఈ యాప్‌లో పొందుప‌రుస్తారు.

    భవిష్య‌త్‌లో ఎల‌క్ట్రిక్ బైక్ వినియోగం చాలా పెరగ‌నుంది. అందుకు త‌గ్గ‌ట్టుగా వాహ‌నాల్లో ఎన్నో సాంకేతిక ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఎల‌క్ట్రిక్ కార్లు, బైక్‌ల వినియోగంతో పాటు వాటి రిపేర్ సంబంధిత రంగాల్లోనూ ఉపాధికి మంచి భ‌విష్య‌త్ ఉంటుంది.
    Published by:Sharath Chandra
    First published: