హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Wi-Fi: వైఫై ఎక్కువగా వాడుతున్నారా? ఈ సమస్యలు తప్పవు

Wi-Fi: వైఫై ఎక్కువగా వాడుతున్నారా? ఈ సమస్యలు తప్పవు

Wi-Fi: వైఫై ఎక్కువగా వాడుతున్నారా? ఈ సమస్యలు తప్పవు
(ప్రతీకాత్మక చిత్రం)

Wi-Fi: వైఫై ఎక్కువగా వాడుతున్నారా? ఈ సమస్యలు తప్పవు (ప్రతీకాత్మక చిత్రం)

Wi-Fi Disadvantages | వైఫై వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వైఫై ఉపయోగించే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యానికి ముప్పు తప్పదు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

టెక్నాలజీ (Technology) వేగంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లోనే ఊహించని మార్పులను తీసుకొస్తోంది. అద్భుత ఆవిష్కరణలు ఆశ్చర్య పరుస్తున్నాయి. కమ్యూనికేషన్ సిస్టమ్‌, టెక్నాలజీ అభివృద్ధితో ప్రజల జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రజల జీవనాన్ని సులభతరం చేస్తున్నాయి. ఇంతకముందు కొన్ని రకాల పనులు చేయాలంటే గంటలు, రోజులు వెచ్చించాల్సి వచ్చేది.. అలాంటి పనులు స్మార్ట్‌ఫోన్లు (Smartphones), ల్యాప్‌టాప్స్‌లో ఇప్పుడు నిమిషాల్లో పూర్తవుతున్నాయి. ప్రపంచంలో ఏ మూల జరిగిన అంశమైనా క్షణాల్లో అందరికీ చేరువవుతుంది. ఏ దేశంలోని వారితోనైనా సులువుగా కమ్యూనికేట్‌ అయ్యే అవకాశం కలిగింది. టెక్నాలజీ లేని మానవుని జీవితం ఊహించడం కష్టంగా మారింది. ఇంతలా ప్రజల జీవితాల్లో భాగమైపోయిన టెక్నాలజీ మితిమీరిన వినియోగంతో సమస్యలు పొంచి ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Wi-Fi, మొబైల్‌ (Mobile) అతిగా వినియోగిస్తే ముప్పు

ప్రస్తుతం ఇండియాలో 5G లాంచ్‌ అయింది. ఇంటర్నెట్‌ మెరుగైన కనెక్టివిటీ ద్వారా నిరంతరాయంగా ఎంటర్‌ట్రైన్‌మెంట్‌ పొందే అవకాశం ప్రజలకు కలిగిస్తోంది. అయితే ఇలా కంటిన్యూగా ఇంటర్నెట్‌ వినియోగించడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. Wi-Fi, మొబైల్‌ని నిరంతరం ఉపయోగించడం, వాటి పరిధిలో ఎక్కువ సమయం ఉండటం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది.

LIC WhatsApp Services: తొలిసారి వాట్సప్ సేవల్ని ప్రారంభించిన ఎల్ఐసీ ... ఇక ఈ సేవలన్నీ మీ ఫోన్‌లోనే

నిద్ర దెబ్బతింటుంది

Wi-Fi వేవ్స్‌, ఇంటర్నెట్‌ (Internet)ను ఎక్కువగా ఉపయోగించడం నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించే వారిలో నిద్రలేమి సమస్య కనిపిస్తోంది.

కంటి చూపుపై నెగెటివ్‌ ఎఫెక్ట్‌

మొబైల్స్ , ల్యాప్‌టాప్‌లను ఎక్కవ సేపు ఉపయోగిస్తే కంటి చూపుపై ప్రభావం కనిపిస్తుంది. ఎక్కవ సేపు మొబైల్‌ లేదా ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ చూడటం వల్ల కళ్లలో మంటలు వస్తాయి. కొన్నిసార్లు కంటి వాపు సమస్య కూడా ఎదురవుతుంది.

ఊబకాయం సమస్య

గంటల తరబడి కంప్యూటర్‌, మొబైల్‌లో ఇంటర్నెట్‌ వినియోగించడం ద్వారా ఆటోమేటిక్‌గా శారీరక శ్రమ తగ్గిపోతుంది. దీని వల్ల ఊబకాయం సమస్య పెరుగుతోంది.

Best Android Apps: ఈ ఏడాది ఇవే బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్, గేమ్స్... లిస్ట్ విడుదల చేసిన గూగుల్

చిరాకు పెరుగుతుంది

Wi-Fi వేవ్స్‌ మానసికంగా ప్రభావితం చేస్తాయి. ఇంటర్నెట్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎక్కువగా చిరాకు వస్తుంది. ప్రతి చిన్న విషయానికి అసహనం వ్యక్తం చేస్తుంటారు.

అల్జీమర్స్ సమస్య

ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రజల జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావం కనిపిస్తోంది. దీనివల్ల అల్జీమర్స్ సమస్యలు వస్తున్నాయి. చాలా మంది విషయాలను గుర్తుపెట్టుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Bluebugging: బ్లూటూత్ వాడేవారికి 'బ్లూబగ్గింగ్' రిస్క్... మీరేం చేయాలంటే

ఇవి పాటిస్తే మేలు

రాత్రి నిద్రపోతున్నప్పుడు wi-fiని ఆఫ్ చేయాలి. నిద్ర పోయే ముందు మొబైల్‌ వినియోగించకూడదు. రోజులో ఎక్కువగా శారీరక శ్రమ చేయడానికి ప్రయత్నించాలి. బయటి ఆటలు ఆడటం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. పోషకాహారం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండటం మేలు.

First published:

Tags: Smartphone, Wifi

ఉత్తమ కథలు