Password: మీ పాస్‌వర్డ్ ఇదేనా? అయితే చిక్కుల్లో పడ్డట్టే

Most common Password | 2 కోట్ల 30 లక్షల అకౌంట్లు హ్యాక్ కావడానికి కారణమైన ఒకే ఒక్క పాస్‌వర్డ్ ఏంటో తెలుసా? 123456. అవును కోట్లాది మంది తమ అకౌంట్లకు 123456 పాస్‌వర్డ్ సెట్ చేసుకుంటున్నారట. ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే పాస్‌వర్డ్ కూడా ఇదే.

news18-telugu
Updated: November 18, 2019, 6:25 PM IST
Password: మీ పాస్‌వర్డ్ ఇదేనా? అయితే చిక్కుల్లో పడ్డట్టే
Password: మీ పాస్‌వర్డ్ ఇదేనా? అయితే చిక్కుల్లో పడ్డట్టే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పాస్‌వర్డ్... మీరు ఏ వెబ్‌సైట్‌లో లేదా యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నా సీక్రెట్ కోడ్‌గా పాస్‌వర్డ్ పెట్టుకోవడం తప్పనిసరి. కంప్యూటర్ దగ్గర్నుంచి స్మార్ట్‌ఫోన్ వరకు పాస్‌వర్డ్ పెట్టుకోవడం అలవాటే. మీ ముఖ్యమైన డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా పాస్‌వర్డ్ ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే ఎక్కువ ఆన్‌లైన్ అకౌంట్స్ ఉంటే పాస్‌వర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవడం కష్టమే. అందుకే చాలామంది సులువుగా గుర్తుండే పాస్‌వర్డ్స్ ఉపయోగిస్తారు. 123456 లేదా abcdef లేదా 222222 ఇలాంటి పాస్‌వర్డ్స్ పెట్టుకుంటారు. మీ పాస్‌వర్డ్ ఇంత వీక్‌గా ఉంటే చిక్కుల్లో పడ్డట్టే. కొంతకాలం క్రితం యూకేకు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్-NCSC పాస్‌వర్డ్స్‌పై పెద్ద అధ్యయనమే జరిపింది. 2 కోట్ల 30 లక్షల అకౌంట్లు హ్యాక్ కావడానికి కారణమైన ఒకే ఒక్క పాస్‌వర్డ్ ఏంటో తెలుసా? 123456. అవును కోట్లాది మంది తమ అకౌంట్లకు 123456 పాస్‌వర్డ్ సెట్ చేసుకుంటున్నారట. ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే పాస్‌వర్డ్ కూడా ఇదే.

నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్-NCSC తరచుగా ఉపయోగించే లక్ష పాస్‌వర్డ్స్‌ను గుర్తించింది. అలాంటి పాస్‌వర్డ్స్‌ని హ్యాక్ చేయడం చాలా సులువు. టాప్ 5 పాస్‌వర్డ్స్ వివరాలు చూస్తే మొదటి స్థానంలో 123456 ఉంది. ఆ తర్వాత 123456789, qwerty, password, 1111111 పాస్‌వర్డ్స్ ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా పాస్‌వర్డ్‌లో ఎక్కువగా ఉపయోగించిన పేర్లు చూస్తే Astley, Michael, Daniel, Jessica, Charlie ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కామన్‌గా ఉపయోగించే 20 పాస్‌వర్డ్స్ ఇవే



123456
123456789


Qwerty
Password1111111
12345678
Abc123
1234567
Password 1
12345
1234567890
123123
000000
Iloveyou
1234
1q2w3e4r5t
Qwertyuiop
123
Monkey
Dragon

మరి మీరు మీ అకౌంట్లకు ఇలాంటి కామన్ పాస్‌వర్డ్స్ పెడితే చిక్కుల్లో పడ్డట్టే. ముఖ్యంగా మీ మెయిల్స్, బ్యాంక్ అకౌంట్స్‌కి ఇలాంటి వీక్ పాస్‌వర్డ్స్ ఎప్పుడూ పెట్టుకోవద్దు. మీరు ఉపయోగించే పాస్‌వర్డ్స్‌లో ఇవి ఉంటే వెంటనే మార్చేయండి.

Mi Organic T-shirt: షావోమీ నుంచి ఆర్గానిక్ టీ-షర్ట్స్... ఎలా ఉన్నాయో చూడండి



ఇవి కూడా చదవండి:

Fake Apps: పొరపాటున ఫేక్ యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? ఈ టిప్స్ పాటించండి

SBI Card: ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు బ్లాక్ అవుతుంది జాగ్రత్త

Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్... ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్
First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు