స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నవారి సంఖ్య భారీగా పెరిగింది. కరోనా తరువాత ఆన్లైన్ పేమెంట్ విధానం ప్రజల సాధారణ అవసరంగా మారింది. ఇందుకు ప్రోత్సాహకాలు సైతం అందుబాటులో ఉండటంతో గూగుల్ పే (GPay), పేటీఎం (Paytm), ఫోన్‌పే (PhonePe) వంటి UPI పేమెంట్ యాప్స్ వాడకం పెరుగుతోంది. అయితే మన ట్రాన్సాక్షన్స్‌కు సౌలభ్యాన్ని అందించే ఈ టూల్స్‌తో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. సైబర్ మోసాలకు గురికాకుండా ఉండేందుకు వినియోగదారులు UPI పేమెంట్స్‌కు సంబంధించిన సేఫ్టీ టిప్స్, ట్రిక్స్ గురించి తెలుసుకోవాలి.
మొబైల్ ఫోన్‌కు వచ్చే అన్ సెక్యూర్డ్ లింక్‌లపై క్లిక్ చేయడం, మోసపూరిత కాల్స్‌కు సమాధానం ఇవ్వడం, పిన్ నంబర్, పాస్వర్డ్ వంటి కీలక వివరాలను తెలియని వ్యక్తులకు చెప్పడం.. వంటివి అసలు చేయకూడదు. వీటితో పాటు UPI ట్రాన్సాక్షన్స్ మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి పాటించాల్సిన మరికొన్ని చిట్కాలు, ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
* పిన్ నంబర్ షేరింగ్ వద్దు
బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నిబంధన పాటించాలి. పేమెంట్ యాప్స్ భద్రత విషయంలో పాటించాల్సిన మొదటి జాగ్రత్త ఇది. మీ పిన్ నంబర్‌ను ఎప్పుడూ, ఎవరితోనూ షేర్ చేయవద్దు. పిన్ నంబర్‌ను ఎవరితోనైనా షేర్ చేయడం వల్ల సులభంగా మోసాలకు గురవుతారు. మీ ఏటీఎం లేదా పేమెంట్ యాప్స్ పిన్ ఇతరులకు తెలిసిపోతే, వెంటనే మార్చండి.
* స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండాలి
మీ ఫోన్, పేమెంట్ యాప్స్, బ్యాంకింగ్ యాప్స్‌కు ఎప్పుడూ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండాలి. సాధారణంగా చాలా మంది తమ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి కామన్ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తారు. దీనివల్ల మీ పాస్‌వర్డ్‌ను ఇతరులు సులభంగా ట్రేస్ చేయవచ్చు. కాబట్టి అక్షరాలు, సంఖ్యలు, ఇతర గుర్తులను కలిపి పాస్వర్డ్ పెట్టుకోవడం మంచిది.
* ఆ లింక్‌లను క్లిక్ చేయవద్దు
మన ఫోన్‌కు ఎంఎంఎస్, ఈమెయిల్ ద్వారా తరచుగా అన్-వెరిఫైడ్ లింక్స్ వస్తుంటాయి. ఏవో తెలియని మెయిల్ అడ్రస్, నంబర్ల నుంచి స్కామర్లు వీటిని పంపిస్తారు. ఇలాంటి వాటిపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. సైబర్ నేరస్తులు లాభదాయకమైన ఆఫర్లు ఉన్నాయంటూ ఈ లింక్‌ల ద్వారా వ్యక్తులను ఆకర్షిస్తారు.
తరువాత పిన్, OTP వంటివి చెప్పాలని అడిగి డబ్బు దోచుకుంటారు. కొన్నిసార్లు మీ బ్యాంక్ లేదా మరేదైనా ఇతర సంస్థ నుంచి కాల్ చేస్తున్నట్లు నటించి, మీ అకౌంట్ వివరాలను అడగవచ్చు. అలాంటి లింక్‌లపై క్లిక్ చేయడం లేదా కాల్స్‌కు సమాధానం ఇస్తే సైబర్ మోసానికి గురయినట్లే.
* ట్రాన్సాక్షన్ మోడ్‌ను సింపుల్‌గా ఉంచండి
అందుబాటులో ఉన్న వివిధ పేమెంట్ యాప్‌లలో ఒకదాన్ని మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి. విశ్వసనీయ, ధ్రువీకరించిన పేమెంట్ అప్లికేషన్‌ను ఎంచుకోండి. ఎక్కువ యాప్స్‌ను ఉపయోగించడం వల్ల మోసం జరిగే అవకాశాలు సైతం పెరుగుతాయి.
* యాప్‌ను క్రమం తప్పకుండా అప్డేట్ చేయండి
పేమెంట్ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. ప్రతి అప్డేట్తో సంస్థలు మెరుగైన ఫీచర్లు, ప్రయోజనాలను అందిస్తాయి. అందువల్ల UPI పేమెంట్ యాప్‌ను తాజా వెర్షన్‌కి అప్డేట్ చేస్తూ ఉండాలి.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.