Home /News /technology /

ARE YOU USING THIRD PARTY ANTIVIRUS APP ON YOUR ANDROID SMARTPHONE KNOW IS IT NECESSARY SS

Smartphone Antivirus App: స్మార్ట్‌ఫోన్‌లో యాంటీవైరస్ యాప్ అవసరమా? తెలుసుకోండి

Smartphone Antivirus App: స్మార్ట్‌ఫోన్‌లో యాంటీవైరస్ యాప్ అవసరమా? తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Smartphone Antivirus App: స్మార్ట్‌ఫోన్‌లో యాంటీవైరస్ యాప్ అవసరమా? తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Smartphone Antivirus App | మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో థర్డ్ పార్టీ యాంటీ వైరస్ యాప్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి.

    మీ స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్ యాప్ ఉందా? సేఫ్టీ కోసం యాంటీవైరస్ యాప్ కొంటున్నారా? అసలు స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేకంగా యాంటీవైరస్ యాప్ అవసరమా? ఈ సందేహం స్మార్ట్‌ఫోన్ యూజర్లలో మామూలే. స్మార్ట్‌ఫోన్‌లోని ఫైల్స్ కరప్ట్ కాకుండా, వైరస్ దాడి చేయకుండా, బ్యాంకింగ్ లావాదేవీలు చేసేవారు సైబర్ క్రిమినల్స్‌కు టార్గెట్ కాకుండా యాంటీవైరస్ యాప్స్ కొంటూ ఉంటారు. సైబర్ నేరగాళ్లు ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఏదో ఓ ఫైల్ పంపించి, ఆ ఫైల్ క్లిక్ చేయగానే స్మార్ట్‌ఫోన్‌లోనే డేటా మొత్తాన్ని కొట్టేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఒకవేళ స్మార్ట్‌ఫోన్‌లో బెస్ట్ యాంటీవైరస్ యాప్ ఉంటే ఇలాంటి సైబర్ దాడుల్ని అడ్డుకోవచ్చు.

    ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉంటుంది. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ పేరుతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లపై ప్రొటెక్షన్ ఇస్తోంది గూగుల్. ఇది బిల్ట్ ఇన్ మాల్‌వేర్ ప్రొటెక్షన్ అందిస్తుంది. గూగుల్ ప్రతీ నెలా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందిస్తూ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓఎస్‌లో తలెత్తే సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటుంది. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ బిల్ట్ ఇన్ మాల్‌వేర్ ప్రొటెక్షన్ సర్వీస్. ప్రతీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఉంటుంది. నిత్యం కోట్లాది డివైజ్‌లను స్కాన్ చేస్తూ ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసిన యాప్స్ మాత్రమే కాదు... థర్డ్ పార్టీ సర్వీసెస్‌ను కూడా స్కాన్ చేస్తుంది.

    WhatsApp New Features: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఈ 5 కొత్త ఫీచర్స్ వస్తున్నాయి

    Android New Features: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? ఈ 7 కొత్త ఫీచర్స్ మీకోసమే

    గూగుల్ ప్లే ప్రొటెక్ట్ మాత్రమే కాదు... స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా డిఫాల్ట్‌గా యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్లను అందిస్తూ ఉంటాయి. కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ప్రీలోడెడ్ యాప్స్‌లో యాంటీవైరస్ యాప్ కూడా ఉంటుంది. మరి ప్రత్యేకంగా యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయడం అవసరమా? అన్న ప్రశ్న తలెత్తడం ఖాయం. గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు డిఫాల్ట్‌గా యాంటీవైరస్ యాప్స్ ఇస్తాయి కాబట్టి ప్రత్యేకంగా యాంటీవైరస్ యాప్ అవసరం లేదన్నది చాలామంది వాదన. అయితే స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీ గురించి ఎక్కువగా ఆలోచించేవాళ్లు మాత్రం యాంటీవైరస్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు.

    Top 10 Apps: ఈ ఏడాది యూజర్లు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన 10 యాప్స్ ఇవే

    UMANG App: ఉమాంగ్ యాప్‌లో పీఎఫ్ డబ్బులు డ్రా చేయండి ఇలా

    స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న యాంటీవైరస్ యాప్ కాకుండా మీరు ఇతర యాంటీవైరస్ యాప్ డౌన్‌లోడ్ చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో స్పేస్ నిండిపోతుంది. బ్యాటరీ కూడా త్వరగా ఖాళీ అవుతుంది. డిఫాల్ట్‌గా ఉన్న యాంటీవైరస యాప్స్ ఇవ్వలేని సర్వీసుల్ని ఇతర యాంటీవైరస్ యాప్స్ అందిస్తే, అవి మీకు ముఖ్యం అనుకుంటే అప్పుడే డబ్బులు చెల్లించి పెయిడ్ వర్షన్ తీసుకోండి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Cyber Attack, Cyber criminals, CYBER FRAUD, Cyber security, Mobile, Mobile News, Mobiles, Smartphone, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు