Home /News /technology /

ARE YOU USING REALME MOBILE THEN TRY THIS NEW UPDATE EVK

Realme Phone: మీది రియ‌ల్‌మి ఫోనా.. అయితే ఇలా చేయండి

రియల్‌మీ సీ21వై (ఫొటో క్రెడిట్ రియల్‌మీ మొబైల్స్)

రియల్‌మీ సీ21వై (ఫొటో క్రెడిట్ రియల్‌మీ మొబైల్స్)

రియ‌ల్‌మి ఇటీవల విడుద‌ల చేసిన ఫోన్‌లో కొత్తగా వ‌ర్చువ‌ల్‌ RAM/ ఎక్సెటెండెడ్ RAM టెక్నాల‌జీని ప్ర‌వేశ‌పెట్టింది. అదే వ‌ర్చువ‌ల్‌ RAM/ ఎక్సెటెండెడ్ RAM టెక్నాల‌జీని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ టెక్నాల‌జీ(Technology) ప్ర‌త్యేక‌త ఎంటంటే ఫోన్‌లో కొంత మెమెరీని కొంత భాగం RAM వినియోగించుకొంటుంది.

ఇంకా చదవండి ...
    మార్కెట్‌లోకి అధునాతన ఫీచ‌ర్‌లను ప్ర‌వేశ పెడుతూ ప్ర‌ముఖ మొబైల్ కంపెనీ రియ‌ల్‌మి(Realme) వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకొంటుంది. అందులో భాగంగా ఇటీవ‌ల రియ‌ల్‌మి విడుద‌ల చేసిన ఫోన్‌లో కొత్తగా వ‌ర్చువ‌ల్‌ RAM/ ఎక్సెటెండెడ్ RAM టెక్నాల‌జీని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ టెక్నాల‌జీ(Technology) ప్ర‌త్యేక‌త ఎంటంటే ఫోన్‌లో కొంత మెమెరీని కొంత భాగం RAM వినియోగించుకొంటుంది. ఇది ఎంతో ఉప‌యుక‌త్త‌మైన సాంకేతిక‌త‌. ఇది ఎలా ప‌ని చేస్తుందంటే ఫోన్‌లో 6జీబీ RAM ఉంటే.. ఫోన్ మెమొరీ(Memory) నుంచి 3జీబీ స్టోరేజీని ఉప‌యోగించుకొని 9జీబీ సామ‌ర్థ్యంతో ప‌ని చేస్తుంది. దీని వ‌ల్ల ఫోన్ RAMపై త‌క్కువ ఒత్తిడి ప‌డుతుంది. అంతే కాకుండా ఫోన్ చాలా వేగంగా ప‌ని చేస్తుంది. ఫోన్‌లో వినియోగించే యాప్‌(apps)లు త్వ‌ర‌గా లోడ్ అవుతాయని రియ‌ల్‌మి తెలిపింది.

    Whatsapp Features: వాయిస్ మెసేజ్ పంపే ముందు వినొచ్చు.. వాట్స‌ప్ కొత్త ఫీచ‌ర్‌


    ఇటీవ‌ల విడుద‌ల చేసిన రియ‌ల్‌మి నార్జో సిరీస్ మోడ‌ల్స్‌లో ఈ కొత్త టెక్నాలజీని వినియోగ‌దారుల‌కు ప‌రిచ‌యం చేసింది. త్వ‌ర‌లోనే రియ‌ల్‌మి ప్యాడ్ పేరుతో ట్యాబ్ రానుంది. ఇందులో 10.4 అంగుళాల డిస్‌ప్లే అందిస్తున్నారు. 6జీబీ RAM/64 జీబీ స్టోరేజీ(storage) సామ‌ర్థ్యం అందిస్తోంది. 7,100mHA బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో ప‌ని చేయ‌నుంది. దీని ధ‌ర రూ.20వేలు ఉండ‌వ‌చ్చ‌ని అంచనా.
    కొత్త‌గా రియ‌ల్‌మి పాత ఫోన్ల‌ను అప్‌డేట్(Update) చేయ‌డం ద్వారా టెక్నాల‌జీని వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నార‌ట‌. రియ‌ల్‌మి ఎక్స్ సిరీస్, 8 సిరీస్, 7 సిరీస్‌, 6 సిరీస్‌, నార్జో సిరీస్‌, క్యూ 3 సిరీస్‌, క్యూ 2సిరీస్‌, వీ3 సిరీస్‌, వీ15, జీటీ సిరీస్ మోడ‌ల్స్‌లో వ‌ర్చువ‌ల్ RAM టెక్నాల‌జీ అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Realme

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు