స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్. 2021 లో కొన్ని స్మార్ట్ఫోన్లలో వాట్సప్ పనిచేయదు. ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఐఓఎస్ స్మార్ట్ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రతీ ఏడాది కొన్ని స్మార్ట్ఫోన్లలో వాట్సప్‌ను నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ఐఓఎస్ 8 కన్నా పాత ఫోన్లు, ఆండ్రాయిడ్ 2.3.7 వర్షన్ కన్నా పాత మోడళ్లలో యాప్ పనిచేయదని ప్రకటించింది వాట్సప్. ఇప్పుడు 2020 ముగిసి 2021 వస్తుండటంతో ఇంకొన్ని ఫోన్లలో సేవల్ని నిలిపివేస్తోంది వాట్సప్. ఐఓఎస్ 9, ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ఫోన్లలో 2021 జనవరి 1 నుంచి వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సప్‌కు సంబంధించిన అన్ని ఫీచర్స్ ఉపయోగించేందుకు యూజర్లు లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించాలని వాట్సప్ సూచిస్తోంది. అంటే మీరు వాట్సప్ యాప్ ఉపయోగించాలంటే ఐఓఎస్ 9, ఆండ్రాయిడ్ 4.0.3 నుంచి లేటెస్ట్ వర్షన్స్ వరకు ఉన్న స్మార్ట్ఫోన్లు మాత్రమే వాడాలి. అంతకన్నా పాత వర్షన్స్ వాడితే వాట్సప్ యాప్ పనిచేయదు.
ఇప్పటికీ ఈ పాత ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్న యూజర్లు ఉన్నట్టు వాట్సప్ గుర్తించింది. ఐఫోన్లలో ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 5, ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ లాంటి స్మార్ట్ఫోన్లలో ఐఓఎస్ 9 ఉంది. ఇక హెచ్‌టీసీ డిజైర్, ఎల్జీ ఆప్టిమస్ బ్లాక్, మోటోరోలా డ్రాయిడ్ రేజర్, సాంసంగ్ గెలాక్సీ ఎస్2 లాంటి స్మార్ట్ఫోన్లలో 4.0.3 కన్నా పాత ఓఎస్ ఉంది. మీరు ఈ ఫోన్లు ఉపయోగిస్తున్నట్టైతే వచ్చే ఏడాది వాట్సప్ ఉపయోగించలేరు.
మీ దగ్గర ఐఓఎస్ 9, ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌తో స్మార్ట్ఫోన్లు ఉంటే మొదట డివైజ్‌ను అప్డేట్ చేయాలి. ఐఫోన్ యూజర్లు సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి. ఆండ్రాయిడ్ యూజర్లు సెట్టింగ్స్‌లో ఎబౌట్ పైన క్లిక్ చేసి ఫోన్ అప్డేట్ చేయాలి. స్మార్ట్‌ఫోన్ అప్డేట్ చేస్తే లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతుంది. ఆ తర్వాత యాప్ స్టోర్‌లో వాట్సప్ యాప్‌ని అప్డేట్ చేయాలి. మీ స్మార్ట్ఫోన్లలో లేటెస్ట్ ఓఎస్ అప్డేట్ అయితే మీరు ఏ ఇబ్బంది లేకుండా వాట్సప్ యాప్ వాడుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.