Mindfulness Apps: ఈ యాప్స్‌తో ఒత్తిడి తగ్గుతుందా? ఎవరైనా ఉపయోగించవచ్చా?

Mindfulness Apps: ఈ యాప్స్‌తో ఒత్తిడి తగ్గుతుందా? ఎవరైనా ఉపయోగించవచ్చా? (ప్రతీకాత్మక చిత్రం)

Mindfulness Apps | మీరు ధ్యానం చేసేందుకు యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? మెడిటేషన్ యాప్స్ ఉపయోగిస్తున్నారా? ఇలాంటి మైండ్‌ఫుల్ యాప్స్‌తో లాభమా, నష్టమా తెలుసుకోండి.

  • Share this:
మెదడు ఏకాగ్రతను పెంచే యాప్స్ (Mindfulness apps) గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటి నుంచో వాడుతున్నప్పటికీ.. కరోనా మహమ్మారి సమయంలో ఈ యాప్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తీవ్ర ఒత్తిడి, ఆందోళనలో ఉన్నవారు, ఇంటి నుంచి పని చేసే వారు నిద్రించే ముందు కొన్ని నిమిషాల పాటు ఈ యాప్స్ వినియోగించి ఉపశమనం పొందుతున్నారు. అయితే ఈ యాప్స్ వినియోగించడం వల్ల నిజంగా ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుందా? మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందా? అనే విషయాలపై ఇప్పుడు తెలుసుకుందాం.

మైండ్‌ఫుల్‌నెస్‌ యాప్స్ ప్రభావాన్ని విశ్లేషించి, అధ్యయనం చేశారు పరిశోధకులు. 2019లో జేఎంఐఆర్ ఎంహెల్త్ యూహెల్త్ అనే పేరుతో దీన్ని ప్రచురించారు. ఒత్తిడికి గురైన కళాశాల విద్యార్థులపై 'Calm on Stressed' అనే యాప్ సామర్థ్యాన్ని నిపుణులు పరిశోధించారు. ఒత్తిడిని తగ్గించడం, మెదడు పనితీరు మెరుగుపరచడం లాంటి విషయాల్లో ఈ యాప్స్ సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయని వారు కనుగొన్నారు. స్మార్ట్ ఫోన్‌లో ఉండే ఈ యాప్స్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల వ్యక్తుల హాజరుకు అవసరమయ్యే ప్రోగ్రామ్స్ మాదిరిగా పనిచేశాయని తెలిపారు. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం హెడ్ స్పేస్ అనే మరో ప్రముఖ యాప్‌పై ప్రయోగాత్మకంగా అధ్యయనం చేయగా.. డిప్రెషన్ స్థాయి తగ్గిందని, ఈ యాప్‌ను ఉపయోగించిన తర్వాత సానుకూల ఫలితాలు వచ్చాయని పేర్కొంది.

Realme Narzo 30 4G: కాసేపట్లో రియల్‌మీ నార్జో 30 సేల్... డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

Jio New Plan: జియో నుంచి కొత్త ప్లాన్... రోజూ 3జీబీ డేటా

వీటి వినియోగం మంచిదేనా?


హెడ్ స్పేస్ రిసెర్చ్ ప్రకారం.. ఈ యాప్స్‌ను ఆరోగ్య నిపుణుల సమక్షంలో పర్యవేక్షించగా 14 శాతం బర్న్ ఔట్‌ను తగ్గించిందని పేర్కొంది. 30 రోజుల తర్వాత విద్యార్థులకు 12 శాతం ఒత్తిడి తగ్గించిందని తెలిపింది. అంతేకాకుండా ప్రతికూల భావోద్వేగాలను 28 శాతం తగ్గించినట్లు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ వీపీ లూయిస్ ట్రియోన్ తెలిపారు. స్థిరంగా 10 రోజుల పాటు ధ్యానం చేయడం వల్ల 16 శాతం సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. రోజుకు ఒక నిమిషం కంటే తక్కువ ధ్యానం చేయడం వల్ల నిద్ర, ఆలోచనల్లో మార్పు వస్తుందని ఆయన అన్నారు.

స్క్రీన్ టైమ్ దగ్గరకొస్తే సమర్థవంతమైన, మెదడుకు పనిపెంచే విషయంపై తాము దృష్టి కేంద్రీకరించామని, ఇది మనల్ని ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంచి ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని లూయిస్ అన్నారు. ధ్యానంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడు మీ ఫోన్ ను పక్కన పెట్టి.. కళ్లు మూసుకొని ఏకాగ్రత ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ యాప్స్ విషయంలోనూ ఇలాంటి లక్షణాన్నే కలిగి ఉంటారు.

Mi 11 Lite: కాసేపట్లో ఎంఐ 11 లైట్ ఫస్ట్ ఫ్లాష్ సేల్... డిస్కౌంట్ వివరాలు ఇవే

Samsung Galaxy M32: కాసేపట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సాంసంగ్ గెలాక్సీ ఎం32 సేల్

మహమ్మారి వల్ల పెరిగిన వినియోగదారులు


ఈ యాప్స్ ప్రయోజనాల వల్ల వినియోగదారుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఉదాహరణకు హెడ్ స్పేస్ యాప్‌ను కరోనా ప్రారంభం నుంచి యూజర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా భారత్‌లో గత కొన్ని నెలల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. వీటి పరిధి కూడా గణనీయంగా పెరిగింది. బహుశా ఈ యాప్స్ మెదడు పనితీరుకు ప్రాక్టీస్ మాదిరిగా పనిచేస్తుండవచ్చు. కోరుకున్న సమయంలో వీటిలోకి మీరు లాగిన్ అవ్వొచ్చు. 5 లేదా 10 నిమిషాల పాటు సమయాన్ని ఎంచుకోవచ్చు. మెడిటేటివ్ ప్రాసెస్ కోసం అంతర్గతంగా రికార్డు చేసిన వాయిస్ కూడా వీటిలో ఉంటుంది.

నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల నుంచి ధ్యానాన్ని నేర్చుకోవడం ఉత్తమమైన మార్గాల్లో ఒకటి. కానీ కఠిన షెడ్యూల్ టైమింగ్స్ వల్ల ఇలా కుదరడం లేదు. అలాంటి వారి కోసం వారంలో నిర్ణీత సమయాన్ని కేటాయించడం కూడా కష్టం. "రోజువారీ జీవితంలో ధ్యాన సాధాన, మైండ్ ఫుల్‌నెస్ ప్రాక్టీస్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వంట సమయం, సాయంత్రం వేళలో నడక, సమావేశాల మధ్య పది నిమిషాల విరామం తీసుకొని మెడిటేషన్ చేయడం లాంటి కొన్ని మనకు రోజువారీ కనిపించే అవకాశాలు" అని రీచ్ సేల్స్ లీడర్ సమీర్ సిన్హా తెలిపారు.

Jio Recharge via WhatsApp: జియో సిమ్ రీఛార్జ్ చేయాలా? వాట్సప్‌లో చేయండిలా

Vivo V21e 5G: వివో వీ21ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్

ప్రతి ఒక్కరికీ ఉపకరిస్తాయా?


ఈ యాప్స్ వర్క్ అయ్యే విషయంలో వినియోగదారుడు నిరంతరం ఎలా కొనసాగించగలడు, నిజ జీవితంలో వాస్తవంగా వర్తింపజేయగలడానే అనే విషయాలపై ఆధారపడి ఉంటుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంతమంది విషయంలో ఇవి పనిచేస్తాయని, అయితే ఇవే పరిష్కారం కాదని చెప్పారు. యాప్ ఉపయోగించి ధ్యానం చేయాలని భావించేవారు.. ఫీచర్లు, అనుకూలతను పరీక్షించడానికి ట్రయల్ ప్రాతిపాదికన వీటిని ఉపయోగించాలని యోగా నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అయితే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల లోటును ఎవరూ పూడ్చలేరని, కచ్చితంగా దైనందిన జీవితంలో ధ్యానాన్ని ఏ విధంగానైనా చేర్చాలని మరికొందరు అంటున్నారు.

తీవ్రమైన మానసిక రోగులకు పరిష్కారం కాదు


మానసిక అనారోగ్యం తీవ్రంగా ఉన్నవారికి ఈ యాప్స్ వల్ల సమస్య పరిష్కారం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న వైద్య మౌలిక సదుపాయాలపై కాకుండా, టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఇలాంటి యాప్స్‌పై ఆధార పడితే.. ఎంత మేరకు లబ్ధి పొందుతారనేది గుర్తించడం కష్టమే అంటున్నారు. అందువల్ల రోగులు మానసిక ఆరోగ్య నిపుణుల అభిప్రాయంపై ఆధారపడాలని, తీవ్రమైన బాధ, మానసిక వైకాల్యాలున్నవారిపై ఈ యాప్స్ ఆశించిన విధంగా పనిచేయడంపై సందేహాలున్నాయని పలువురు భావిస్తున్నారు. ఇలాంటి అనారోగ్యాలకు మందులు వాడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే.. వైద్యపరంమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ మైండ్‌ఫుల్‌నెస్‌ యాప్‌లు పరిష్కారం చూపించలేవని తెలుస్తోంది.
Published by:Santhosh Kumar S
First published: