Home /News /technology /

ARE YOU USING LESS DATA AND DOING MORE CALLS KNOW ABOUT SPECIAL PREPAID RECHARGE PLANS FROM RELIANCE JIO AIRTEL AND VODAFONE IDEA SS

Prepaid Plans: డేటా అవసరం లేదా? కాల్స్ మాత్రమే చేస్తారా? Jio, Airtel, Vi ప్లాన్స్ ఇవే

Prepaid Plans: డేటా అవసరం లేదా? కాల్స్ మాత్రమే చేస్తారా? Jio, Airtel, Vi ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Prepaid Plans: డేటా అవసరం లేదా? కాల్స్ మాత్రమే చేస్తారా? Jio, Airtel, Vi ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Prepaid Plans | మీరు కాల్స్ ఎక్కువగా చేస్తుంటారా? మొబైల్ డేటా తక్కువగా ఉపయోగిస్తుంటారా? రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) అందిస్తున్న ప్రత్యేక ప్లాన్స్ గురించి తెలుసుకోండి.

    రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) కంపెనీలు దాదాపు అన్ని ప్లాన్స్‌పై డేటా బెనిఫిట్స్ అందిస్తున్నాయి. అయితే యూజర్లు అందరూ డేటా ఉపయోగించరు. వారికి వాయిస్ కాల్స్ ఉంటే చాలు. డేటా చాలా తక్కువగా ఉపయోగిస్తారు. ఇంట్లో వైఫై కనెక్షన్ ఉన్నవాళ్లు మొబైల్ డేటా ఎక్కువగా ఉపయోగించరు. వైఫై వాడుకుంటూ ఉంటారు. డేటా తక్కువ, వాయిస్ కాల్స్ ఎక్కువవాడేవారి కోసం ప్రత్యేకమైన ప్లాన్స్ అందిస్తున్నాయి ఈ కంపెనీలు. మరి మీరు కూడా డేటా తక్కువగా ఉపయోగిస్తుంటారా? వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉంటే చాలా? అయితే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్లు ఏ ప్లాన్స్ రీఛార్జ్ చేయాలి? వాటిపై వచ్చే బెనిఫిట్స్ ఏవి? తెలుసుకోండి.

    Jio Rs 91 Plan: జియో రూ.91 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 28 రోజులకు మొత్తం 3జీబీ డేటా వాడుకోవచ్చు. 50 ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చు. గతంలో రూ.75 గా ఉన్న ఈ ప్లాన్‌ను రూ.91 ధరకు పెంచింది జియో.

    Jio Rs 395 Plan: జియో రూ.395 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 84 రోజులకు మొత్తం 6జీబీ డేటా వాడుకోవచ్చు. 1000ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చు. గతంలో రూ.329 గా ఉన్న ఈ ప్లాన్‌ను రూ.395 ధరకు పెంచింది జియో.

    Infinix Note 11: ఇన్ఫీనిక్స్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే

    Jio Rs 1559 Plan: జియో రూ.1559 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 336 రోజులకు మొత్తం 24జీబీ డేటా వాడుకోవచ్చు. 3600 ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చు. గతంలో రూ.1299 గా ఉన్న ఈ ప్లాన్‌ను రూ.1559 ధరకు పెంచింది జియో.

    Airtel Rs 99 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.99 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 200ఎంబీ డేటా వాడుకోవచ్చు. వాయిస్ టారిఫ్ సెకన్‌కు ఒక పైసా చొప్పున చెల్లించాలి. గతంలో రూ.79 గా ఉన్న ఈ ప్లాన్‌ను రూ.99 కి పెంచింది ఎయిర్‌టెల్.

    Airtel Rs 179 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.179 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 28 రోజులకు 2జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. గతంలో రూ.149 గా ఉన్న ఈ ప్లాన్‌ను రూ.179 కి పెంచింది ఎయిర్‌టెల్.

    Airtel Rs 455 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.455 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 84 రోజులకు 6జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. గతంలో రూ.379 గా ఉన్న ఈ ప్లాన్‌ను రూ.455 కి పెంచింది ఎయిర్‌టెల్.

    Airtel Rs 1799 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.1799 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 365 రోజులకు 24జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. గతంలో రూ.1498 గా ఉన్న ఈ ప్లాన్‌ను రూ.1799 కి పెంచింది ఎయిర్‌టెల్.

    Realme X7 Max 5G: రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.7,000 లోపే కొనండి ఇలా

    Vi Rs 99 Plan: వొడాఫోన్ ఐడియా రూ.99 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రూ.99 టాక్‌టైమ్ వస్తుంది. సెకన్‌కు ఒక పైసా చొప్పున టారిఫ్ వర్తిస్తుంది. 200 ఎంబీ డేటా లభిస్తుంది. గతంలో రూ.79 గా ఉన్న ప్లాన్‌ను రూ.99 కి పెంచింది వొడాఫోన్ ఐడియా.

    Vi Rs 179 Plan: వొడాఫోన్ ఐడియా రూ.179 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 300ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. 2జీబీ డేటా లభిస్తుంది. గతంలో రూ.149 గా ఉన్న ప్లాన్‌ను రూ.179 కి పెంచింది వొడాఫోన్ ఐడియా.

    Vi Rs 459 Plan: వొడాఫోన్ ఐడియా రూ.459 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 1000 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. 6జీబీ డేటా లభిస్తుంది. గతంలో రూ.379 గా ఉన్న ప్లాన్‌ను రూ.459 కి పెంచింది వొడాఫోన్ ఐడియా.

    Vi Rs 1799 Plan: వొడాఫోన్ ఐడియా రూ.1799 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 3600 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. 24జీబీ డేటా లభిస్తుంది. గతంలో రూ.1499 గా ఉన్న ప్లాన్‌ను రూ.1799 కి పెంచింది వొడాఫోన్ ఐడియా.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: AIRTEL, Airtel recharge plans, Jio, Reliance Jio, Vodafone Idea

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు