ARE YOU USING IRCTC THEN KNOW CANCELLATION PROCESS AND PASSWORD RECOVERY DETAILS EVK
IRCTC : మీరు ఐఆర్సీటీసీ వాడుతున్నారా.. అయితే మీ కోసం ఈ టిప్స్
(ప్రతీకాత్మక చిత్రం)
IRCTC : మనలో చాలా మంది ఐఆర్సీటీసీ సేవలు వినియోగించుకొంటున్నారు. పండుగ సమయాలలోరైల్వేలో ప్రయాణించాలంటే బుకింగ్ తప్పనిసరి.. అందుకోసం మనలో చాలా మంది ఐఆర్సీటీసీ ఎకౌంట్‌ను వాడుతుంటారు. ఈ ఐఆర్సీటీసీ ఎకౌంట్ పాస్వర్డ్ (Password) మర్చిపోయినా.. టకెట్ బుకింగ్ క్యాన్సల్ (Booking Cancel) చేయాలంటే ఎలా విషయాలుతెలుసుకోండి.
కరోనా (Corona) ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. ప్రజలు మళ్లీ సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. మనలో ఎక్కువమంది రైల్వే (Railway) లో ప్రయాణిస్తుంటారు. వారి సౌలభ్యం కోసం రైల్వే శాఖ ఐఆర్సీటీసీ (IRCTC) ని ప్రవేశపెట్టింది. చాలా మంది ఇప్పటికే ఈ సేవలు వినియోగించుకొంటున్నారు. పండుగ సమయాలలోరైల్వేలో ప్రయాణించాలంటే బుకింగ్ తప్పనిసరి.. అందుకోసం మనలో చాలా మంది ఐఆర్సీటీసీ ఎకౌంట్‌ను వాడుతుంటారు. ఈ ఐఆర్సీటీసీ ఎకౌంట్ పాస్వర్డ్ (Password) మర్చిపోయినా.. టకెట్ బుకింగ్ క్యాన్సల్ (Booking Cancel) చేసుకోవాలనుకొన్నా కొన్ని టిప్స్ ఫాలో అయితే సులభంగా ఉంటుంది. ఐఆర్సీటీసీ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోతే తిరిగి ఎలా పొందాలో.. టికెట్ క్యాన్సిల్ (Train Ticket Cancellation) చేస్తే.. రీఫండ్ రూల్స్ గురించి వివరాలు తెలుసుకోండి.
రిజర్వేషన్ క్యాన్సలేషన్ సమాచారం..
మనలో చాలా మంది పలు కారణాలతో రైల్ టికెట్ క్యాన్సిల్ చేస్తుంటారు. అయితే రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే క్యాన్సలేషన్ ఛార్జీలు (Train Ticket Cancellation Charges) ఉంటాయన్న సంగతి తెలిసిందే.
ఈ క్యాన్సలేషన్ ఛార్జీల గురించి అవగాహన లేక ప్రయాణికులు భారీగా నష్టపోతుంటారు. ట్రైన్ టికెట్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎంత ఛార్జీ చెల్లించాలో అవగాహన ఉండదు. భారతీయ రైల్వే (Indian Railways), ఐఆర్సీటీసీ (IRCTC) క్యాన్సలేషన్ పాలసీ, రీఫండ్ ప్రాసెస్ లాంటి వివరాలను తమ వెబ్‌సైట్స్‌లో వెల్లడించాయి. ఐఆర్సీటీసీ టికెట్ క్యాన్సలేషన్, రీఫండ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
- రైలు బయల్దేరడానికి రైలు బయల్దేరడానికి 12 గంటల నుంచి 48 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేస్తే టికెట్ ధరలో 25 శాతం లేదా రూ.60 వీటిలో ఏది ఎక్కువ అయితే అది ఛార్జీగా చెల్లించాలి.
- రైలు బయల్దేరడానికి 12 గంటల నుంచి 4 గంటల మధ్య లేదా ఛార్ట్ ప్రిపేర్ చేసే సమయం లోపల టికెట్ క్యాన్సిల్ చేస్తే టికెట్ ధరలో 50 శాతం ఛార్జీలు చెల్లించాలి.
- రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే క్యాన్సలేషన్ ఛార్జీలు వేర్వేరుగా ఉన్నాయి.
- సెకండ్ క్లాస్ టికెట్‌కు రూ.60, సెకండ్ స్లీపర్ క్లాస్‌కు రూ.120, ఏసీ త్రీ టైర్ టికెట్‌కు రూ.180, టూ టైర్ టికెట్‌కు రూ.200, ఫస్ట్ ఏసీ ఎగ్జిక్యూటీవ్ క్లాస్ టికెట్‌కు రూ.240 క్యాన్సలేషన్ ఛార్జీగా చెల్లించాలి.
- తత్కాల్ కేటగిరీలో బుక్ చేసిన కన్ఫామ్డ్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ రాదు.
- మరి రైళ్లు రద్దైతే ఈ ఛార్జీలు వర్తిస్తాయా అన్న అనుమానాలు ప్రయాణికుల్లో ఉండటం సహజం.
- వరదలు, ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు లాంటి కారణాలతో రైళ్లు రద్దవుతుంటాయి. రైళ్లు రద్దైతే ఆ రైళ్లల్లో అప్పటికే టికెట్లు బుక్ చేసి ప్రయాణికులకు ఫుల్ రీఫండ్ వస్తుంది. ఈ రీఫండ్ మూడు రోజుల్లో క్రెడిట్ అవుతుంది.
పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలి..
మనం రోజు ఎన్నో పనులకు ఎన్నో పాస్‌వర్డులను వాడుతుంటాం. అయితే ఐఆర్సీటీసీ పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలో తెలుసుకోండి.
- ముందుగా మీరు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- అక్కడ 'Forgot Password' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్, ఐఆర్సీటీసీ యూజర్ ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ నమోదు చేయండి.
- ఆ తర్వాత ఐఆర్సీటీసీ రిజిస్టర్డ్ ఈమెయిల్ చిరునామాకు ఒక మెయిల్ వస్తుంది.
- మెయిల్‌కు వచ్చిన సమచారాంతో మీరు తిరిగా పాస్వర్డ్ పొందవచ్చు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.