మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మెసేజెస్ యాప్ (Google Messages app) డిఫాల్ట్‌గా వచ్చిందా? మీరు గూగుల్ మెసేజెస్ యాప్ వాడుతున్నారా? అయితే పదేపదే యాడ్స్ కనిపించడం మామూలే. సాధారణంగా చాలావరకు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో గూగుల్ మెసేజెస్ యాప్ ప్రీలోడెడ్‌గా వస్తుంది. యాపిల్ ఐమెసేజ్ ఫీచర్స్‌కు పోటీ ఇచ్చేందుకు గూగుల్ రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS) మెసేజింగ్ సర్వీస్ ఉపయోగిస్తోంది. కానీ ఇండియా విషయానికి వచ్చేసరికి భారతీయ మార్కెట్లో గూగుల్ మెసేజెస్ యాప్ పనితీరుపై విమర్శలు వస్తాయి. వెరిఫై చేసిన వ్యాపార ఖాతాల నుంచి యూజర్లకు స్పామ్ సందేశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. ఈ ప్రకటనల్లో ఎక్కువగా బ్యాంకులు లేదా ఫైనాన్సింగ్ సంస్థల నుంచి ప్రీ-అప్రూవ్డ్ లోన్స్‌కు సంబంధించినవే ఉంటున్నాయి.
రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS) మెసేజింగ్ సర్వీస్ ద్వారా యూజర్లు ఎమోజీస్, పిక్చర్స్, మల్టీమీడియా ఫైల్స్ కలిసి ఎస్ఎంఎస్ను ఆకట్టుకునేలా పంపడానికి వీలుంటుంది. కానీ ఇందులో యాడ్స్ ఎక్కువగా కనిపిస్తుండటంతో యూజర్లకు చికాకు తప్పట్లేదు. సాధారణంగా ఇలాంటి ప్రకటనలతో ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ అందులో ఉండే లిక్స్ క్లిక్ చేసే అవకాశాలే ఎక్కువ.
iQoo Gen Z Sale: ఐకూ స్మార్ట్ఫోన్లపై రూ.8,000 వరకు డిస్కౌంట్... ఆఫర్ ఒక్క రోజు మాత్రమే
స్మార్ట్‌ఫోన్‌లో సిమ్ మార్చినప్పుడు, కొత్త మొబైల్ సెట్ చేసినప్పుడు ప్రకటనలు వస్తున్నాయి. ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి, ధృవీకరించడానికి News18 స్వయంగా మెసేజెస్ యాప్ పనితీరును పరిశీలించింది. కొటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి సంస్థలకు చెందిన యాడ్స్ కనిపిస్తున్నాయి. ఆ యాడ్స్ ఇక్కడ చూడొచ్చు.
అయితే మోసగాళ్లు ఈ లొసుగును గుర్తిస్తే మాల్వేర్తో ఎటాక్ చేసే అవకాశం ఉంది. అందుకే గూగుల్ మెసేజెస్ యాప్‌లో యాడ్స్ రాకుండా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ మార్చడం అవసరం. సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి.
Motorola Edge 30: మోటోరోలా ఎడ్జ్ 30 సేల్ ఈరోజే... తొలి సేల్‌లో భారీ డిస్కౌంట్
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మెసేజెస్ యాప్ ఓపెన్ చేయండి.
ఆ తర్వాత అకౌంట్ బబుల్ పైన క్లిక్ చేయండి.
మెసేజ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి.
ఆ తర్వాత ఛాట్ ఫీచర్స్ పైన క్లిక్ చేయండి.
ఛాట్ ఫీచర్స్ ఆప్షన్ డిసేబుల్ చేస్తే వైఫై లేదా మొబైల్ డేటా ద్వారా యాడ్స్ రావు.
గూగుల్ మెసేజెస్ యాప్ ద్వారా ఎస్ఎంఎస్, ఎంఎంఎస్తో పాటు ఆర్సీఎస్ ద్వారా సందేశాలు పంపొచ్చు. డెస్క్‌టాప్ వర్షన్ కూడా ఉంది. వాట్సప్ వెబ్ లాగిన్ అయినట్టే మెసేజెస్ ఫర్ వెబ్ ప్లాట్ఫామ్లో లాగిన్ కావొచ్చు. ఆండ్రాయిడ్ 5.0 కన్నా పైన ఉన్న అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Mobile App, Playstore