Gmail: జీమెయిల్ ను ఫ్రీగా వాడుతున్నారా? గూగుల్ మీ ఫొటోలు, వీడియోలు, ఆడియోతోపాటు వీటన్నింటినీ..

ప్రతీకాత్మక చిత్రం

Gmail తన iOS యాప్​ను అప్‌డేట్ చేసింది. ఈ అప్​డేట్​లో ప్రైవసీ లేబుల్​ను కూడా జతచేసింది. ఉచితంగా జీమెయిల్​ సేవను ఉపయోగించుకునే వినియోగదారుల నుంచి తమ కంపెనీ ఎటువంటి డేటాను సేకరిస్తుందో ఈ ప్రైవసీ లేబుల్​లో వెల్లడించింది..

  • Share this:
వాట్సాప్​ ప్రవేశపెట్టిన నూతన ప్రైవసీ పాలసీతో యూజర్​ డేటాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్​ తన యూజర్ల డేటా భద్రత కొరకు చర్యలు చేపట్టింది. యాపిల్​ స్టోర్​లోని అన్ని యాప్స్​ ప్రైవసీ లేబుల్‌లను పొందుపర్చాల్సిందేనని ప్రకటించింది. దీన్ని 2020 డిసెంబర్ 8 నుండి తప్పనిసరి చేస్తూ  అన్ని iOS యాప్స్​కు సమాచారం ఇచ్చింది. తద్వారా,​ ఆయా యాప్స్​ ప్రైవసీ లేబుల్​ను ప్రకటించే పనిలో పడ్డాయి. యాపిల్​ నిర్ణయానికి అనుగుణంగా, గూగుల్ సారధ్యంలోని Gmail కూడా తన iOS యాప్​ను అప్‌డేట్ చేసింది. ఈ అప్​డేట్​లో ప్రైవసీ లేబుల్​ను కూడా జతచేసింది. ఉచితంగా జీమెయిల్​ సేవను ఉపయోగించుకునే వినియోగదారుల నుంచి తమ కంపెనీ ఎటువంటి డేటాను సేకరిస్తుందో ఈ ప్రైవసీ లేబుల్​లో వెల్లడించింది.

జీమెయిల్​తో పాటు, గూగుల్​ తన YouTube iOS యాప్​ను కూడా అప్​డేట్​ చేసింది. అయితే, గూగుల్ ఫోటోస్​, గూగుల్​ డ్రైవ్, గూగుల్ మ్యాప్స్ వంటి ప్రధాన యాప్స్​లను మాత్రం ఇంకా అప్​డేట్​ చేయలేదు. వీటి ప్రైవసీ లేబుల్​ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా, మీ ఐఫోన్‌లోని Gmail యాప్​ అప్​డేట్​ చేయడం ద్వారా ప్రైవసీ​ లేబుల్​ మీకు ప్రత్యక్షమవుతుంది. గూగుల్ మీ నుంచి ఎటువంటి వ్యక్తిగత డేటాను సేకరిస్తుందనే వివరాలను దానిలో పొందుపర్చింది. ఆండ్రాయిడ్​ వినియోగదారుల విషయంలో కూడా ఇటువంటి సమాచారాన్నే​ సేకరిస్తుంది. అయితే, ఇలా సేకరించిన మీ వ్యక్తిగత డేటాను గూగుల్ థర్డ్​ పార్టీలకు చేరవేస్తుంది. మీ వ్యక్తిగత అభిరుచులు, ఇష్టాలను అనలిటిక్స్​ ద్వారా పసిగట్టి ఆయా కంపెనీలు వారి సేల్స్​ పెంచుకోవడానికి మీ ఈమెయిల్​కు ప్రకటనలు పంపిస్తుంటాయి.
ఇది కూడా చదవండి: 500 సార్లు వీర్యదానం చేసిన తండ్రి.. అమ్మాయిల జోలికి వెళ్లేందుకే భయపడిపోతున్న కొడుకు.. అసలు కథేంటంటే..

గూగుల్​​ సేకరించే వ్యక్తిగత డేటా..గూగుల్​ మీ నుండి ఆన్​లైన్​ కొనుగోళ్ల​ హిస్టరీ, మీ లొకేషన్​, ఈ–మెయిల్ అడ్రస్​, ఫోటోలు లేదా వీడియోలు, ఆడియో డేటా, ఇతర కంటెంట్, బ్రౌజింగ్​ హిస్టరీ, యూజర్​ ఐడీ, డివైజ్​ ఐడీ, యూజర్​ డేటా, అడ్వర్​టైజింగ్​ డేటా, క్రాష్ డేటా, పర్ఫార్మెన్స్​ డేటా వంటి వ్యక్తిగత డేటాను సేకరిస్తుంది. అయితే, ఈ డేటా​ కేవలం ఉచిత జీమెయిల్​ యూజర్ల నుంచి మాత్రమే సేకరిస్తుంది. బిజినెస్ అకౌంట్ల నుంచి ఎటువంటి డేటాను సేకరించదు. ఎందుకంటే బిజినెస్​ అకౌంట్స్​ నిర్ణీత రుసుము చెల్లించి గూగుల్ వర్క్​స్పేస్​ను కొనుగోలు చేస్తారు, అందువల్ల, వారి కంపెనీకి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ గూగుల్​ పంచుకోదు. ​ ​
ఇది కూడా చదవండి: వేగంగా వెళ్తున్న కారు అద్దంపై పాము ప్రత్యక్షం.. వైపర్ తో తొలగించేందుకు ప్రయత్నం.. చివరకు..

ఏ డేటాను సేకరిస్తుందో ఇలా చెక్​ చేయండి..ఏ iOS యాప్​ మీ నుండి ఎలాంటి డేటాను సేకరిస్తుందో తెలుసుకోవడం ఇక నుంచి చాలా సులభం. దీని కోసం ముందుగా మీ ఐఫోన్​లో యాపిల్​ స్టోర్​ను సందర్శించండి. అక్కడ, మీకు అవసరమైన యాప్​ను శోధించండి. ఆ యాప్​ ప్రైవసీ నిబంధనలను తెలుసుకోవడానికి క్రిందికి స్క్రోల్ చేయండి. దీంతో అక్కడ ఆ యాప్​కు సంబంధించిన ప్రైవసీ నిబంధలు కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఐఫోన్ లేకపోతే, ఏదైనా PCలో నుండి యాప్ స్టోర్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఆ యాప్​ వెబ్​సైట్​ నుండి ప్రైవసీ వివరాలను పొందండి.
Published by:Hasaan Kandula
First published: