WhatsApp: పాత ఫోన్లల్లో వాట్సప్ బంద్... కొత్త ఫోన్ కొనాల్సిందే

WhatsApp | పాత ఫోన్లల్లో వాట్సప్ సేవలు నిలిచిపోతాయని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాదు... ఆ ఫోన్లు వాడుతున్నవాళ్లు కొత్త అకౌంట్లు క్రియేట్ చేయడం, ఉన్న అకౌంట్లను వెరిఫై చేయడం సాధ్యం కాదని కూడా తెలిపింది.

news18-telugu
Updated: June 26, 2019, 10:34 AM IST
WhatsApp: పాత ఫోన్లల్లో వాట్సప్ బంద్... కొత్త ఫోన్ కొనాల్సిందే
WhatsApp: పాత ఫోన్లల్లో వాట్సప్ బంద్... కొత్త ఫోన్ కొనాల్సిందే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 26, 2019, 10:34 AM IST
మీరు ఇంకా పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లు వాడుతున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. పాత ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఆండ్రాయిడ్ 2.3.7 వర్షన్‌ లోపు ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లు, ఐఓఎస్ 7 వర్షన్ లోపు ఉన్న ఐఫోన్లల్లో వాట్సప్ పనిచేసేది ఇంకొన్ని రోజులే. 2020 ఫిబ్రవరి 1 తర్వాత ఆ ఫోన్లల్లో వాట్సప్ సేవలు నిలిచిపోతాయని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాదు... ఆ ఫోన్లు వాడుతున్నవాళ్లు కొత్త అకౌంట్లు క్రియేట్ చేయడం, ఉన్న అకౌంట్లను వెరిఫై చేయడం సాధ్యం కాదని కూడా తెలిపింది. అంటే మరీ పాత ఫోన్లు వాడుతున్నవారికి వాట్సప్ పనిచేసేది 2020 ఫిబ్రవరి 1 వరకు మాత్రమే. ఆ తర్వాత వాట్సప్ ఉపయోగించాలంటే మాత్రం కొత్త ఫోన్ తీసుకోవాల్సిందే.

వాట్సప్ వెల్లడించిన ఆండ్రాయిడ్ 2.3.7 వర్షన్ 9 ఏళ్ల క్రితం రిలీజ్ కాగా, ఐఓఎస్ 7 వర్షన్ 6 ఏళ్ల క్రితం రిలీజైంది. ఇప్పటికీ ఆ పాత ఫోన్లు వాడుతున్నవాళ్లు ఉన్నారు. కొన్ని ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ చేసినా కొత్త వర్షన్‌లోకి మారొచ్చు. కానీ అలా అప్‌డేట్ చేయలేదని, కొత్త ఫోన్‌కు మారలేదని గుర్తించింది వాట్సప్. పాత వర్షన్లు ఉపయోగిస్తున్న కొద్ది మంది మాత్రమే కాబట్టి వాట్సప్ నిలిపివేసినా పెద్దగా ప్రభావం ఏమీ ఉండదని భావిస్తోంది వాట్సప్. ఇప్పటికే అలాంటి ఫోన్లల్లో కొత్త వాట్సప్ క్రియేట్ చేయడం, ఉన్న అకౌంట్లను రీవెరిఫై చేయడం సాధ్యం కావట్లేదు. కానీ వాట్సప్ వాడుతున్నవారికి సేవలు అందుతూనే ఉన్నాయి. 2020 ఫిబ్రవరి 1 నుంచి ఆ సేవలు నిలిచిపోతాయి.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ మాత్రమే కాదు... విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో 2019 డిసెంబర్ 31 తర్వాత వాట్సప్ సేవలు నిలిచిపోతాయని కంపెనీ ప్రకటించింది. 2019 జూలై 1 నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో కూడా వాట్సప్ యాప్ కనిపించదు. ప్రపంచంలో కేవలం 0.24 శాతం మొబైల్ ఫోన్లల్లో మాత్రమే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందని స్టాట్‌కౌంటర్ లెక్క తేల్చింది. మీరు వాట్సప్ ఏ ఇబ్బంది లేకుండా వాడుకోవాలంటే ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 8, KaiOS 2.5.1 లేదా అంతకన్నా ఎక్కువ వర్షన్ ఓఎస్ ఉన్న ఫోన్లు ఉపయోగించాలని సూచిస్తోంది కంపెనీ. వాటితో పాటు జియో ఫోన్, జియో ఫోన్ 2లో కూడా వాట్సప్ ఉపయోగించుకోవచ్చు.

Technology: మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:
Loading...
Video: టిక్ టాక్‌లో తుమ్మితే ఏం జరిగిందో చూడండి

Mi Trimmer: షావోమీ నుంచి కొత్త ప్రొడక్ట్... ట్రిమ్మర్ రిలీజ్ చేసిన కంపెనీ

WhatsApp: మీ వాట్సప్‌ని డార్క్ మోడ్‌లోకి మార్చేయండి ఇలా...

 
First published: June 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...