Home /News /technology /

ARE YOU SHARING YOUR NETFLIX PASSWORD NOW EVEN IF YOU SHARE YOU HAVE TO PAY MONEY HOW MUCH UMG GH

Netflix New Charge: నెట్‌ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేర్ చేస్తున్నారా ! ఇప్పుడు షేర్ చేసినా కూడా డబ్బులు కట్టాల్సిందే .. ఎంతంటే ?

నెట్‌ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేర్ చేస్తున్నారా ! ఇప్పుడు షేర్ చేస్తే కూడా డబ్బులు కట్టాల్సిందే .. ఎంతంటే ?

నెట్‌ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేర్ చేస్తున్నారా ! ఇప్పుడు షేర్ చేస్తే కూడా డబ్బులు కట్టాల్సిందే .. ఎంతంటే ?

నెట్‌ఫ్లిక్స్(Netflix)) కోస్టా రికా, చిలీ, పెరూలోని కొత్త వినియోగదారుల కోసం "యాడ్ ఎక్స్‌ట్రా మెంబర్ (Add Extra Member)" ఆప్షన్ లాంచ్‌ చేసింది. ఈ ఆప్షన్ వల్ల యూజర్లు తమ ఇళ్లలో నివసించేవారిని మినహాయించి ఇతరులతో పాస్‌వర్డ్‌లను షేర్ చేస్తుంటే అందుకు డబ్బులు చెల్లించాల్సిందే.

ఇంకా చదవండి ...
వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) తన రెవెన్యూ పెంచుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది. సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవడంతో పాటు వారు తమ పాస్‌వర్డ్‌లు, అకౌంట్స్‌ను మిత్రులతో షేర్ చేసుకోవడాన్ని నిలిపివేసే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం పాస్‌వర్డ్-షేరింగ్ (Password Sharing) సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు పాస్‌వర్డ్ షేరింగ్ విషయంలో కొంత ఛార్జీ విధించాలని టెస్టింగ్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా నెట్‌ఫ్లిక్స్ కోస్టా రికా, చిలీ, పెరూలోని కొత్త వినియోగదారుల కోసం "యాడ్ ఎక్స్‌ట్రా మెంబర్ (Add Extra Member)" ఆప్షన్ లాంచ్‌ చేసింది. ఈ ఆప్షన్ వల్ల యూజర్లు తమ ఇళ్లలో నివసించేవారిని మినహాయించి ఇతరులతో పాస్‌వర్డ్‌లను షేర్ చేస్తుంటే అందుకు డబ్బులు చెల్లించాల్సిందే.

లేటెస్ట్ నెట్‌ఫ్లిక్స్ టెస్టింగ్ ప్రకారం, కొన్ని దేశాల్లోని యూజర్ల తమ పాస్‌వర్డ్/అకౌంట్‌ను ఇతరులకు షేర్ చేసినందుకు గానూ కొంత మనీ చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ త్వరలో ఇతర ప్రాంతాలకు కూడా ఇదే విధమైన “యాడ్ హోమ్ (Add Home)” లేదా “యాడ్ ఎక్స్‌ట్రా మెంబర్ (add extra member)” ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం డొమినికన్ రిపబ్లిక్, గ్వాటెమాల, హోండురాస్, ఎల్ సాల్వడార్, అర్జెంటీనా వంటి దేశాల్లో "Add Home" ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ ఫీచర్‌ను ఇండియాలో ఎప్పుడు తీసుకొస్తోందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ఫీచర్‌ను త్వరలోనే తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇది గ్లోబల్ ప్లాన్‌గా కనిపిస్తోంది. 2022 చివరి నాటికి తమ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్‌వర్డ్‌లను షేర్ చేసే యూజర్లకు ఛార్జీ విధించడం స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


కొత్త యాడ్ హోమ్ అంటే ఫీచర్ ఏంటి?
ప్రస్తుతం ఈ ఫీచర్‌(Features) టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్‌ ద్వారా సబ్‌స్క్రైబర్లు ఒకే ఇంట్లో నివసిస్తున్న ఇతరులను యాడ్ చేయడానికి ఒక హోమ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ హోమ్‌లోని వ్యక్తులందరూ నెట్‌ఫ్లిక్స్‌ను ఏ డివైజ్‌లోనైనా యాక్సెస్ చేయవచ్చు. ఇంటి నుంచి బయటికి వెళ్లి ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా Netflix ని వాడుకోవచ్చు. మరొక ఇంటిలోని వ్యక్తికి మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌కు యాక్సెస్ ఇవ్వాలంటే మాత్రం కొంతమేర ఛార్జీ చెల్లించుకోవాల్సిందే. ఆ ఛార్జీ అర్జెంటీనా(Argentina)లో 219 పెసోలు (దాదాపు రూ.320), ఇతర ప్రాంతాలలో $2.99 ​​(దాదాపు రూ. 240)గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫీచర్ భారతదేశంలో అందుబాటులోకి వస్తే ఈ ఛార్జీ రూ.250-రూ.350 మధ్య ఉండొచ్చని అంచనా.



నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌కు కొత్త హోమ్స్‌ను ఎవరు ఎన్ని యాడ్ చేయగలరు?
నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌కు సబ్‌స్క్రయిబ్ చేసే యూజర్లు తమ ప్రొఫైల్‌కు ఒక అదనపు హోమ్ యాడ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్‌కు సబ్‌స్క్రయిబ్ చేసేవారు వరుసగా రెండు హోమ్‌లు, మూడు హోమ్‌లను జత చేయవచ్చు. కావాలనుకున్నప్పుడు ఈ హోమ్స్ రిమూవ్ చేయవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Netflix, OTT Streaming, Passwords, Web Series

తదుపరి వార్తలు