Smartphone Tips: మీ పాత స్మార్ట్‌ఫోన్ అమ్ముతున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

Smartphone Tips: మీ పాత స్మార్ట్‌ఫోన్ అమ్ముతున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Smartphone Tips | పాత స్మార్ట్‌ఫోన్ అమ్మేస్తున్నారా? మీ పాత మొబైల్ ఎవరికైనా ఇస్తున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి.

  • Share this:
    మార్కెట్లోకి వారానికి ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తుంది. ఈ రోజుల్లో ఏడాదికి ఓ స్మార్ట్‌ఫోన్ మార్చేవాళ్లు ఉన్నారు. ఆరు నెలలకో కొత్త స్మార్ట్‌ఫోన్ ట్రై చేయాలనుకునేవాళ్లూ ఉన్నారు. గతంలో ఓ స్మార్ట్‌ఫోన్ కొంటే కనీసం రెండేళ్లైనా వాడేవారు. కానీ ఇప్పుడు ఏడాదికి ఓ కొత్త ఫోన్ కొనాల్సిందే. మరి పాత స్మార్ట్‌ఫోన్ ఏం చేస్తారు? ఇంట్లో ఎవరికైనా అవసరం ఉంటే వారికి ఇస్తారు. లేదంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో అమ్మేస్తారు. మరి మీరు కూడా మీ పాత స్మార్ట్‌ఫోన్ అమ్మేసి కొత్త మొబైల్ తీసుకోవాలని అనుకుంటున్నారా? మీ పాత మొబైల్‌ను సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో అమ్ముతున్నారా? మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను అమ్మే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకోండి.

    మీ స్మార్ట్‌ఫోన్ అమ్ముతున్నారంటే ముందుగా రీసెట్ చేయడం మర్చిపోవద్దు. రీసెట్ చేయకుండా మీ స్మార్ట్‌ఫోన్ అమ్మితే చిక్కులు తప్పవు. రీసెట్ చేయకుండా మీ స్మార్ట్‌ఫోన్ అమ్మారంటే మీ జీవితం వారి చేతుల్లో పెట్టినట్టే. అందులో మీ పర్సనల్ ఛాట్స్, ఫోటోలు, సెల్ఫీలు, డాక్యుమెంట్ ఫైల్స్, వెబ్ బ్రౌజింగ్ హిస్టరీ... ఇలా ఆ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న వివరాలు, ఫైల్స్ అన్నీ ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతాయి. ముఖ్యమైన ఫైల్స్, ఫోటోస్ లాంటివి ఉంటే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసినా, వాటిని దుర్వినియోగం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆ ఫైల్స్ అన్నీ బ్యాకప్ పెట్టుకొని స్మార్ట్‌ఫోన్ రీసెట్ చేయాలి.

    Google: ఈ సెట్టింగ్స్ మారిస్తే మీ గూగుల్ అకౌంట్ సేఫ్... వెంటనే మార్చండి ఇలా

    Redmi Note 10 Pro Max: ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.1,999 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితం

    మీ స్మార్ట్‌ఫోన్ రీసెట్ చేయడానికి ముందు మీ గూగుల్ అకౌంట్, వాట్సప్ అకౌంట్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ట్రూకాలర్ లాంటి అన్ని అకౌంట్స్ నుంచి లాగౌట్ కావాలి. ఇందుకోసం సెట్టింగ్స్‌లో అకౌంట్స్ ఓపెన్ చేస్తే మీరు ఆ స్మార్ట్‌ఫోన్‌లో లాగిన్ అయిన అకౌంట్ల వివరాలన్నీ ఉంటాయి. వాటి నుంచి లాగౌట్ కావాలి. ఆ తర్వాత మీ ముఖ్యమైన ఫైల్స్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో బ్యాకప్ చేసుకోవాలి. స్మార్ట్‌ఫోన్‌లో ఇక మీకు అవసరమైన, ముఖ్యమైన ఫైల్స్ ఏవీ లేవని నిర్థారించుకున్న తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి.

    Samsung Galaxy F22: కాసేపట్లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 సేల్... డిస్కౌంట్ ఎంతంటే

    WhatsApp: వాట్సప్ నోటిఫికేషన్ చిక్కులకు ఇక చెక్... ఈ 7 కొత్త ఫీచర్స్ వస్తున్నాయి

    ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి సెట్టింగ్స్‌లో రీసెట్‌ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో అకౌంట్స్, కాంటాక్ట్స్, ఫోటోస్, వీడియోస్, యాప్స్, ఎస్‌డీ కార్డ్ డేటా లాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇవి కాకుండా Erase all data లేదా Factory Data Reset ఆప్షన్స్ ఉంటాయి. Erase all data లేదా Factory Data Reset క్లిక్ చేస్తే మీ ఫోన్ రీసెట్ అవుతుంది. రీసెట్ అయిన తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో మీ ఫైల్స్, అకౌంట్స్ ఏవీ కనిపించవు. మళ్లీ లాగిన్ చేయకుండా మీ పాత స్మార్ట్‌ఫోన్ అమ్మాలి. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో అమ్మేప్పుడు లేదా మీకు తెలిసినవారికి అమ్మే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎక్స్‌ఛేంజ్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలన్నా ఇలాగే రీసెట్ చేయడం మర్చిపోవద్దు.
    Published by:Santhosh Kumar S
    First published: