ARE YOU SEARCHING FOR TABLET FOR ONLINE CLASSES LENOVO TAB P11 LAUNCHED WITH QUALCOMM SNAPDRAGON 662 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS
Lenovo Tab P11: ఆన్లైన్ క్లాసుల కోసం కొత్త ట్యాబ్లెట్... లెనోవో ట్యాబ్ పీ11 రిలీజ్
Lenovo Tab P11: ఆన్లైన్ క్లాసుల కోసం కొత్త ట్యాబ్లెట్... లెనోవో ట్యాబ్ పీ11 రిలీజ్
(image: Lenovo India)
Lenovo Tab P11 | లెనోవో నుంచి మరో ట్యాబ్లెట్ రిలీజ్ అయింది. ఆన్లైన్ క్లాసులు, ఎంటర్టైన్మెంట్ కోసం లెనోవో ట్యాబ్ పీ11 ట్యాబ్లెట్ రిలీజ్ చేసింది కంపెనీ.
ఆన్లైన్ క్లాసుల కోసం లేటెస్ట్ ట్యాబ్లెట్ కోసం సెర్చ్ చేస్తున్నారా? వీకెండ్లో సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? లెనోవో నుంచి మరో కొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ట్యాబ్లెట్లకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఆన్లైన్ క్లాసులు, సినిమాల కోసం ట్యాబ్లెట్ కొనేవారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో కంపెనీలు కొత్త కొత్త ట్యాబ్లెట్స్ రిలీజ్ చేస్తున్నాయి. లెనోవో నుంచి సరికొత్త ట్యాబ్లెట్ ఇండియాకు వచ్చేసింది. లెనోవో ట్యాబ్ పీ11 రిలీజ్ అయింది. ఈ ట్యాబ్లెట్ గ్లోబల్ మార్కెట్లో చాలాకాలం క్రితమే రిలీజ్ అయింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఈ ట్యాబ్ ఇండియాకు రావడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఆన్లైన్ క్లాసులు, ఎంటర్టైన్మెంట్ లాంటి అవసరాలు తీర్చేందుకు యువతను దృష్టిలో పెట్టుకొని ఈ ట్యాబ్ రూపొందించింది లెనోవో.
లెనోవో ట్యాబ్ పీ11 స్పెసిఫికేషన్స్ చూస్తే 2,000 x 1,200 రెజల్యూషన్‌తో 11 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 81.8% ఉంది. ఈ ట్యాబ్లెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రిలీజ్ అయింది. మైక్రో ఎస్డీ కార్డుతో స్టోరేజ్ పెంచుకోవచ్చు. అల్యూమినియం అలాయ్ ఛేసిస్ ఉండటం విశేషం. కీబోర్డ్, స్టైలస్ లాంటి యాక్సెసరీస్ ఉపయోగించుకోవచ్చు.
లెనోవో ట్యాబ్ పీ11 ట్యాబ్లెట్లో 7,700ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎల్టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5.1 వర్షన్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. వైర్డ్ ఇయర్‌ఫోన్స్ వాడుకోవడానికి 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
లెనోవో ట్యాబ్ పీ11 ట్యాబ్లెట్లో 13మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కేవలం వైట్ కలర్లో మాత్రమే ఈ ట్యాబ్ లభిస్తుంది. లెనోవో ట్యాబ్ పీ11 ట్యాబ్లెట్ ధర రూ.24,999. లెనోవో ఇండియా అధికారిక వెబ్సైట్లో బుక్ చేయొచ్చు. ఆగస్ట్ 5న షిప్పింగ్ మొదలవుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్లలో త్వరలో అందుబాటులోకి రానుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.