Home /News /technology /

ARE YOU PLAYING MOBILE GAMES BE CAREFUL ABOUT CYBERATTACK ON GAMERS EVK

Technology : మొబైల్ గేమ్స్ ఆడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్ ఫోన్(Smart Phone) మ‌నం రోజూ ఏ ప‌ని చేయాల‌న్నా.. ఈ రోజుల్లో త‌ప్ప‌ని స‌రి. అంతే కాకుండా చాలా మంది ఫోన్‌లో గేమ్స్ ఆడుతుంటారు. ఈ మొబైల్ గేమ్‌ల వ‌ల్ల ఫోన్ యూజ‌ర్లు సైబ‌ర్ నేర‌గాళ్లు బారిన ప‌డే అవ‌కాశం ఉంది.

  నిత్య జీవితంతో స్మార్ట్‌ఫోన్‌లు భాగ‌మైంది. ఇంటర్నెట్ (internet) లేని ఫోన్‌ను ఊహించ‌డం అసంభ‌వం. టీనేజ‌ర్లు చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లు వాడుతంటారు. ఎక్క‌వ‌గా బ్రౌజింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌తో కాలం గ‌డుపుతుంటారు. దీంతో సైబ‌ర్ నేర‌గాళ్లు కూడా ఎక్కువైపోయారు. బ్రౌజింగ్ (Browsing) మ‌న జీవితంలో భాగంగా మారింది. ఇంటర్నెట్‌లో మ‌నం బ్రౌజ్‌చేసే స‌మాచారం అంతా సురక్షితం కాదు. మ‌నం ఏదైనా తెలియ‌కుండా వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే అందులో ఏ మాల్‌ వేర్‌ (Malware) ఉందో, ఏ ఎక్స్‌టెన్షన్‌ (Extension) వెనుక ఏ వైరస్‌ ఉందో, ఏ ఇమేజ్‌ కోడింగ్‌ ఏ యాడ్‌ వేర్‌ ఉందో ఎవరికీ తెలియడం లేదు. అలాగే ప‌లు యాప్‌లు వాడుతున్న‌ప్పుడు వ‌చ్చే నోటిఫికేష‌న్‌ల‌తో కూడా సైబ‌ర్ నేర‌గాళ్లు ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నారు.

  ఈ నేప‌థ్యంలో సైబర్‌ నేరస్తులు రూట్‌ మార్చి గేమ్స్‌ (Games) ఆడే వారిపై విరుచుకుపడుతున్నట్లు ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై పరిశోధకులు తన నివేదికలో వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు బ్లడీస్టీలర్ అని పిలువబడే కొత్త మాల్వేర్‌తో ఎక్కువగా గేమర్స్‌ను, వారి ఖాతాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారని కాస్పర్‌ స్కై (Kaspersky) పేర్కొంది. బ్లడీస్టీలర్ మాల్వేర్‌తో సెషన్ డేటా , పాస్‌వర్డ్స్‌, కుకీ ఎక్స్‌ఫిల్ట్రేషన్‌ను హ్యకర్లు పొందుతున్నట్లు కాస్పర్‌స్కై పేర్కొంది.

  Netflix : ఓటీటీలో సినిమాలే కాదు.. గేమ్స్ ఆడుకోవ‌చ్చు నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ఫీచ‌ర్‌


  ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడే యూజర్ల బ్యాంక్‌ కార్డ్‌ వివరాలను, బ్రౌజర్‌ ఆటోఫిల్‌డేటా, స్మార్ట్‌ఫోన్స్‌, కంప్యూటర్ల నుంచి స్క్రీన్‌ షాట్‌లను హ్యాకర్లు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ విష‌యాన్ని సంస్థ పేర్కొంది.

  అంతేకాకుండా ఆన్‌లైన్‌ గేమ్స్‌ (online Games) ఆడే వారి సంఖ్య బాగా పెరిగింది. అదేస్థాయిలో సైబర్‌ నేరస్తులు యూజర్లపై దాడిచేస్తున్నారు. కాస్పర్‌ స్కై నివేదిక ప్రకారం ఎపిక్ గేమ్స్, స్టీమ్‌, ఆరిజిన్‌, గాగ్‌. కామ్‌(GOG.com), బెథెస్డా, టెలిగ్రామ్ (Telegram), వైమ్‌ వరల్డ్‌ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌ యూజర్ల సెషన్ వివరాలను హ్యకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ స్టోర్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన జీటీఏ ఫైవ్‌, ఫార్ట్‌నైట్‌, బ్యాటిల్‌ ఫీల్డ్‌,ఫిఫా 2022 గేమ్స్‌ ఉన్నాయి. రష్యన్‌ ఫోరమ్‌లో బ్లడీస్టీలర్‌ అనే మాల్వేర్‌ తొలిసారిగా మార్చి 2021లో కాస్పర్‌స్కై గుర్తించింది. ఈ మాల్వేర్‌ సహాయంతో గేమర్స్‌ నుంచి టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా యూజర్ల నుంచి డబ్బులను వసూలు చేస్తోన్నట్లు కాస్పర్‌స్కై పేర్కొంది. ఈ నేప‌థ్యంలో వినియోగ‌దారులు ఆన్‌లైన్ గేమ్ ఆడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి. సెక్యూరిటీ సెట్టింగ్స్‌ (Security Settings) లేని యాప్‌ల‌ను వినియోగించుకోవ‌ద్దు. ఎప్పుడైన ఫోన్ హ్యాక్ అయిన‌ట్టు అనిపిస్తే అన‌వ‌స‌ర‌మైన గేమింగ్ యాప్‌ల‌ను తొల‌గించండి.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Cyber Attack, Internet, Latest Technology, Online fraud, Smartphone

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు